Post Office Scheme: సీనియర్ సిటిజన్లకు శుభవార్త.. నెలకు రూ.20,500 పొందవచ్చు!

Post Office Scheme: సీనియర్ సిటిజన్లకు శుభవార్త.. నెలకు రూ.20,500 పొందవచ్చు!

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన తపాల శాఖ ఎన్నో రకాల స్కీమ్ ను అందిస్తుంది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ వారి వారి అర్హతలను బట్టీ అనేక స్కీమ్స్ అందిస్తుంది. తాజాగా సీనియర్ సిటిజన్ల కోసం ఓ అద్భుత పథకం పోస్టాఫీస్ అందిస్తుంది. ఈ స్కీమ్ నెలకు రూ.20,000వరకు పొందవచ్చు.

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన తపాల శాఖ ఎన్నో రకాల స్కీమ్ ను అందిస్తుంది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ వారి వారి అర్హతలను బట్టీ అనేక స్కీమ్స్ అందిస్తుంది. తాజాగా సీనియర్ సిటిజన్ల కోసం ఓ అద్భుత పథకం పోస్టాఫీస్ అందిస్తుంది. ఈ స్కీమ్ నెలకు రూ.20,000వరకు పొందవచ్చు.

భారత దేశంలోని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రధాన వ్యవస్థల్లో తపాల శాఖ ఒకటి. దేశంలోనే అతి పెద్ద వ్యవస్థలో ఒకటిగా తపాల శాఖ కొనసాగుతుంది. ఒకప్పుడు పోస్టాఫీసు ద్వారా ఉత్తరాల మార్పిడి మాత్రమే జరిగేది. కాలం మారింది. అలానే ఈ శాఖలో అనేక మార్పులు వచ్చాయి. ప్రజలకు ఎన్నో అద్భుతమైన స్కీమ్స్ తో ఆకట్టుకుంటుంది. పిల్లల నుంచి పండు ముసలి వారి వరకు అందరికి ఏదో ఒక స్కీమ్ ను పోస్టాఫీస్ అందిస్తుంది. తాజాగా పోస్టాఫీస్ అందిస్తున్న ఓ పథకం సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఈ పథకం ద్వారా నెలకు రూ.20,500 పొందవచ్చు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

పోస్టాఫీస్ అనేక రకాల నెలవారీ ఆదాయ స్కీమ్ ను అందిస్తుంది. ఇప్పటికే పిల్లలు, మహిళలకు పలు రకాల సేవింగ్ స్కీమ్స్ ను అందిస్తుంది. అలానే సీనియర్ సిటిజన్లు కూడా వృద్దాప్యంలో ఆర్థిక ఇబ్బంది పడకుండా వారికి పోస్టాఫీస్ స్కీమ్ అందిస్తుంది. అదే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. వృద్దాప్యంలో సీనియర్ సిటిజన్ల నెలవారీ ఖర్చులను భరించేందుకు తపాలా శాఖ ఈ పథకాన్ని తీసుకొచ్చింది. కొన్ని షరతులను పాటిస్తూ.. ఈ స్కీమ్ ను చక్కగా ఉపయోగించుకోవచ్చు.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ లో మినిమ్ వెయ్యి రూపాయల నుంచి గరిష్టంగా 30 లక్షల వరకు పెట్టుకొవచ్చు. అయితే మనం ఎంత ఇన్వెస్ట్ మెంట్ చేసినాము అనే దానిపైనే మనకు వచ్చే ఆదాయం ఆధారపడి ఉంటుంది. యాదృచ్ఛికంగా ఈ పథకంలో పెట్టుబడికి సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ఉంది. సెక్షన్ 80సీ కింద రూ.15 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. 60 ఏళ్లు పైబడిన వారిని దృష్టిలో ఉంచుకుని ఈ పథకం రూపొందించబడింది. ఈ స్కీమ్ లో చేరితే.. పదవీ విరమణ తర్వాత సాధారణ ఆదాయాన్ని పొందవచ్చు. అలానే పదవీ విరమణ పొందినవారు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారికి ప్రస్తుతం ప్రభుత్వం 8.2 శాతం వరకు వడ్డీ చెల్లిస్తోంది.

ఈ పథకంలో, సీనియర్ సిటిజన్లు కలిసి రూ.15 లక్షలు పెట్టుబడి పెడితే త్రైమాసికానికి రూ.10,250 సంపాదించవచ్చు. 5 సంవత్సరాలలో వడ్డీ ఆదాయం రూ. 2 లక్షలు ఉంటుంది. ఒక వ్యక్తి గరిష్టంగా రూ. 30 లక్షలు పెట్టుబడి పెడితే, అతనికి రూ. 2,46,000 వడ్డీ వస్తుంది. అది నెలకు లెక్కవేసినట్లు అయితే రూ. 20,500 వరకు పొందవచ్చు. మూడు నెలల్లో 61,500 వస్తాయి.  సంవత్సరానికి 8.2 శాతం వడ్డీ. వడ్డీ మొత్తం ప్రతి 3 నెలలకు అందుబాటులో ఉంటుంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్, జూలై, అక్టోబర్ మరియు జనవరి మొదటి రోజున వడ్డీ వస్తుంది. ఈ స్కీమ్ కి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీ సమీపంలో ఉన్న పోస్టాఫీస్ ను సంప్రదించవచ్చు. మరి..పోస్టాఫీస్ అందిస్తున్న ఈ స్కీమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments