Sanju Samson And CSK Controversy: CSKను అవమానించిన సంజూ శాంసన్.. కావాలనే చేశాడా?

Sanju Samson: CSKను అవమానించిన సంజూ శాంసన్.. కావాలనే చేశాడా?

  • Author singhj Updated - 03:27 PM, Sat - 2 December 23

టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్​పై చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. అతడు తమ టీమ్​ను అవమానించాడని అంటున్నారు.

టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్​పై చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. అతడు తమ టీమ్​ను అవమానించాడని అంటున్నారు.

  • Author singhj Updated - 03:27 PM, Sat - 2 December 23

సంజూ శాంసన్.. ప్రస్తుత తరం భారత క్రికెటర్లలో అత్యంత ప్రతిభావంతుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. బ్యాటింగ్​ టాలెంట్​తో ఎంతో మంది అభిమానుల మనసులు దోచుకున్నాడు. డొమెస్టిక్​ లెవల్లో రాణించినా అతడికి అంత పేరు రాలేదు. కానీ ఇండియన్ ప్రీమియర్ లీగ్​ (ఐపీఎల్)లో అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్​తో అందరి దృష్టిని ఆకర్షించాడీ కేరళ కుర్రాడు. క్యాష్ రిచ్ లీగ్​లో పలు సీజన్లుగా కంటిన్యూగా పెర్ఫార్మ్ చేస్తూ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. అతడి క్లాస్ బ్యాటింగ్​ను ఇష్టపడేవాళ్లు చాలా మందే ఉన్నారు. ఐపీఎల్ పెర్ఫార్మెన్స్ ద్వారానే టీమిండియా తలుపు తట్టాడు సంజూ. అయితే నేషనల్ టీమ్​లో అతడికి అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. వచ్చిన పలు ఛాన్సులను కూడా సంజూ పూర్తిగా సద్వినియోగం చేసుకోలేదు. దీంతో ఇంత ఫేమ్ ఉన్నా, మంచి బ్యాటర్ అనే పేరున్నా భారత టీమ్​లో మాత్రం రెగ్యులర్ ప్లేయర్ కాలేకపోతున్నాడు.

గత టీ20 వరల్డ్ కప్​తో పాటు ఈ ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్​లోనూ భారత జట్టులో సంజూ శాంసన్​కు అవకాశం దక్కుతుందని అందరూ అనుకున్నారు. కానీ అతడ్ని ఈ రెండు మెగా టోర్నీలకూ సెలక్ట్ చేయలేదు. దీంతో శాంసన్ కెరీర్ ముగిసిందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా సౌతాఫ్రికా టూర్​కు అతడ్ని ఎంపిక చేశారు. సఫారీ టూర్​కు వెళ్తున్న భారత వన్డే టీమ్​లో సంజూకు చోటు కల్పించారు. దీంతో ఈ గోల్డెన్ ఛాన్స్​ను అతడు ఎలా వినియోగించుకుంటాడో చూడాలి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024 మినీ వేలంకు టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ అనేక రూమర్స్ తెరమీదకు వస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ విషయంలోనూ అదే జరిగింది. త్వరలో అతడు టీమ్ మారబోతున్నాడని.. రాజస్థాన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్​కు వెళ్లిపోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి.

సంజూ శాంసన్ గురించి ఓ న్యూస్ నెట్టింట వైరల్​గా మారింది. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్​ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాల్సిందిగా సంజూకు సీఎస్​కే మేనేజ్​మెంట్ భారీ ఆఫర్ ఇచ్చిందట. అందుకు సంబంధించి చెన్నై ప్రణాళికల్ని కూడా సిద్ధం చేసిందట. సీఎస్​కే ఇచ్చిన ఆఫర్​ను సంజూ తిరస్కరించాడట. అయితే ఫ్యూచర్​లో మాత్రం చెన్నై కెప్టెన్​గా సంజూ శాంసన్​ను చూడటం ఖాయమని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెప్పినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇది చూసిన సీఎస్​కే ఫ్యాన్స్​ తమ ఫ్రాంచైజీని సంజూ అవమానించాడని సీరియస్ అవుతున్నారు. అతడు కావాలనే ఇలా చేశాడని అంటున్నారు. అయితే ఈ వివాదంపై తాజాగా అశ్విన్ క్లారిటీ ఇచ్చాడు. ఇదంతా అబద్ధమని.. అసత్య ప్రచారాలకు తన పేరును వాడొద్దంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. మరి.. సంజూ-సీఎస్​కే కాంట్రవర్సీపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆసీస్​తో నాలుగో టీ20.. మూడు మార్పులతో బరిలోకి టీమిండియా!

Show comments