Romania Mathematician Win Lottery 14 Times: లాటరీలో గెలవాలనుందా.. ఈయనను ఫాలో అవ్వండి.. లాజిక్‌తో 14 సార్లు గెలిచి.. రూ.200 కోట్లు

Lottery: లాటరీలో గెలవాలనుందా.. ఈయనను ఫాలో అవ్వండి.. లాజిక్‌తో 14 సార్లు గెలిచి.. రూ.200 కోట్లు

లాటరీలో గెలవాలంటే లక్కు ఉండాలి. కానీ ఇక్కడ చెప్పిన వ్యక్తితో లక్కుతో పని లేదు.. లాజిక్కుతో విన్‌ అవుతాడు. ఇప్పటికి అలా 14 సార్లు లాజిక్కుతో లాటరీ గెలిచాడు. ఆ వివరాలు..

లాటరీలో గెలవాలంటే లక్కు ఉండాలి. కానీ ఇక్కడ చెప్పిన వ్యక్తితో లక్కుతో పని లేదు.. లాజిక్కుతో విన్‌ అవుతాడు. ఇప్పటికి అలా 14 సార్లు లాజిక్కుతో లాటరీ గెలిచాడు. ఆ వివరాలు..

అదృష్టం బాగాలేకపోతే.. అరటి పండు తిన్నా.. పళ్లు రాలతాయి అన్న సామెత ఉంది. నిజమే లక్కు కలిసి వస్తే.. పోయే ప్రాణాలు కూడా తిరిగి వస్తాయి. లేదంటే.. తాడే ప్రాణాలు తీస్తుంది. ఏం పనిచేయకుండా.. ఖాళీగా కూర్చుని.. కోటశ్వరులు కావాలని భావించే వారు చేసే పని లాటరీ టికెట్లు కొనడం. ఒక్కసారైనా లక్కు కలసి రాదా అని భావించి.. లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూ జీవితాన్ని గడిపేస్తారు. అయితే అదృష్టం అందరిని వరించదు. లక్కు కలిసి వచ్చిన వాళ్లు లాటరీ విన్‌ అవుతారు. కానీ ఇప్పుడు మీరు తెలుసుకోబోయే వ్యక్తి లక్కుతో పని లేకుండా ఓ చిన్న లాజిక్కుతో ఏకంగా 14 సార్లు లాటరీ గెలిచాడు. ఈ లెక్కల మాస్టారు.. లాటరీలలోని లాజిక్కుని పట్టుకుని.. విజేతగా నిలుస్తూ వచ్చాడు. ఆ వివరాలు..

రొమేనియాకు చెందిన ఓ గణిత శాస్త్రవేత్త.. లాటరీలలోని లాజిక్కును పసిగట్టి.. దానికి అనుగుణంగా టికెట్లు కొని లాటరీలో విజేతగా నిలుస్తూ వస్తున్నాడు. ఇతడి గురించి డైలీ స్టార్‌ అనే వెబ్‌సైట్‌ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. రొమేనియాలో నివాసం ఉండే స్టెఫాన్‌ మాండెల్‌ గణిత శాస్త్రవేత్త జీతం.. మన కరెన్సీతో పోలిస్తే.. 7 వేల రూపాయలు. అది అతడి అవసరాలకు ఏమాత్రం సరిపోయేది కాదు. దాంతో తన తెలివితేటలను వాడుకుని డబ్బు సాధించాలని భావించిన మాండెల్‌.. అంకెలను ఉపయోగించి.. ఓ సూత్రాన్ని రెడీ చేశాడు. దాని సాయంతో లాటరీ గెలిచాడు. ఇలా ఇప్పటికి 14 సార్లు లాటరీలో విన్‌ అయ్యాడు. ఇందుకోసం మాండెల్‌ స్వయంగా ఒక ప్రత్యేక అల్గారిథమ్‌ను క్రియేట్‌ చేసుకున్నాడు. అనేక పరిశోధనలు చేసిన తర్వాత.. సంఖ్యల ఎంపికకు అల్గారిథమ్‌ను రెడీ చేశాడు. దీనికి కాంబినేటోరియల్‌ కండెన్సేషన్‌ అనిపేరు పెట్టాడు.

తాను ఎన్ని లాటరీ టిక్కెట్లు కొన్నప్పటికీ, వాటికి అయ్యే ఖర్చు లాటరీ గెలిచిన తర్వాత వచ్చే డబ్బు కన్నా చాలా తక్కువే అని గుర్తించాడు మాండెల్‌. దాంతో లాటరీని దక్కించుకునేందుకు అధికంగా టిక్కెట్లు కొని జాక్‌పాట్ గెలిచేందుకు వివిధ కాంబినేషన్‌లను సిద్ధం చేసేవాడు. ఇది క్లిక్‌ అవడంతో మాండెల్‌ లాటరీల్లో విన్‌ అవుతూ వస్తున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా మాండెల్‌ లాటరీ సిండికేట్‌ను ఏర్పాటు చేశాడు. దీనిలో చేరినవారు స్టెఫాన్‌ సూచనలతో లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేసి గెలుపు అవకాశాలను పెంచుకుంటారు. ఆ తర్వాత లాటరీలో వచ్చే భారీ మొత్తాన్ని ఈ సిండికేట్‌ సభ్యులంతా పంచుకునేవారు. ఈ విధంగా సంపాదించిన డబ్బుతో మాండెల్‌ ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడు.

స్టెఫాన్ మాండెల్ తాను కనుగొన్న లెక్కల సూత్రం ఆధారంగా ఇప్పటికి మొత్తంగా 14 సార్లు లాటరీని గెలుచుకున్నాడు. తరువాతి కాలంలో యూకేలోనూ తన లాటరీ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అయితే అతని సిండికేట్‌పై దర్యాప్తు సంస్థల కన్నుపడింది. దీంతో పెద్దమొత్తంలో టిక్కెట్లు కొనడంపై నిషేధం విధించారు. దీనికి తోడు మాండెల్‌పై పలు కేసులు నమోదు కావడంతో.. కోర్టు ఖర్చుల కోసం భారీగా డబ్బులు వెచ్చించాల్సి వచ్చింది. దీంతో తాను కూడబెట్టిన సొమ్మునంతా పోగొట్టుకుని 1995లో తాను దివాలా తీసినట్లు ప్రకటించుకున్నాడు. ప్రస్తుతం మాండెల్‌ తన స్నేహితులతో పాటు వనాటు ద్వీపంలో నివసిస్తున్నాడు. యూనిలాడ్ నివేదిక ప్రకారం మాండెల్‌ 1960-70ల కాలంలోనే లాటరీలలో రూ. 200 కోట్లకుపైగా మొత్తాన్ని గెలుచుకున్నాడు.

Show comments