Jackpot: దురదృష్టంలో అదృష్టం అంటే నీదే భయ్యా.. క్యాన్సర్ రోగికి 10 వేల కోట్ల జాక్ పాట్

దురదృష్టంలో అదృష్టం అంటే నీదే భయ్యా.. క్యాన్సర్ రోగికి 10 వేల కోట్ల జాక్ పాట్

అతడు క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డాడు. ఇదంతా తన దురదృష్టం అని ఫీల్ అయ్యాడు. కీమో థెరపీ చేయించుకున్నాడు. జీవితంపై ఎలాంటి అంచనాలు లేకుండా బతుకుతున్న అతడికి.. బ్రతుకుపై ఆశలు కల్పించేలా చేసింది జాక్ పాట్

అతడు క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డాడు. ఇదంతా తన దురదృష్టం అని ఫీల్ అయ్యాడు. కీమో థెరపీ చేయించుకున్నాడు. జీవితంపై ఎలాంటి అంచనాలు లేకుండా బతుకుతున్న అతడికి.. బ్రతుకుపై ఆశలు కల్పించేలా చేసింది జాక్ పాట్

అదృష్టం ఒక్కసారే తలుపుతడుతుంది.. కానీ దురదృష్టం తలుపుతీసేంత వరకు కొడుతుందని సామెత. ఈ సామెతను చాలా మంది తమ జీవితాల్లో ఎప్పుడోకప్పుడు అన్వయించుకున్న వాళ్లే. అలాగే శ్రమించకుండా ఉన్న పళంగా డబ్బు వచ్చినా కూడా లక్కు ఉండాలిరా అని.. నక్క తోక తొక్కేచ్చావని అంటారు. అలా కష్టపడకుండా వచ్చిది ఒక్క లాటరీ రూపంలోనే. బికారినీ కూడా కోటీశ్వరుడ్ని చేసే సత్తా కేవలం లాటరీకి మాత్రమే ఉంది. ఒక్కసారి లాటరీ తగిలితే చాలు.. బంధువులు, ఇరుగు పొరుగు అంతా బెల్లం చుట్టూ ఈగలు మూగినట్లు మూగుతుంటారు. ఎక్కడ లేని రెస్పెక్ట్. మన వాడే అంటూ వరుసలు కలిపేస్తుంటారు. అంతా మనీ మహత్యం. జీవితంపై ఎలాంటి అంచనాలు లేకుండా బతుకుతున్న ఓ వ్యక్తికి.. బ్రతుకుపై ఆశలు కల్పించేలా చేసింది జాక్ పాట్

క్యాన్సర్ వ్యాధిన పడ్డ వ్యక్తి..చికిత్స చేయించుకునేందుకు డబ్బులు లేక ఇబ్బంది పడ్డాడు. అతడి ఆవేదన అర్థం చేసుకుందో కానీ కనిపించిన ఓ శక్తి.. లాటరీ రూపంలో జాక్ పాట్ తగిలేలా చేసింది. ఇప్పుడు కోట్లకు అధిపతి అవ్వడంతో ఉబ్బితబ్బిబ్బు అయిపోతున్నాడు. క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న అతడు.. ఇప్పుడు ఏకంగా లాటరీలో రూ. 10 వేల కోట్లను కొల్లగొట్టాడు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..లావోస్ ప్రాంతానికి చెందిన చెంగ్ సైఫాన్ అనే 46 ఏళ్ల వ్యక్తి కొన్నాళ్ల క్రితం అమెరికాలో స్థిరపడ్డాడు. అక్కడకు వెళ్లాక.. క్యాన్సర్ బారిన పడ్డాడు. అప్పటి నుండి ఆ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. కొన్నాళ్లుగా కీమో చేయించుకుంటున్నాడు. దీనికి లక్షల్లో ఖర్చు అవుతుంది. దీంతో దిగుతు చెందుతున్నాడు సైఫాన్ అయిలే అతడు పవర్ బాల్ లాటరీలో టికెట్లు కొన్నాడు.

భార్య, స్నేహితుడితో కలిసి మొత్తం 20 పవర్ బాల్ టికెట్లు కొనుగోలు చేశారు సైఫాన్. గత నెల 7 వ తేదీన ఈ లాటరీని తీయగా.. కళ్లు చెదిరే రేంజ్‌లో జాక్ పాట్ తగిలింది అతడికి. వీళ్లు కొన్న 20 టికెట్లలో ఐదు లాటరీలు జాక్ పాట్స్ కొట్టాయి. దీంతో వారికి 1.3 బిలియన్ డాలర్లు బంఫర్ ప్రైజ్ తగిలింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాలా రూ.108,555,252,000 అన్నమాట. అప్పటి వరకు తాను దురదృష్టవంతుడ్ని అని ఫీలైన సైఫాన్.. లెక్కపెట్టలేనంత మనీ గెలుచుకోవడంతో ఎగిరి గంతులేస్తున్నాడు. ఇందులో 422 మిలియన్ డాలర్లు (రూ.3500 కోట్లు) ట్యాక్స్ కింద కట్ చేసి మిగిలిన సొమ్మును చెంగ్ సైఫాన్‌కు అందజేయనున్నారు. కాగా, ఈ భారీ మొత్తాన్ని తన భార్య, స్నేహితుడితో కలిసి పంచుకుంటానని చెప్పాడు సైఫాన్. అలాగే క్యాన్సర్ ట్రీట్ మెంట్ కోసం వినియోగిస్తానని తెలిపాడు

Show comments