రోహిత్ ఇంప్యాక్ట్ ప్లేయరా అంటూ హార్ధిక్‌ని తిట్టారు! కానీ.. పాండ్యా చేసిన త్యాగం తెలుసా?

రోహిత్ ఇంప్యాక్ట్ ప్లేయరా అంటూ హార్ధిక్‌ని తిట్టారు! కానీ.. పాండ్యా చేసిన త్యాగం తెలుసా?

Rohit Sharma, Hardik Pandya: కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మను ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌గా ఆడిస్తావా అంటూ హార్ధిక్‌ పాండ్యాను అంతా తిట్టారు. కానీ, అసలు విషయం తెలిస్తే.. అతనికి చేతులెత్తి దండం పెడతారు. అసలు విషయం ఏంటంటే..?

Rohit Sharma, Hardik Pandya: కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మను ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌గా ఆడిస్తావా అంటూ హార్ధిక్‌ పాండ్యాను అంతా తిట్టారు. కానీ, అసలు విషయం తెలిస్తే.. అతనికి చేతులెత్తి దండం పెడతారు. అసలు విషయం ఏంటంటే..?

ఐపీఎల్‌ 2024లో భాగంగా కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఓటమి పాలైన విషయం తెలిసిందే. శుక్రవారం ముంబైలోని వాంఖడే క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 24 పరుగుల తేడాతో గెలిచింది. అయితే.. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మను ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌గా ఆడించింది ముంబై ఇండియన్స్‌. ఈ నిర్ణయంపై రోహిత్‌ శర్మ అభిమానులతో పాటు క్రికెట్‌ ఫ్యాన్స్‌ కూడా ఫైర్‌ అయ్యారు. రోహిత్‌ శర్మ లాంటి గొప్ప ప్లేయర్‌ను కేవలం బ్యాటింగ్‌ కోసం మాత్రమా వాడుకుంటారా? అతని కెప్టెన్సీ అనుభవం పాండ్యాకు అక్కర్లేదా? అంటూ ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యాపై క్రికెట్‌ అభిమానులు దుమ్మెత్తిపోశారు. కానీ, అసలు నిజం తెలిస్తే.. పాండ్యాను తిట్టిన వాళ్లే.. చేతులెత్తి దండం పెడతారు. అసలింతకీ పాండ్యా ఏం చేశాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

కేకేఆర్‌తో మ్యాచ్‌లో రోహిత్‌ శర్మను ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌గా ఆడించాలన్న నిర్ణయం పాండ్యాదే. అయితే.. దాని వెనుక దేశంపై ప్రేమ, రోహిత్‌ శర్మపై గౌరవం ఉన్నాయి. అది ఎలాగంటే.. కేకేఆర్‌తో మ్యాచ్‌ కంటే ముందు రోహిత్‌ శర్మ వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఈ విషయం నిన్న మ్యాచ్‌ ముగిసేంత వరకు ఎవరికీ తెలియదు. అయితే.. టీమిండియాకు కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ శర్మ వెన్నునొప్పితో ఫీల్డింగ్‌ చేయడం సరికాదని, ఫీల్డింగ్‌ చేస్తున్న క్రమంలో ఆ నొప్పి ఎక్కువై, గాయం పెద్దది అయితే.. ముంబై ఇండియన్స్‌ కంటే టీమిండియాకు ఎక్కువ నష్టం జరుగుతుందని ముందుగానే గ్రహించిన హార్ధిక్‌ పాండ్యా.. తొలుత రోహిత్‌ శర్మకు రెస్ట్‌ ఇవ్వాలని భావించాడు.

కానీ, ఛేజింగ్‌తో రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ చేయడం చాలా కీలకం అని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావించడంతో తప్పిని పరిస్థితుల్లో రోహిత్‌ శర్మను ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌ రూపంలో బరిలోకి దింపాడు. ఒక వేళ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌ ఓడిపోయినా పర్వలేదు. కానీ, రోహిత్‌ శర్మను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక.. ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌గా ఆడించాడు. ముంబై ఓడిపోతే కెప్టెన్‌గా తనకు బ్యాడ్‌ నేమ్‌ వస్తుందని తెలిసినా.. పాండ్యా పట్టించుకోలేదు. రాబోయే టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్న విషయం తెలిసిందే. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 కోసం, టీమిండియా కోసం ఆలోచించి.. రోహిత్‌ శర్మతో ఫీల్డింగ్‌ చేయించలేదు. ప్రస్తుతం ఎలాగో ముంబై ఇండియన్స్‌ ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశం లేకపోవడంతో.. అవసరం అనుకుంటే.. రోహిత్‌ శర్మకు పూర్తిగా రెస్ట్‌ ఇచ్చేందుకు కూడా పాండ్యా ఆలోచిస్తున్నట్లు సమాచారం. రోహిత్‌ శర్మ గురించి, టీమిండియా గురించి ఇంతలా ఆలోచిస్తున్న పాండ్యాను అనవసరంగా తిట్టాం అంటూ ఈ విషయం తెలిసిన తర్వాత.. రోహిత్‌ శర్మ అభిమానులు కూడా ఫీల్‌ అవుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments