RGV Counter To Lokesh On Attack On CM YS Jagan: CM జగన్ పై దాడి: నారా లోకేష్‌కి RGV కౌంటర్.. ’బుర్రే కాదు హార్ట్ కూడా లేదు‘

CM జగన్ పై దాడి: నారా లోకేష్‌కి RGV కౌంటర్.. ’బుర్రే కాదు హార్ట్ కూడా లేదు‘

Attack On CM YS Jagan: సీఎ జగన్ పై జరిగిన దాడిపై స్పందిస్తూ.. నారా లోకేష్ చేసిన ట్వీట్ పై ఆర్జీవీ మండిపడ్డారు. నీకు బుర్రే కాదు హార్ట్ కూడా లేదంటూ ఘాటుగా విమర్శించారు.

Attack On CM YS Jagan: సీఎ జగన్ పై జరిగిన దాడిపై స్పందిస్తూ.. నారా లోకేష్ చేసిన ట్వీట్ పై ఆర్జీవీ మండిపడ్డారు. నీకు బుర్రే కాదు హార్ట్ కూడా లేదంటూ ఘాటుగా విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. అధికార, విపక్ష పార్టీలు.. హోరాహోరిగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఎలక్షన్ క్యాంపెయిన్ లో సీఎం జగన్ విపక్షాల కన్నా రెండడుగులు ముందే ఉన్నారు. ప్రస్తుతం ఆయన మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించే క్రమంలో భాగంగా శనివారం నాడు విజయవాడకు చేరుకున్నారు. అయితే ఆ సమయంలో గుర్తు తెలియని ఆగంతుకుడు.. జగన్ మీద రాయితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆయన ఎడమ కన్నుకు గాయం అయ్యింది. వెంటనే స్పందించిన వైద్యులు.. బస్సులోనే జగన్ కు ప్రథమ చికిత్స చేశారు. దాడి నేపథ్యంలో నేడు బస్సు యాత్రకు విరామం ఇచ్చారు.

సీఎం జగన్‌‌పై దాడి జరిగిన తర్వాత నారా లోకేష్ ఎక్స్‌లో ఇలా రాసుకొచ్చాడు.. ’’రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావ్? ఇంకెక్కడి నుంచి వస్తా తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చా. కొత్తగా ఏదైనా ట్రై చేయి జగన్‘‘ అంటూ పోస్ట్ చేయడమే కాక 2019 కోడికత్తి, 2024 రాయి అంటూ ఫొటోలు పోస్ట్ చేశారు. దీనిపై డైరెక్టర్ ఆర్జీవీ ఘాటుగా స్పందించారు. ’’లోకేష్ పోస్ట్ చూశాక.. ఆయనకు బుర్రే కాదు హృదయం కూడా లేదని తేలిపోయింది. అయినా ఒక రాయిని అంత సూటిగా, అనుకున్న చోట తగిలేలా అంత ఖచ్చితంగా ఎలా విసరవచ్చో.. మీరు కాస్త వివరిస్తారా లోకేష్. ఒకవేళ ఆ రాయి ఒక ఇంచు కిందకి తగిలి కంటికి గాయమైతే పరిస్థితి ఏంటి. అప్పుడు కూడా జగనే ప్లాన్ చేశారని ఇంతే దరిద్రంగా ఆలోచిస్తావా లోకేష్‘‘ అంటూ ట్విట్టర్ వేదికగా.. ఆర్జీవీ నిప్పులు చెరిగారు.

ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. వైసీపీ కార్యకర్తలు లోకేష్ పై మండిపడుతున్నారు. ఇక మంత్రి పెద్దిరెడ్డి ఈ పోస్ట్ పై స్పందిస్తూ.. లోకేష్ వ్యాఖ్యలు చూస్తే.. జగన్ పై దాడి చేసింది టీడీపీ వాళ్లే అనే అనుమానాలు బలపడుతున్నాయి అంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలీసులు ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు.

Show comments