Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అరుదైన ఘనత.. ఆ లిస్ట్ లోకి..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అరుదైన ఘనత.. ఆ లిస్ట్ లోకి..

  • Author Soma Sekhar Published - 11:46 AM, Thu - 2 November 23

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. మరి చరణ్ సాధించిన ఆ ఘనత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. మరి చరణ్ సాధించిన ఆ ఘనత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Author Soma Sekhar Published - 11:46 AM, Thu - 2 November 23

RRR మూవీతో హాలీవుడ్ లో సంచలనం సృష్టించారు యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ డైరెక్టర్ రాజమౌళి. ఈ చిత్రంతో ప్రపంచం మెుత్తం టాలీవుడ్ వైపు చూసేలా చేశారు ఈ త్రయం. ఇక ఒరిజినల్ స్కోర్ విభాగంలో నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కిన విషయం అందరికి తెలిసిన విషయమే. దీంతో ఆస్కార్ అకాడమీ నుంచి ప్రైడ్ ఆఫ్ తెలుగు, మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటూ ఎన్టీఆర్ కు ఇప్పటికే గౌరవం దక్కడంతో పాటుగా.. యంగ్ టైగర్ కు అకాడమీలోని ప్రతిష్టాత్మకమైన యాక్టర్స్ బ్రాంచ్ లో మెంబర్ గా చేర్చిన విషయం కూడా తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి చేరాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. దీంతో చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

ఆస్కార్ అకాడమీ గతంలో విడుదల చేసిన జాబితాలో పలు శాఖల్లో RRR మూవీ టీమ్ మెంబర్స్ ను అకాడమీ సభ్యులుగా చేర్చుకున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే అకాడమీ యాక్టర్స్ బ్రాంచ్ లోకి జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకుంది. తాజాగా మరో టాలీవుడ్ హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ను సైతం యాక్టర్స్ బ్రాంచ్ లోకి తీసుకున్నట్లు వెల్లడించింది. దీంతో మెగాఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అప్పుడు తారక్.. ఇప్పుడు రామ్ చరణ్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా.. ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచిలో సభ్యులుగా చేరడం వల్ల ఆస్కార్ అవార్డు కోసం దరఖాస్తు చేసుకున్న నటీనటులను ఎన్నుకునే అర్హత లభిస్తుంది. ఇక ఇప్పటికే అకాడమీ 10 వేల మందికి పైగా సభ్యులను ఆయా శాఖల్లో జాయిన్ చేసుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్ ఇటలీలో ఉన్నారు. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్.. వాయిదాలు పడుతూ సాగుతోంది. ఇక దీపావళి కానుకగా ఫస్ట్ సింగిల్ రాబోతున్నట్లు సమాచారం. మరి రామ్ చరణ్ సాధించిన ఈ అరుదైన ఘనతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments