Posani Comments On Chiranjeevi: రాజకీయాలకు ఆయన అన్ ఫిట్.. చిరుపై పోసాని సంచలన వ్యాఖ్యలు!

రాజకీయాలకు ఆయన అన్ ఫిట్.. చిరుపై పోసాని సంచలన వ్యాఖ్యలు!

Posani Comments On Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన సినిమాలతోఫుల్ బిజిగా ఉన్నారు. రాజకీయాలకు చాలా దూరంగా ఉంటున్నారు. అయితే ఇటీవల చిరు చేసిన కామెంట్స్ పై పోసాని కృష్ణ మురళి హాట్ కామెంట్స్ చేశారు.

Posani Comments On Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన సినిమాలతోఫుల్ బిజిగా ఉన్నారు. రాజకీయాలకు చాలా దూరంగా ఉంటున్నారు. అయితే ఇటీవల చిరు చేసిన కామెంట్స్ పై పోసాని కృష్ణ మురళి హాట్ కామెంట్స్ చేశారు.

ఏపీలో ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడింది. దీంతో అన్ని ప్రధాన పార్టీలు  ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ముఖ్యంగా అధికార వైఎస్సార్ సీపీ 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది. అలానే  ప్రతిపక్ష కూటమి సైతం  సీఎం జగన్ మోహన్ రెడ్డి విజయాన్ని అడ్డుకోవాలని తీవ్రంగా కృషి చేస్తుంది. ఈ సారి ఎన్నికలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీ ఎన్నికలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించని సంగతి తెలిసిందే. తాజాగా పవన్ కల్యాణ్ ను గెలిపించండి అంటూ ఓ వీడియోను విడుదల చేశారు. ఇక చిరంజీవి కామెంట్స్ పై పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు.

పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కోసం పలువురు సినీ ఆర్టిస్టులు కూడా ప్రచారం  చేస్తున్నారు. అలానే మెగా కాపౌండ్ నుంచి పలువురు యంగ్ హీరోలు ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో  తాజాగా మెగాస్టార్ చిరంజీవి ..పవన్ కల్యాణ్ మద్దతుగా ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఆయన  చేసేన వ్యాఖ్యలపై పలువురు వైసీపీ నేతలు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా చిరంజీవి వ్యాఖ్యలపై ఏపీ ఫిల్మ్ ఫెడరేషన్ అండ్ థియేటర్స్ కార్పోరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి ఫైర్ అయ్యారు.

రాజకీయాలకు చిరంజీవి అన్ ఫిట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చిరంజీవికి ప్రజలు అంటే లెక్క లేదని, ప్రజా సేవ పేరుతో ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టీ మూసేశాడని ఆయన తెలిపారు. చిరంజీవికి ప్రజలపై ప్రేమ లేదని, సినిమాలానే రాజకీయాల్ని వ్యాపారంలా చూశాడని పోసాని చెప్పుకొచ్చారు. ఆయన పార్టీ తరపున 18 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే.. వారిని కాంగ్రెస్ కి అమ్మేశాడని గుర్తు చేశారు. ఆ తరువాత రాజకీయాలు వద్దని సినిమాలోకి వెళ్ళాడని ఇప్పుడు మళ్ళీ పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తున్నాడని పోసాని తెలిపారు. ప్రజలకి వెన్నుపోటు పొడిచిన చిరంజీవికి ఓటు వేయమని అడిగే అర్హత లేదని, ఆయను నమ్మి చాలా మంది కాపులు జీవితాలు నాశనం చేసుకున్నారని పోసాని తెలిపారు.

ఇక ఇదే మీటింగ్ లో చంద్రబాబుపై కూడా పోసాని తీవ్ర స్థాయిలో విరుచకపడ్డారు. అభివృద్ధి అంటే పెద్ద పెద్ద బిల్డింగ్ లు కాదని, ప్రజల అభివృద్ధే  రాష్ట్రాభివృద్ధని ఆయన చెప్పుకొచ్చారు.  చంద్రబాబు పాలనలో పేదలు ప్రాణంలేని వారిలాగా ఉండిపోయారని ఆయన తెలిపారు. అలానే జగన్ సంక్షేమ పాలనలో తిరిగి పేదలు అభివృద్ధిలోకి వచ్చారని పట్టణాల్లో ఉండే ధనవంతులకు గ్రామాల్లో ఉండే పేదల కష్టాలు ఎలా తెలుస్తాయి..? ఆయన ప్రశ్నించాడు. ఆ పేదల కష్టాలు స్వయంగా దగ్గర నుంచి చూశారు కాబట్టి సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేశారు. చంద్రబాబు, ఆయన టీమ్ కి పేదలు అభివృద్ధి చెందడం ఇష్టం లేదని పోసాని ఫైర్ అయ్యారు. మరి.. పోసాని చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments