మండే ఎండలకు.. పెట్రోల్ బంక్ యజమాని ఐడియా.. క్యూ కడుతున్న కస్టమర్స్!

మండే ఎండలకు.. పెట్రోల్ బంక్ యజమాని ఐడియా.. క్యూ కడుతున్న కస్టమర్స్!

రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగా మండిపోతూ.. నిప్పులు కురిపిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం అధిక ఉష్ణోగ్రతలతో నిప్పుల కొలిమిని తలపిస్తోంది.  ఉదయం 9 గంటల నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ పెట్రోల్ బంక్ యాజమాని అదిరిపోయే ఐడియా వేసి.. వారి ఉపశమనం కల్పించారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగా మండిపోతూ.. నిప్పులు కురిపిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం అధిక ఉష్ణోగ్రతలతో నిప్పుల కొలిమిని తలపిస్తోంది.  ఉదయం 9 గంటల నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ పెట్రోల్ బంక్ యాజమాని అదిరిపోయే ఐడియా వేసి.. వారి ఉపశమనం కల్పించారు.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు మండే అగ్నిగోళంలా మండిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి జనం అల్లాడిపోతున్నారు. బయటకు వచ్చేందుకు కూడా వణికిపోతున్నారు. ఉదయం 10 గంటల నుంచి జనాల మాడులు పగిలిపోతున్నాయి. ఇప్పుడే 40 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఎండల నుంచి తప్పించుకునేందుకు జనాలు అనేక ఐడియాలు ఫాలో అవుతుంటారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం సమయంలో జనాలు పడుతున్న కష్టాలను గమనించిన ఓ పెట్రోల్ బంక్ యజమాని వినూత్నంగా ఆలోచించాడు.  తన బంక్‌కు వచ్చే కస్టమర్లకు ఎండ వేడిమి నుంచి కాసేపు ఉపశమనం కలిగించేందుకు తనవంతు ప్రయత్నం చేశాడు. మీ ఐడియా అదుర్స్ గురు అంటూ పలువురు ప్రశంసలు గురిపించారు. ఇంతకి ఆయన చేసిన పని ఏమిటో ఇప్పుడు చూద్దాం..

రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగా మండిపోతూ.. నిప్పులు కురిపిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం అధిక ఉష్ణోగ్రతలతో నిప్పుల కొలిమిని తలపిస్తోంది.  ఉదయం 9 గంటల నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. బయటికి రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ఇప్పటికే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదువతుండటంతో.. వాతావరణ శాఖ కూడా ఆయా ప్రాంతాలకు ఎల్లో, రెడ్ అలర్టులు ప్రకటించింది. ఈ క్రమంలోనే ఎండకు జనాలు పడుతున్న ఇబ్బందులు గమనించి ఓ పెట్రోల్ బంక్ యాజమాని అదిరిపోయే ఐడియా వేసి.. వారి ఉపశమనం కల్పించారు.

కరీంనగర్‎ పట్టణంలోని జ్యోతినగర్ మల్కాపూర్ రోడ్‎లో ఉన్న ఓ పెట్రోల్ బంక్ యజమాని కొత్తగా ఆలోచించాడు. తన బంకుకు వచ్చే వాహనదారులకు ఎండల నుంచి ఉపశమనం కల్పించేందుకు..  తన బంక్ వద్దు ప్రత్యేకంగా స్పింక్లర్లు ఏర్పాటు చేశాడు. వాటి నుంచి నీటి జల్లులను కురిపిస్తున్నాడు. రోజూ మధ్యాహ్నం వేళల్లో సుమారు 5 నుంచి 5 గంటల వరకు బంక్ చుట్టూ ఏర్పాటు చేసిన ఈ స్పింక్లర్ల ద్వారా నీరు స్ప్రే చేస్తున్నారు. దీంతో.. ఎండ వేడి నుంచి కొంత వరకు ఉపశమనం కలుగుతోంది. కరీంనగర్  పరిసరాల్లో ప్రాంతాల్లో ప్రయాణించే వారు బంకు వద్దకు చేరుకుంటుని చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.

వాహనదారులు ఆ బంకు వద్దకు చేరుకోగానే మండే ఎండల నుంచి కొంత ఉపశమనం పొందుతున్నారు. పెట్రోల్ బంక్ యజమాని చేసిన ఈ ఆలోచనకు.. వాహనదారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మీ ఐడియా అదుర్స్ గురు అంటూ నెటిజన్లు ప్రశంసలు తెలుపుతున్నారు.  అయితే ఆ  పెట్రోల్ బంక్ యాజమాని స్ర్పింకర్లను ఏర్పాటు చేసింది..కేవలం వాహనదారుల కోసమే కాదండో.. ఈ ఎండ వేడికి పెట్రోల్ బంక్‌లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకని సిబ్బంది చెప్తున్నారు. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు మధ్యాహ్నం నుంచి ఎండ తీవ్రత తగ్గేవరకు.. పెట్రోల్ బంక్‎లో నీరు స్ప్రే చేయడం మంచిదని భావిస్తున్నారు. సదరు పెట్రో బంక్ యాజమాని ముందు జాగ్రత్తకు అందరు అభినందనలు తెలుపుతున్నారు. మరి.. ఈ వ్యక్తిపై మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments