వారాహి యాత్రలో Jr.NTR పై పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్! Jr.NTR అంటే..

వారాహి యాత్రలో Jr.NTR పై పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్! Jr.NTR అంటే..

  • Author Soma Sekhar Published - 04:50 PM, Sat - 17 June 23
  • Author Soma Sekhar Published - 04:50 PM, Sat - 17 June 23
వారాహి యాత్రలో Jr.NTR పై పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్! Jr.NTR అంటే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది నాయకులు సమావేశాలు, యాత్రలు, సభలు పెడుతూ.. మాటల తూటాలు పేల్చుతున్నారు. ఇక జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్రను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ యాత్ర ద్వారా రాష్ట్ర ప్రజల కష్టాలను తెలుసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్. తాజాగా పిఠాపురం చేసుకున్న వారాహీ యాత్రలో పవన్ కళ్యాణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇటు సినిమాలతో పాటుగా అటు క్రీయాశీల రాజకీయాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. జనసేన పార్టీ తాజాగా చేపట్టిన వారాహి యాత్రకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా వారాహి యాత్ర పిఠాపురం చేరుకుంది. అక్కడ జరిగిన యాత్రలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, చిరంజీవి, రామ్ చరణ్ లు అంటే తనకు ఎంతో ఇష్టం అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో ఇష్టం అని అన్నారు పవన్.

ఈ క్రమంలోనే వారి సినిమాలను ఎంతో ఇష్టంగా చూస్తానని, అయితే రాజకీయాలు, సినిమాలు వేర్వేరని పవన్ అన్నారు. పాలిటిక్స్ దగ్గరికి వచ్చేసరికి అందరి హీరోలు ముక్త కఠంతో.. ప్రజలకు మద్ధతు పలకాలని ఈ సందర్బంగా పేర్కొన్నారు. అలాగే నా ఒక్కడి వల్లే సినిమా పరిశ్రమ ఆడట్లేదని చెప్పుకొచ్చారు. నేను సినిమా తీస్తే సుమారు 500-600 మందికి ఎంప్లాయ్ మెంట్ దొరుకుతుందన్నారు. కానీ కాకినాడ ఎమ్మెల్యే ఎంత మందికి ఎంప్లాయ్ మెంట్ ఇచ్చాడు అని ప్రశ్నించారు. ఇండియాలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే లీడింగ్ హీరోల్లో నేనూ ఒక్కడిని అని తెలిపారు. ఈ క్రమంలో పవన్ మాట్లాడుతున్నంత సేపు సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు ప్రజలు.

Show comments