OTT లో పంచాయత్ సిరీస్ మూడవ సీజన్ పై తాజా అప్ డేట్ వచ్చేసింది..

Panchayath Season 3: OTT లో పంచాయత్ సిరీస్ మూడవ సీజన్ పై తాజా అప్ డేట్ వచ్చేసింది..

సిరీస్ లను ఇష్టపడని వారు ఎవరు ఉండరు. దీనితో మేకర్స్ కూడా ఒక సిరీస్ ను సీజన్స్ వారీగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సిరీస్ లవర్స్ కు ఓ గుడ్ న్యూస్.. ఎందుకంటే వారి ఫేవరేట్ సిరీస్ మూడవ సీజన్ రాబోతుంది.

సిరీస్ లను ఇష్టపడని వారు ఎవరు ఉండరు. దీనితో మేకర్స్ కూడా ఒక సిరీస్ ను సీజన్స్ వారీగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సిరీస్ లవర్స్ కు ఓ గుడ్ న్యూస్.. ఎందుకంటే వారి ఫేవరేట్ సిరీస్ మూడవ సీజన్ రాబోతుంది.

సినిమాలకంటే కూడా.. సిరీస్ లకు ఎక్కువ ఆదరణ లభిస్తున్న క్రమంలో.. సిరీస్ మేకర్స్ వీటిని ఇంకాస్త ఆసక్తిగా తీసుకుని వెళ్తూ .. వీటిని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఎన్నో జోనర్స్ కు సంబంధించిన వెబ్ సిరీస్ లు.. అనేక సీజన్స్ గా వచ్చాయి. ప్రేక్షకులు కూడా వచ్చిన ప్రతి సీజన్ ను ఎంతో ఇష్టంగా ఆదరిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు సిరీస్ జోనర్ లో వచ్చినవి అన్నీ కూడా మంచి వ్యూవర్ షిప్ దక్కించుకున్నాయి. దీనితో ఇప్పుడు ప్రేక్షకులు ఎంతో ఇష్టంగా చూసిన.. పంచాయత్ వెబ్ సిరీస్ సక్సెస్ ఫుల్ గా రెండు సీజన్స్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు దీనికి మరొక సీజన్ ను ప్రకటించారు మేకర్స్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పంచాయత్ మొదటి రెండు సీజన్స్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉన్నాయి. మొదటి రెండు సీజన్స్ చూసిన ప్రేక్షకులు.. మూడవ సీజన్ కోసం ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. దీనితో వీరి కోసం అమెజాన్ ప్రైమ్… ఏప్రిల్ 29 న ఓ వీడియో రిలీజ్ చేశారు. సీజన్ 3 ను అతి త్వరలో ప్రకటిస్తామంటూ.. “ఓపెన్ చేయొద్దండి.. లోపల పంచాయత్ సీజన్ 3 డేట్ ఉంది!” అనే పేపర్ ఓ రిఫ్రిజిరేటర్‌కు అంటించి ఉంది. అయితే, ఆ డోర్ ఓపెన్ చేయగా లోపల అన్నీ సొరకాయలు ఉన్నట్టు వీడియోలో ఉంది. “ట్రై చేశారుగా.. అంత సింపుల్ కాదు.. స్టే ట్యూన్డ్” అంటూ సరదాగా రాసుకొచ్చింది. అంటే త్వరలోనే అందరి ఫేవరేట్ పంచాయత్ సీజన్ 3 రాబోతుంది. మరి ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ కోసం వెయిట్ చేయాల్సి ఉంది.

అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ ఇప్పటికే చాలా ముఖ్యమైన వాటిలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ సిరీస్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈ సిరీస్ ను ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత.. అంటే మే 26 తర్వాత పంచాయత్ సిరీస్ ను ఓటీటీ లోకి తీసుకు వస్తారనే బజ్ నడుస్తుంది. మరి అమెజాన్ ప్రైమ్ ఏ తేదీని ఫిక్స్ చేస్తుందో వేచి చూడాలి. ఇక ఇప్పటివరకు మొదటి రెండు సీజన్స్ ను మిస్ చేసిన వారుంటే వెంటనే ఈ సిరీస్ ను చూసేయండి. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథ.. అందులోని కామెడీ అందరిని బాగా అఆకట్టుకుంది. 2020 లో మొదటి సీజన్ రాగ, 2022 లో రెండవ సీజన్ వచ్చింది. ఇక ఇప్పుడు 2024 లో పంచాయత్ మూడవ సీజన్ ను విడుదల చేయనున్నారు మేకర్స్. మరి ఈ సిరీస్ రిలీజ్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments