OTT Suggestions- Must Watch Movie: రమ్యకృష్ణ పో*ర్న్ స్టార్ గా నటించిన బోల్డ్ మూవీ! OTTలో ఉంది చూశారా?

రమ్యకృష్ణ పో*ర్న్ స్టార్ గా నటించిన బోల్డ్ మూవీ! OTTలో ఉంది చూశారా?

OTT Suggestions: ఓటీటీల్లో ఎన్నో సినిమాలు ఉంటాయి. కానీ, వాటిలో ఏది చూడాలో ఒక పట్టాన అర్థం కాదు. అలాంటి వారికోసం ఓటీటీ సజీషన్స్ తీసుకొచ్చాం. ఈ మూవీ అయితే మీరు అస్సలు మిస్ కాకూడదు.

OTT Suggestions: ఓటీటీల్లో ఎన్నో సినిమాలు ఉంటాయి. కానీ, వాటిలో ఏది చూడాలో ఒక పట్టాన అర్థం కాదు. అలాంటి వారికోసం ఓటీటీ సజీషన్స్ తీసుకొచ్చాం. ఈ మూవీ అయితే మీరు అస్సలు మిస్ కాకూడదు.

సినిమాల్లో ఎన్ని జానర్స్ చూసినా ఒక మంచి ఎమోషనల్ డ్రామా చూస్తే వచ్చే కిక్ వేరుగా ఉంటుంది. నిజానికి కాస్త ఎమోషనల్ గా ఉన్నా, కన్నీళ్లు తెప్పించినా అలాంటి సినిమాలు చూసిన తర్వాత వచ్చే ఫీల్ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. అలాంటి సినిమాలు చూడటం స్టార్ట్ చేయడం కష్టం. కానీ, స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం ఆపడం చాలా కష్టం. అలాంటి సినిమాలు ఓటీటీలో చాలానే ఉన్నాయి. కానీ, వాటిలో ఏ మూవీ చూడాలో ఆడియన్స్ అర్థం కాదు. స్టార్ట్ చేశాక బాగుంటుందో లేదో.. అంత క్లారిటీ కూడా ఉండదు. అలాంటి వారికి ఈ మూవీ మంచి సజీషన్ అనే చెప్పాలి. ఓటీటీలో తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతోంది. చాలామంది ఈ మూవీని లైట్ తీసుకున్నారు. కానీ, ఇది ఎన్నో అవార్డులు కూడా గెలుచుకుంది. పైగా ఐఎండీబీలో 8.3 రేటింగ్ కూడా సొంతం చేసుకుంది. మరి ఆ సినిమా ఏది? ఆ మూవీ ఎందుకంత స్పెషల్?

తెలుగు ప్రేక్షకులకు డ్రామా అంటే ఎంతో ఇష్టం. అందుకే మలయాళం సినిమాలకు ఓటీటీలో అంత క్రేజ్ వస్తోంది. సరైన కథ ఉంటే ఎంత పెద్ద డ్రామా అయినా కన్నార్పకుండా చూస్తారు. వేదం సినిమా అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పాలి. అలాంటి ఒక సినిమానే మనం ఇప్పుడు చెప్పుకోబోయేది. ఆ మూవీ మరేదో కాదు.. ‘సూపర్ డీలక్స్’. ఇది కూడా ఇంచు మించు వేదం మూవీ తరహాలోనే నలుగురు వ్యక్తులకు సంబంధించింది. ఆ నాలుగు కుటుంబాల్లో ఏం జరుగుతోంది? వాళ్లు ఎదుర్కొనే సమస్యలు ఏంటి? అసలు వారి జీవితాలు అలా ఎందుకు తయారయ్యాయి? వంటి అంశాలతో పక్కాగా తెరకెక్కించిన చిత్రమే ఈ సూపర్ డీలక్స్.

ఈ సూపర్ డీలక్స్ మూవీలో ఎంతో స్టార్స్ ఉన్నారు. రమ్యకృష్ణ, విజయ్ సేతుపతి, సమంత, ఫహద్ ఫాజిల్, భగవతి పెరుమాళ్ వంటి స్టార్స్ ఈ మూవీలో యాక్ట్ చేశారు. ఎవరికి వాళ్లు ఎంతో న్యాచురల్ గా తమ పాత్రలకు ప్రాణం పోశారు. ముఖ్యంగా ఈ మూవీలో విజయ్ సేతుపతి ట్రాన్స్ జెండర్ గా చేసిన పాత్ర అందరి హృదయాలను పిండేస్తుంది. భార్య, కొడుకుని వదిలేసి ముంబయి వెళ్లి ట్రాన్స్ జెండర్ గా మారతాడు. చానాళ్లకు తిరిగి భార్యా- కొడుకు దగ్గరకు వస్తాడు. ఆ తర్వాత అతని జీవితంలో జరిగిన సంఘటనలు అందరినీ కన్నీళ్లు పెట్టిస్తాయి. నిజానికి ఈ మూవీలో ప్రతి పాత్ర కథ ఇంచుమించు అలాగే ఉంటుంది.

ఈ చిత్రంలో రమ్యకృష్ణ పాత్ర గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మూవీలో రమ్యకృష్ణ పో*ర్న్ స్టార్ గా చేస్తుంది. కొడుకు భవిష్యత్ కోసం పో*ర్న్ స్టార్ గా చేస్తుంటుంది. అయితే ఒకరోజు తన ఫ్రెండ్స్ తో కలిసి రమ్యకృష్ణ కొడుకు పో*ర్న్ సీడీలు చూస్తుండగా.. అందులో నటించింది తన తల్లే అని తెలుసుకుని షాకవుతాడు. ఆమెను చంపేందుకు ఇంటికి వెళ్తాడు. ఇష్టంలేని పెళ్లి చేసుకున్న పాత్రలో సమంత జీవించేస్తుంది. భర్తని కాదని మాజీ ప్రియుడితో శృoగారం చేస్తూ సమంత భర్తకు దొరికిపోతుంది. ఆ మాజీ ప్రియుడు చనిపోతాడు. ఇలా సమంత కష్టాలు సమంతకు ఉంటాయి. నలుగురు వ్యక్తులు వారి కష్టాలు, జీవితాల గురించి సాగేదే ఈ సూపర్ డీలక్స్ చిత్రం. ఈ సూపర్ డీలక్స్ చిత్రం ఆహాలో తెలుగులో అందుబాటులో ఉంది. మరి.. ఇప్పటికే మీరు చిత్రాన్ని చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments