ఈ అవకాశం పోతే మళ్లీ రాదు.. APలో నెలకు 70 వేల జీతంతో ఉద్యోగాలు

ఈ అవకాశం పోతే మళ్లీ రాదు.. APలో నెలకు 70 వేల జీతంతో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. నెలకు 70 వేల జీతంతో పలు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే ఈ అర్హతలు ఉండాలి.

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. నెలకు 70 వేల జీతంతో పలు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే ఈ అర్హతలు ఉండాలి.

ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడమే మీ లక్ష్యమా? గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎప్పటి నుంచో సన్నద్ధమవుతున్నారా? అయితే మీలాంటి వారికి గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 70 వేల వేతనం అందుకోవచ్చు. ఇలాంటి అవకాశం పోతే మళ్లీ రాదు. వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోండి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 241 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీ కోసం ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

2024-25 విద్యాసంవత్సరంలో కొత్తగా ప్రారంభిస్తున్న పాడేరు, మార్కాపురం, మదనపల్లె, ఆదోని, పులివెందుల మెడికల్‌ కాలేజీల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ (ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ) ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

సీనియర్ రెసిడెంట్ ఖాళీల సంఖ్య:

  • 241

విభాగాల వారీగా ఖాళీలు:

  • అనాటమీ: 25
  • ఫిజియాలజీ: 15
  • బయోకెమిస్ట్రీ: 20
  • ఫార్మకాలజీ: 20
  • పాథాలజీ: 23
  • మైక్రోబయాలజీ: 20
  • ఫోరెన్సిక్ మెడిసిన్: 15
  • కమ్యూనిటీ మెడిసిన్: 20
  • మెడిసిన్: 15
  • పీడియాట్రిక్స్: 05
  • డెర్మటాలజీ, వెనెరియాలజీ అండ్ లెప్రసీ (డీవీఎల్): 04
  • సైకియాట్రీ: 04
  • జనరల్ సర్జరీ: 15
  • ఆర్థోపెడిక్స్: 03
  • ఒటోరినోలారిన్జాలజీ: 04
  • ఆప్తాల్మాలజీ: 04
  • ఒబెస్ట్ట్రిక్స్ అండ్ గైనకాలజీ: 08
  • అనస్థీషియాలజీ: 09
  • రేడియో డయాగ్నసిస్: 10
  • డెంటిస్ట్రీ: 02

అర్హత:

  • పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ (ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ) పాసై ఉండాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టరై ఉండాలి. ఏపీ రాష్ట్రానికి చెందిన స్థానిక అభ్యర్థులు ఎంపికకు అర్హులు.

వయోపరిమితి:

  • అభ్యర్థుల వయసు 03.05.2024 నాటికి 44 సంవత్సరాలకు మించకూడదు.

దరఖాస్తు ఫీజు:

  • ఓసీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. బీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ అభ్యర్థులు రూ 500 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్‌

ఎంపిక విధానం:

  • వైద్య విద్య పీజీలో వచ్చిన మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. రూ.70,000 పొందొచ్చు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ:

  • 05-05-2024

దరఖాస్తులకు చివరితేది:

  • 12-05-2024
Show comments