Oil Companies-Biometric Method, Gas Cylinder Under PM Ujjwala Yojana: గ్యాస్‌ సిలిండర్‌ కొంటున్నారా.. అమల్లోకి కొత్త రూల్స్‌.. ఇకపై అవి తప్పనిసరి!

గ్యాస్‌ సిలిండర్‌ కొంటున్నారా.. అమల్లోకి కొత్త రూల్స్‌.. ఇకపై అవి తప్పనిసరి!

Gas Cylinder: గ్యాస్‌ సిలిండర్లకు సంబంధించి చమురు కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఆ వివరాలు..

Gas Cylinder: గ్యాస్‌ సిలిండర్లకు సంబంధించి చమురు కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఆ వివరాలు..

నిత్యవసరాల ధరలు రోజు రోజుకు చుక్కలనుంటుతున్నాయి. మరీ ముఖ్యంగా గ్యాస్‌ సిలిండర్‌, పప్పులు, వంట నూనె వంటి వాటి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా గ్యాస్‌ సిలిండర్‌ ధర స్థిరంగా ఉంటుంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. అన్ని పార్టీలు గ్యాస్‌ సిలిండర్‌ ధరను ప్రధాన అస్త్రంగా వాడుకున్నాయి. తాము అధికారంలోకి వస్తే గ్యాస్‌ ధరలు తగ్గిస్తామని విపక్షాలు ప్రకటిస్తుండగా.. ఇక అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం.. ఇప్పటికే రెండు దఫాల్లో గ్యాస్‌ ధరను 300 రూపాయల మేర తగ్గించింది.

ప్రస్తుతం తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో గ్యాస్‌ సిలిండర్‌ ధర 500 రూపాయలుగా ఉంది. దేశంలో చాలా మంది ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా అందించే సబ్సిడీ కింద గ్యాస్‌ సిలిండర్లను పొందుతున్నారు. దీనికి సంబంధించి ఇకపై కొత్త రూల్స్‌ అమల్లోకి రానున్నాయి. గ్యాస్‌ సిలిండర్‌ పొందాలంటే..  కచ్చితంగా కొన్ని రూల్స్‌ పాటించాలని చమురు కంపెనీలు ఆదేశాలు జారీ చేశాయి. ఆ వివరాలు..

గ్యాస్‌ సిలిండర్‌ కొనుగోలుకు సంబంధించి.. చమురు కంపెనీలు కొత్త నియమాలను అమలు చేసేందుకు రెడీ అవుతున్నాయి. త్వరలోనే ఇవి అమల్లోకి రానున్నాయి. ఇకపై పీఎం ఉజ్వల యోజన సబ్సిడీ కింద గ్యాస్‌ సిలిండర్‌ పొందాలంటే.. బయోమెట్రిక్‌ వివరాలు, వేలి ముద్రలు, రెటీనా స్కాన్‌లు అవసరమని చమురు కంపెనీలు నిర్ణయించాయి. అంటే ప్రధాన మంత్రి ఉజ్వల పథకం కింద సబ్సిడీ కింద గ్యాస్‌ సిలిండర్‌ పొందే వారు కచ్చితంగా బయోమెట్రిక్‌ వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. కస్టమర్ల వాస్తవికతను ధ్రువీకరించడానికి వేలిముద్రలు కచ్చితంగా వేయాలని చమురు కంపెనీలు ఆదేశాలు జారీ చేశాయి. దీని ప్రకారం ప్రతి వినియోగదారుడు కచ్చితంగా బయోమెట్రిక్‌ నమోదు చేసుకోవాలి. అలానే ఫేస్‌ రిజిస్ట్రేషన్‌ కూడా చేసుకోవాలి.

బయోమెట్రిక్‌ కోసం వినియోగదారులు ఎలక్ట్రానిక్‌గా నమోదు చేసుకోవాలి. దీని కోసం గ్యాస్‌ ఏజెన్సీకి వెళ్లి వేలిముద్రలు ఇవ్వాలి. సీనియర్‌ సిటిజనులకైతే.. గ్యాస్‌ ఏజెన్సీ సిబ్బందినే వారి ఇంటి వద్దకు వచ్చి బయోమెట్రిక్‌ వివరాలను తీసుకుంటారు. అయితే బయోమెట్రిక్‌ వివరాల నమోదుకు ఆఖరి తేదీ లేదు. వేలి ముద్ర నమోదు చేయకపోయినా సరే.. సిలిండర్‌ కొనుగోలు చేయవచ్చు. కానీ కచ్చితంగా బయోమెట్రిక్‌ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అంటున్నారు. కస్టమర్ల వాస్తవికతను ధ్రువీకరించడానికి ఈ ప్రక్రియను అమలు చేయనున్నట్లు చమురు కంపెనీలు తెలిపాయి.

Show comments