Jayan : చిన్న వయసులో కన్నుమూసిన 100 సినిమాల స్టార్ - Nostalgia

Jayan : చిన్న వయసులో కన్నుమూసిన 100 సినిమాల స్టార్ – Nostalgia

సాధారణంగా హీరోలు రిస్క్ ఎక్కువ ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ లో డూప్ లను వాడటం సాధారణం. కొన్నిసార్లు ఎఫెక్ట్ బాగా రావాలనే ఉద్దేశంతో స్వయంగా చేసే వాళ్ళు కూడా ఉంటారు.

సాధారణంగా హీరోలు రిస్క్ ఎక్కువ ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ లో డూప్ లను వాడటం సాధారణం. కొన్నిసార్లు ఎఫెక్ట్ బాగా రావాలనే ఉద్దేశంతో స్వయంగా చేసే వాళ్ళు కూడా ఉంటారు.

సాధారణంగా హీరోలు రిస్క్ ఎక్కువ ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ లో డూప్ లను వాడటం సాధారణం. కొన్నిసార్లు ఎఫెక్ట్ బాగా రావాలనే ఉద్దేశంతో స్వయంగా చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ తగినంత శిక్షణ ఉంటేనే ఇలాంటివి చేయాలి తప్ప ఒక్కోసారి చిన్న పొరపాట్లు సైతం భారీ మూల్యానికి దారి తీస్తాయి. అదెలాగో చూద్దాం. అతని పేరు జయన్. 1972లో మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రవేశించి అతి తక్కువ కాలంలో వందకు పైగా సినిమాల్లో నటించిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. క్లాస్ గా సాగే కేరళ ఎంటర్ టైన్మెంట్ ని యాక్షన్ వైపు మళ్లించిన వాళ్ళలో ఈయనదే మొదటి పేరు. కోట్లది అభిమానులతో జయన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉండేది.

కేవలం ఎనిమిదేళ్లలో 100 మైలురాయిని చేరుకోవడం అంటే మాటలు కాదు. జయన్ కు ఇంత పేరు రావడానికి కారణం అతను చేసే పోరాటాలే. సాధ్యమైనంత వరకు డూప్ అవసరం లేకుండా తనే స్వయంగా కంపోజ్ చేసుకోవడం జయన్ ప్రత్యేకత. ముఖ్యంగా 1975 తర్వాత ఎవరూ అందుకోలేని విధంగా కలెక్షన్ల రికార్డులు సృష్టించడం మీడియాలో కథనాలుగా వచ్చేవి. తన అసలు పేరు కృష్ణన్ నాయర్. ఫామ్ దివ్యంగా ఉంటున్న సమయంలో జయన్ ఓ హిందీ రీమేక్ కు ఒప్పుకున్నారు. యాష్ చోప్రా దర్శకత్వంలో 1965లో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘వక్త్’ని 1980లో ‘కొలిలక్కం’ పేరుతో పునఃనిర్మించారు. పిఎన్ సుందరం దర్శకులు. క్లైమాక్స్ లో ఒక ఛేజ్ ని ప్లాన్ చేశారు. బైక్ ని మరొకరు నడుపుతుండగా వెనుక కూర్చున్న జయన్ తన పై నుంచి వెళ్తున్న హెలికాఫ్టర్ రాడ్ ని అందుకునే సీన్

ఆ సన్నివేశం ఫస్ట్ టేక్ లోనే ఓకే అయ్యింది. కానీ జయన్ కి ఎందుకో అది సంతృప్తి కలిగించలేదు. మళ్ళీ తీద్దామన్నారు. ఈ క్రమంలో హెలికాఫ్టర్ ఎక్కాక పట్టు తప్పడంతో దాంతో సహా కిందపడిపోయారు. అక్కడిక్కడే స్పాట్ లో ప్రాణాలొదిలారు. వాహనం కూలిపోయినా పైలట్ బ్రతకడం పెద్ద ట్విస్ట్. అదే సమయంలో జయన్ నటించిన దీపం హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తోంది. ఈయన మరణవార్త స్లయిడ్ గా వేస్తే అభిమానులు మొదట ఏదో పబ్లిసిటీ స్టంట్ అనుకుని నమ్మలేదు. తీరా నిజమని తెలిశాక షాక్ తిని ఆయన చివరి చూపు కోసం లక్షలాదిగా పరుగులు తీశారు. జయన్ చనిపోయాక కూడా ఆయన సినిమాలు ఎనిమిది రిలీజయ్యాయంటే ఎంత బిజీ స్టార్ హీరోనో అర్థం చేసుకోవచ్చు. 1980 నవంబర్ 16న ఈ దారుణం చోటు చేసుకుంది. 1983 దాకా జయన్(వయసు 41) చిత్రాలు వస్తూనే ఉన్నాయి

Also Read : Mana Oori Pandavulu : చిరు నట ప్రస్థానంలో రెండో మైలురాయి – Nostalgia

Show comments