iDreamPost
మనిషి మనమధ్య లేకపోయినా రోజు టీవీలో వచ్చే బ్లాక్ బస్టర్స్ రూపంలో నిత్యం పలకరిస్తూనే ఉంటారు. ఆయన మొదటి సినిమా విశేషాలు చూద్దాం. పరిశ్రమకు వచ్చిన కొత్తలో దేవదాస్ కనకాల వద్ద అసిస్టెంట్ గా పనిచేశాక ఎక్కువ కాలం హాస్యబ్రహ్మ జంధ్యాల వద్ద శిష్యరికం చేశారు.
మనిషి మనమధ్య లేకపోయినా రోజు టీవీలో వచ్చే బ్లాక్ బస్టర్స్ రూపంలో నిత్యం పలకరిస్తూనే ఉంటారు. ఆయన మొదటి సినిమా విశేషాలు చూద్దాం. పరిశ్రమకు వచ్చిన కొత్తలో దేవదాస్ కనకాల వద్ద అసిస్టెంట్ గా పనిచేశాక ఎక్కువ కాలం హాస్యబ్రహ్మ జంధ్యాల వద్ద శిష్యరికం చేశారు.
iDreamPost
టాలీవుడ్ హాస్య చిత్రాలతో తమకంటూ బ్రాండ్ ఏర్పరుచుకున్న దర్శకుల్లో జంధ్యాల, ఎస్వి కృష్ణారెడ్డిల తర్వాత వినిపించే పేరు ఈవీవీ సత్యనారాయణ. మనిషి మనమధ్య లేకపోయినా రోజు టీవీలో వచ్చే బ్లాక్ బస్టర్స్ రూపంలో నిత్యం పలకరిస్తూనే ఉంటారు. ఆయన మొదటి సినిమా విశేషాలు చూద్దాం. పరిశ్రమకు వచ్చిన కొత్తలో దేవదాస్ కనకాల వద్ద అసిస్టెంట్ గా పనిచేశాక ఎక్కువ కాలం హాస్యబ్రహ్మ జంధ్యాల వద్ద శిష్యరికం చేశారు. అలా ఎనిమిదేళ్ల పాటు ఇరవైకి పైగా సినిమాలకు గురువు దగ్గర మెలకువలు నేర్చుకున్నారు. అప్పుడు పరిచయమయ్యారు నిర్మాత అశోక్ కుమార్. ప్రభాస్ ఈశ్వర్ లో విలన్ గా నటించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇతనే.
ఇన్నేళ్ల ఎదురుచూపులు ఫలించిన ఆనందంలో చెవిలో పువ్వు కథను ఓకే చేయించుకున్నారు. రాజేంద్రప్రసాద్, సీత జంటగా కామెడీ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా తనికెళ్ళ భరణి సంభాషణలతో స్క్రిప్ట్ రెడీ అయ్యింది. అందరూ ఇళయరాజా వైపు వెళ్తుంటే ఈవివి చక్రవర్తిని సంగీత దర్శకులుగా ఎంచుకున్నారు. తనకున్న పరిచయాలు దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణలతో రెండు సీన్లలో గెస్ట్ అప్పియరెన్స్ ఇప్పించేందుకు ఉపయోగపడ్డాయి. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, మల్లికార్జునరావు, సాక్షి రంగారావు తదితరులు ఇతర తారాగణంగా తీసుకున్నారు. ప్రముఖ రచయిత నిర్మాత దర్శకులు డివిఎస్ రాజు కీలక పాత్ర పోషించారు.
రాత్రి నిద్రలో నడిచే అలవాటున్న రాజేంద్రప్రసాద్ వల్ల స్వయానా అతని మరదలి కాపురం పెటాకులు అవుతుంది. దాన్ని చక్కదిద్దడం కోసం సిటీకి వస్తాడు. ఉద్యోగం వెదికే క్రమంలో విధవైన సీతను చూసి ప్రేమించి పెళ్లి దాకా తీసుకొస్తాడు. అయితే ఊహించని ఒక ట్విస్ట్ వల్ల అది జరగదు. ఇద్దరూ ఐదేళ్ల పాటు విడిపోతారు. తిరిగి కలుసుకునే క్రమంలో జరిగే డ్రామానే అసలు కథ. కామెడీని ఎమోషన్స్ బ్యాలన్స్ చేయాలని చూసిన ఈవివి తడబడ్డారు. ఇందులో శ్రీలక్ష్మి, బ్రహ్మానందంల మీద డ్యూయెట్ పెట్టడం విశేషం. రాళ్ళపల్లి నాలుగు పాత్రల్లో కనిపిస్తారు. 1990 ఫిబ్రవరి 23న విడుదలైన చెవిలో పువ్వు అంచనాలు అందుకోలేక విఫలమయ్యింది.
Also Read : Lava Kusa : వెండితెరపై రంగుల దృశ్యకావ్యం లవకుశ – Nostalgia