Madhya Pradesh: అంతుచిక్కని వ్యాధి! వందల సంఖ్యలో ఆవులు మృతి!

Madhya Pradesh: అంతుచిక్కని వ్యాధి! వందల సంఖ్యలో ఆవులు మృతి!

తరచూ సమాజంలో వివిధ రకాల వ్యాధులు, జబ్బులు వస్తుంటాయి. కొన్నిటికి కారణం ఏమిటో తెలియక జనాలు ఆందోళనకు గురవుతుంటారు. తాజాగా ఓ ప్రాంతంలో అంతుచిక్కన వ్యాధితో వందల ఆవులు చనిపోతున్నాయి. మరి.. ఆ వివరాలు ఏమిటంటే..

తరచూ సమాజంలో వివిధ రకాల వ్యాధులు, జబ్బులు వస్తుంటాయి. కొన్నిటికి కారణం ఏమిటో తెలియక జనాలు ఆందోళనకు గురవుతుంటారు. తాజాగా ఓ ప్రాంతంలో అంతుచిక్కన వ్యాధితో వందల ఆవులు చనిపోతున్నాయి. మరి.. ఆ వివరాలు ఏమిటంటే..

నేటికాలంలో అనేక వింత జబ్బులు, అంతుచిక్కని వ్యాధులు గురించి వార్తలు వస్తుంటాయి. అయితే వీటి కారణంగా ప్రజలను భయాందోళనకు అవుతుంటారు. అయితే వ్యాధులనేవి కేవలం మనుషులకే  కాకుండా మూగ జీవాలకు సైతం వివిధ రకాల జబ్బులు వస్తుంటాయి. కొన్ని వ్యాధులకు కారణం తెలియక  ప్రజలతో పాటు అధికారులు తలలు పట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా ఓ ప్రాంతంలో వందల సంఖ్యలో ఆవులు చనిపోతున్నాయి. ఈ మరణాల వెనుక గల కారణాలు ఏమిటో ఇప్పటికి తెలియరాలేదు. మరి.. ఈ ఘటన ఎక్కడ జరిగింది. ఆవివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో  కొన్ని గ్రామాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. దీని కారణంగా వందల సంఖ్యలో కోళ్లు  మృత్యువాతపడ్డాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు నివారణ చర్యలు తీసుకున్నారు. బర్డ్ ఫ్లూ నియంత్రణ కోసం  చికెస్ షాపులకు, కోళ్ల ఫామ్ యాజమానులకు కీలక ఆదేశాలను జారీ చేశారు. ఇలా నెల్లూరులో బర్డ్ ఫ్లూ కారణంగా వందల కోళ్లు చనిపోతుంటూ మధ్యప్రదేశ్ లో అంతుచిక్కని వ్యాధిలో ఆవులు చనిపోతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ అంతుచిక్కని వ్యాధి కలకలం రేపుతోంది. శివపురి జిల్లాలో దాదాపు 200 ఆవుల కళేబేరాలు లభ్యం కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

కరైరా తహసీల్ నుంచి సలార్ పూర్ వెళ్లే  రోడ్డు మార్గంలోని అటవీ ప్రాంతంలో ఆవుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆ రెండు ప్రాంతాల మధ్య జాతీయ రహదారికి 500-600 మీటర్ల దూరంలో ఆవుల కళేబరాలు కనిపించాయి. చనిపోయిన ఆవులను ఈ ప్రాంతంలోనే పడేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమీప నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పశువులు షెడ్లలో మృతి చెందిన ఆవునులను  సలార్ పూర్ ప్రాంతంలో పారేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయంపై  స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్సై సురేష్ స్పందించారు.  ఆయన మాట్లాడుతూ.. తమకు ఈ ఆవుల కళేబరాలు ఉన్నాయని సమాచారం అందగానే ఘటన స్థలానికి చేరుకున్నామని, అక్కడి పరిస్థితులను పరిశీలించామని, ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియలేదని ఆయన తెలిపారు.

ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారని పోలీస్ అధికారి తెలిపారు. అయితే ఆవుల మృతదేహాలపై స్థానిక అటవీశాఖ అధికారులు ఇప్పటివరకు స్పందించలేదు. మొత్తంగా ఇలా వందల సంఖ్యలో ఆవులు మృతి చెందడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటి ఏమైన అంతుచిక్కన వ్యాధి ఉందా?, దాని కారణంగా తమకు ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలానే వందల ఆవులు మరణిస్తుండటంపై  అధికారులు అప్రమత్తమయ్యారు.  మరి.. ఆ వందల ఆవుల మరణానికి కారణం తెలియాలంటే..మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments