Mansoor Ali Khan filed case against Chiranjeevi and Trisha: చిరంజీవి, త్రిషలపై కేసులు పెట్టిన మన్సూర్ ఆలీఖాన్

చిరంజీవి, త్రిషలపై కేసులు పెట్టిన మన్సూర్ ఆలీఖాన్

హీరోయిన్ త్రిష గురించి మన్సూర్ ఆలీ ఖాన్ ఒక నటుడిగా తన ఆలోచనలను అనాలోచితంగానే మాటలుగా అనేశాడు. ఇవ్వాళరేపు అందరికీ లిబర్టీ ఎక్కువైపోయింది.

హీరోయిన్ త్రిష గురించి మన్సూర్ ఆలీ ఖాన్ ఒక నటుడిగా తన ఆలోచనలను అనాలోచితంగానే మాటలుగా అనేశాడు. ఇవ్వాళరేపు అందరికీ లిబర్టీ ఎక్కువైపోయింది.

ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. తెలుగు చిత్ర పరిశ్రమే కాదు, ఇతర లాంగ్వేజ్ ఇండస్ట్రీలు కూడా విడ్డూరాలు ఎదుర్కొంటున్నది. లేకుంటే ఎక్కడ మన్సూర్ ఖాన్ స్టేట్ మెంట్? ఎక్కడ చిరంజీవి మీద కేసులు?తుంటి మీద కొడితే పళ్లు రాలాయని సామెత. అదే జరిగిందిప్పుడు. హీరోయిన్ త్రిష గురించి మన్సూర్ ఆలీ ఖాన్ ఒక నటుడిగా తన ఆలోచనలను అనాలోచితంగానే మాటలుగా అనేశాడు. ఇవ్వాళరేపు అందరికీ లిబర్టీ ఎక్కువైపోయింది. సోషల్ మీడియా పుణ్యమా అని ఎవ్వరికీ నోరు అదుపులో లేకుండా పోయింది. మన్సూర్ అన్నది కూడ అషామాషీ వ్యక్తి మీద కాదు. ఇండియాలోనే చాలా ఫేమస్ నోటెడ్ హీరోయిన్. త్రిష. కాబట్టే మన్సూర్ కూడా ఎక్సైట్ అయిపోయాడు.

అంత పెద్ద హీరోయిన్ రేప్ సీన్ తప్పిపోయిందే అని తను పోషించే పాత్ర ఔచిత్యం ప్రకారం అనేశాడు. అది కాస్త వైరల్ అయిపోయి మన్సూర్ నెత్తిమీదకి వచ్చింది. ఇంక అందరూ ఒక్కసారిగా మన్సూర్ పైన తోక తోక్కిన నాగుపాముల్లా లేచిపోయారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడా.. స్త్రీలను అగౌరవపరుస్తాడా అని అందుకున్నారు. నిజమే.. మన్సూర్ అలా అని ఉండాల్సింది కాదు. తప్పే.. కానీ కొందరంటున్నారు…..నటుడిగా మన్సూర్ దుష్టపాత్రలు అటువంటివి. మనకి తెలుగులో కైకాల సత్యనారాయణ ఎక్కువ రేపులు చేసిన దుష్టపాత్రధారి. ఆయనో సారి ఎంతమంది హీరోయిన్లను రేప్ చేశారో కాలక్షేపం కబుర్లలో చెప్పుకొచ్చారు. ఆరోజున ఈ సోషల్ మీడియా అవతరించలేదు. ఎక్కడ అన్న మాటలు అక్కడనే ఉండిపోయేవి. పైగా అటువంటి మాటలను, కబుర్లను ఏ పాత్రికేయుడు రిపోర్ట్ చేసేవారు కాదు.

కానీ ఇప్పుడలా కాదు. ఇటువంటి మాటలకి బ్రహ్మాండమైన డిమాండ్. తిరుగులేని రెవిన్యూ. అందుకని మన్సూర్ మాటలు గాలి దుమారాన్ని పుట్టించాయి. పెద్ద హీరోయిన్ కావడం చేత అటు తమిళ సినీ రంగం నుంచి, ఇటు తెలుగు సినిమా రంగం నుంచి మన్సూర్ మీద రివర్స్ గేర్ మొదలైంది. అటు రాధిక శరత్ కుమార్, లోకేష్ కనగరాజు, ఇటు మెగాస్టార్ చిరంజీవి అందరూ త్రిషకి అండగా మన్సూర్ ని ఫటాఫట్ లాడించారు. ఈ తతంగం కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హాట్ హాట్ గా హల్చల్ చేస్తోంది. ఎక్కడా ఆగలేదు. చూసి, చూసి మన్సూర్ ఆలీఖాన్ చిరంజీవి మీద, రాధిక ఇలా కొందరి మీద చెన్నైలో కేసులు ఫైల్ చేశాడు.

ఇది ఓ రకంగా పెద్ద గొడవగానే తయారైంది. మెగాస్టార్ మీద, అక్కడ చాలా గొప్ప స్టేటస్ లో ఉన్న రాధిక మీద ఇతరుల మీద కేసులు ఫైల్ అవ్వడం, అదీ ఓ టాప్ హీరోయిన్ విషయంలో జరగడం ఎనలేని ప్రాధాన్యతను సంతరించుకుందీ వ్యవహరం. సోషల్ మీడియాలో ఎవ్వరికీ మినహాయింపు లేదు. ఏకంగా చిరంజీవి తాజా చిత్రమైన విశ్వంభరలో త్రిష చేయడం కోసమే తాయిలంలా మెగాస్టార్ త్రిషను వెనకేసుకొచ్చారని కూడా కొందరు రాసిపారేశారు. కాదేది కవితకనర్హం అని మహాకవి శ్రీశ్రీ అన్నట్టుగా, ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎవ్వరి విశ్లేషణలు వారివి. మరి మన్సూర్ ఈ దుమారం నుంచి ఎలా బైటపడతాడో, పోలీసులు, కోర్టులు దీనికి ఏ రకంగా ముగింపు పలుకుతారో.. ఇది ఏ విధంగా పరిష్కారమై అందరూ కుదుటపడతారో వేచి చూడాల్సిందే ప్రస్తుతానికి.

Show comments