Viral Video: వరదలో చిక్కుకున్న 24 విద్యార్థులు.. ఎలా బయటపడ్డారంటే??

Viral Video: వరదలో చిక్కుకున్న 24 విద్యార్థులు.. ఎలా బయటపడ్డారంటే??

  • Updated - 08:52 PM, Sun - 24 July 22
Viral Video: వరదలో చిక్కుకున్న 24 విద్యార్థులు.. ఎలా బయటపడ్డారంటే??

భారీ వర్షాలతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాగులు తెగిపోయి, రోడ్లు కొట్టుకుపోయి ప్రయాణాలు కష్టంగా మారాయి. దీనికి తోడు వర్ష బీభత్సానికి ప్రమాదవశాత్తు మరణాలు సైతం సంభవిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో పడుతున్న వర్షాలకు ఒక స్కూల్ బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది.

 

డ్రైవర్ అలసత్వం విద్యార్థుల పాలిట శాపమైంది. వరద ప్రవాహాన్ని అంచనా వేయకపోవడమే ప్రధాన కారణం. దీంతో విద్యార్థులందరూ భయంతో కేకలు పెట్టారు. షాజాపూర్ లో జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో వైరల్ గా మారింది. 24మంది విద్యార్థులు ఉన్న స్కూల్ బస్సు వరద నీటిలో నిలిచిపోయింది.

అయితే సమయానికి అక్కడికి స్థానిక గ్రామాస్తులు చేరుకుని వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. ట్రాక్టరుతో బస్సును వరద నీటిలో నుంచి బయటకు లాగి అందరి ప్రాణాలు కాపాడారు. డ్రైవర్ నిర్లక్ష్యాన్ని అందరూ తిడుతుంటే.. గ్రామస్తుల ధైర్యాన్ని మొచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఘటన తాలూకు వీడియో వైరల్ గా మారింది.

Show comments