Remal Cyclone With Heavy Rains: అలర్ట్: ఏపీలో తుఫాను ప్రభావం.. పలు చోట్ల కుండపోత వానలు

అలర్ట్: ఏపీలో తుఫాను ప్రభావం.. పలు చోట్ల కుండపోత వానలు

Storm With Heavy Rains: ఏపీలో పలు చోట్ల కుండపోత వర్షాలు కురుస్తాయని.. పలు చోట్ల తుఫాన్ ప్రభావం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Storm With Heavy Rains: ఏపీలో పలు చోట్ల కుండపోత వర్షాలు కురుస్తాయని.. పలు చోట్ల తుఫాన్ ప్రభావం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇప్పుడంతా వాతావరణం మారిపోయింది. ఎప్పుడు పడితే అప్పుడు వర్షాలు కురుస్తున్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు వరదలు వస్తున్నాయి. ఎండాకాలంలో వానలు, వానాకాలంలో ఎండలు సీజన్ తో సంబంధం లేకుండా వచ్చేస్తున్నాయి. ఇంకా వేసవి సీజన్ పూర్తి కాలేదు. ఆ మధ్య వర్షాలు కురిసి అతలాకుతలం చేశాయి. ఇంత వేడిలో వర్షాలు ఉపశమనాన్ని కల్గించాయన్న మాటకే గానీ రోడ్లన్నీ నీట మునగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా వాతావరణ శాఖ ఏపీలోని పలు జిల్లాలకు తుఫాన్ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతుండడంతో తుఫానుగా మారనుందని ఐఎండీ వెల్లడించింది. దీనికి రెమాల్ తుఫాన్ గా పేరు పెట్టారు.

రెమాల్ తుఫాన్:

మే 26న రెమాల్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ రాత్రి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల వెంబడి గంటకు 120 కి.మీ. వేగంతో తీరం దాటే అవకాశం ఉందని.. 135 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా కాకినాడ, ఉప్పాడ బీచ్ లో అలలు ఉదయం నుంచి అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. విజయవాడతో సహా పలుచోట్ల కుండపోత వర్షం కురవడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి.

ఒకటవ నంబర్ ప్రమాద హెచ్చరిక:

కోస్తాలోని ప్రధాన పోర్టుల్లో ఒకటవ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు రెమాల్ తుఫాన్ ప్రభావంతో కేరళను భారీ వర్షాలు, ఈదురుగాలులు కుదిపేస్తున్నాయి. కేరళలో ఇప్పటి వరకూ 11 మంది చనిపోయారు. కొల్లం, ఎర్నాకులం, తిరువనంతపురం సహా ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా వర్షాలపై సమీక్ష జరిపిన కేరళ సీఎం.. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. మత్స్యకారులను వేటకు వెళ్ళొద్దని అధికారులు హెచ్చరించారు.

Show comments