Elections 2024 CM Revanth Reddy-On Free Journey In RTC Bus: CM రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు.. అదే జరిగితే మహిళలకు ఫ్రీ బస్సు పథకం ఆగిపోతుంది

CM రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు.. అదే జరిగితే మహిళలకు ఫ్రీ బస్సు పథకం ఆగిపోతుంది

Free Journey In RTC Bus: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం పథకంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు.

Free Journey In RTC Bus: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం పథకంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు.

తెలంగాణలో తమను గెలిపిస్తే.. అధికారంలోకి రాగానే.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. అన్నట్లుగానే అధికారంలోకి రాగానే.. ముందుగా ఈ హామీనే అమలు చేసింది. ఈ పథకం వల్ల బస్సుల్లో జర్నీ చేసే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇక ఫ్రీ జర్నీ వల్ల ఆర్టీసీకి ఆదాయం భారీగా పెరిగింది. అయితే ఫ్రీ బస్సు ప్రయాణం పథకం వల్ల మగవారు తీవ్ర ఇబ్బందులు ఎద్కుర్కొంటున్నారు. టికెట్‌ కొన్నా సరే.. బస్సుల్లో కనీసం నిలబడటానికి కాదు కదా.. కాలు పెట్టే సందు లేకుండా పోతుంది. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. ఆర్టీసీ ఈ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. రద్దీకి సరిపడా.. ఆర్టీసీ బస్సులను పెంచుతామని ప్రకటించింది. ఇదిలా ఉండగా.. తాజాగా సీఎం రేవంత​ రెడ్డి మాట్లాడుతూ.. ఉచిత బస్సు ప్రయాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం నాడు.. కోమటిరెడ్డి సోదరులతో కలిసి భువనగిరిలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ ఫ్రీ జర్నీ పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ ఓడిపోతే.. ఉచిత ప్రయాణం పథకం ఆగిపోతుంది. ఆ విషయం మహిళలకు తెల్వదా అంటూ ఆస​క్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రేవంత​ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ ఆడబిడ్డల కోసం ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించింది. మన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ వల్ల ఈ రోజుకి సుమాఉ 35 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్నారు. అణాపైసా ఖర్చు లేకుండా.. ఎక్కడ కావాలంటే అక్కడ బస్సు ఆపుతుండ్రు.. వారికి కావాల్సిన చోట దిగుతున్నారు’’ అని తెలిపాడు.

‘‘మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింనందుకు కాంగ్రెస్‌ పార్టీని ఓడించాలా.. ఒకవేళ హస్తం పార్టీ ఓడిపోతే.. మహిళల కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత ప్రయాణం పథకం ఆగిపోతుంది. ఈ విషయం మా అక్కాచెల్లెమ్లలకు తెల్వదా’’ అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇక ఈ ప్రచార సభలో సీఎం రేవంత్‌ విపక్షాలపై విమర్శల వర్షం కురిపించారు. బీఆర్ఎస్‌కు ఒక్క సీటు ఇచ్చినా.. అది నరేంద్ర మోదీ ఖాతాలోకే వెళ్తుందని ఆరోపించారు. మోదీతో, బీజేపీతో కేసీఆర్‌ ఏనాడూ పోరాటం చేయలేదని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదన్నారు రేవంత్‌ రెడ్డి.

ఉచిత జర్నీ వల్ల ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య భారీగా పెరిగింది. 2023, డిసెంబర్‌ 9 మధ్యాహ్నం నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. హైదరాబాద్ నగరంలోని సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించొచ్చని తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా.. పల్లెవెలుగు, ఆర్టినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని పేర్కొన్నారు. ఉచిత ప్రయాణం చేయాలంటే.. ఆధార్‌ కార్డు, ఓటర్‌ ఐడీ ఒరిజినల్‌ చూపించాలి. అప్పుడు కండక్టర్‌ జీరో టికెట్‌ జారీ చేస్తారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తుంది.

Show comments