మణిపూర్ లో స్త్రీలను నగ్నంగా ఉరేగించడంపై ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్!

మణిపూర్ లో స్త్రీలను నగ్నంగా ఉరేగించడంపై ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్!

  • Author Soma Sekhar Updated - 11:07 AM, Thu - 20 July 23
  • Author Soma Sekhar Updated - 11:07 AM, Thu - 20 July 23
మణిపూర్ లో స్త్రీలను నగ్నంగా ఉరేగించడంపై ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్!

గతకొంత కాలంగా మణిపూర్ లో హింసాత్మకమైన అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో ఎందరో అమాయక ప్రజలు తమ ప్రాణాలను సైతం కోల్పోయారు. రెండు తెగల మధ్య జరుగుతున్న ఈ హింస కారణంగా మహిళలు తమ మాన, ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ హృదయవిదారక పరిస్థితులపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించారు. మణిపూర్ లో స్త్రీలను నగ్నంగా ఊరేగించడంపై మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, అమిత్ షా పై విమర్శలు గుప్పించారు కేటీఆర్.

దేశంలో, ప్రపంచంలో జరిగే సంఘటనలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. తాజాగా మణిపూర్ లో జరుగుతున్న అల్లర్లలపై ఆవేదన వ్యక్తం చేశారు. తాలిబాన్ లు మహిళలను అగౌరవపరుస్తున్నప్పుడు విమర్శిన భారత్ లో ఇప్పుడు మనం ఇలాంటి ఘటనలు చూడాల్సి వస్తోందని మండిపడ్డారు. మణిపూర్ లో మెయిటీ సభ్యులు కుకీ స్త్రీలను నగ్నంగా ఊరేగించడం అత్యంత బాధాకరమైన, హేయమైన చర్య అని కేటీఆర్ అన్నారు. మణిపూర్ లో ఇన్ని దారుణాలు జరుగుతున్నా గానీ కేంద్ర ఎందుకు మౌనంగా ఉందో అర్ధం కావడం లేదని కేటీఆర్ విమర్శించారు. ప్రధాని మోదీ, అమిత్ షాలు ఎక్కడ ఉన్నారు? అంటూ ప్రశ్నించారు. మీ శక్తిని ఉపయోగించి మణిపూర్ ను కాపాడండని వారిని కోరారు.

ఇదికూడా చదవండి: విపక్ష కూటమిపై పోలీస్ కేసు! 26 పార్టీలపై..

Show comments