Kriti Shetty- Tollywood Movie Offers: సినిమా ఛాన్సుల కోసం నిర్మాతలకు కృతి శెట్టి బంపర్ ఆఫర్!

సినిమా ఛాన్సుల కోసం నిర్మాతలకు కృతి శెట్టి బంపర్ ఆఫర్!

Heroine Kriti Shetty: టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో ఎక్కువ గుర్తింపు, ఆఫర్స్ సొంతం చేసుకున్న హీరోయిన్స్ లో కృతిశెట్టి కూడా ఒకరు. కానీ, ప్రస్తుతం టాలీవుడ్ నుంచి సరైన ఆఫర్స్ లేని పరిస్థితి ఉంది. కానీ, మళ్లీ టాలీవుడ్ లో కృతిశెట్టి గోల్డెన్ పిరియడ్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు.

Heroine Kriti Shetty: టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో ఎక్కువ గుర్తింపు, ఆఫర్స్ సొంతం చేసుకున్న హీరోయిన్స్ లో కృతిశెట్టి కూడా ఒకరు. కానీ, ప్రస్తుతం టాలీవుడ్ నుంచి సరైన ఆఫర్స్ లేని పరిస్థితి ఉంది. కానీ, మళ్లీ టాలీవుడ్ లో కృతిశెట్టి గోల్డెన్ పిరియడ్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు.

సినిమా ఫీల్డ్ అనేది రంగుల ప్రపంచం. ఇందులోకి అడుగుపెట్టడం ఎంతో కష్టం.. టాలెంట్, అదృష్టం ఉంటేనే అందులో అడుగుపెట్టగలరు. కానీ, అడుగు పెట్టిన తర్వాత చిన్న పొరపాటు, కథ ఎంపికలో చిన్న తప్పిదం చాలు కెరీర్ కొలాప్స్ అవ్వడానికి. అలాంటి ఘటనలు చాలానే జరిగాయి. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో అలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాంటి జాబితాలోకి హీరోయిన్ కృతిశెట్టి పేరు కూడా చేరిన విషయం తెలిసిందే. ఆ అమ్మడు తన కెరీర్ ని మళ్లీ టాలీవుడ్ లో నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి మేకర్స్ కి బంపరాఫర్ ఇచ్చింది అంటూ వార్తలు వస్తున్నాయి.

హీరోయిన్ కృతిశెట్టికి టాలీవుడ్ లో అనతికాలంలోనే మంచి గుర్తింపు దక్కింది. ఉప్పెన సినిమాలో ఒక ఇన్నోసెంట్ కాలేజ్ స్టూటెండ్ పాత్రలో ఆమె ఇమిడిపోయింది. కృతిశెట్టి నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇంకేముంది టాలీవుడ్ నుంచి అవకాశాలు క్యూ కట్టాయి. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్ సినిమాతో మరో హిట్టు అందుకుంది. ఆ సినిమాలో కాస్త గ్లామరస్ రోల్ ప్లే చేసి కొంచం షాకిచ్చింది. కానీ, సినిమా సూపర్ హిట్టు సాధించడంతో కృతికి కూడా మంచి పేరు వచ్చింది. నెక్ట్స్ మూవీ కింగ్ నాగార్జున, నాగ చైతన్య కాంబోలో చేసింది. బంగ్గార్రాజు కూడా సంక్రాంతి విన్నర్ కావడంతో కృతిశెట్టికి ఆఫర్స్ పెరిగాయి.

బంగ్గార్రాజు హిట్టు తర్వాత కృతిశెట్టి రెమ్యూనరేషన్ కూడా పెరిగిపోయిందట. కానీ, అక్కడే ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది. బంగ్గార్రాజుతో హ్యాట్రిక్ హిట్టు కొట్టిన కృతిశెట్టి ఆ తర్వాత వరుస పరాజయాలు ఎదుర్కొంది. మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాకు, వారియర్ చిత్రాలు ఆశించిన స్థాయి ఫలితాలను అందుకోలేకపోయాయి. ఇంకేముంది అమ్మడుకి అవకాశాలు కూడా తగ్గిపోయాయి. కృతి నాగచైతన్యతో చేసిన కస్టడీ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుంది. కానీ, అది కూడా అంచనాలను తలకిందులు చేసింది. ఈ గ్యాప్ లో టాలీవుడ్ లోకి శ్రీలీల ఎంట్రీ ఇచ్చింది. కృతిశెట్టి ఫేడ్ అవుట్ అవ్వడానికి ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ కూడా ఒక కారణంగా చెప్పచ్చు. ఎందుకంటే మేకర్స్ అంతా ఒక్కసారిగా శ్రీలీల వైపు చూశారు. వరుస ఆఫర్స్ వచ్చాయి. దీంతో కృతిశెట్టి చిన్నగా టాలీవుడ్ కి దూరమైపోయింది.

ఇంక ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో టాలీవుడ్ నుంచి శర్వానంద్ చిత్రం ఒకటి ఉంది. తమిళ్, మలయాళం భాషల్లో ఒకటి రెండు ఆఫర్స్ ఉన్నట్లు ఉన్నాయి. పాన్ ఇండియా లెవల్లో టాలీవుడ్ బిగ్ ఇండస్ట్రీగా ఎదుగుతున్న ఇలాంటి తరుణంలో తిరిగి టాలీవుడ్ లో నిలదొక్కుకునేందుకు కృతిశెట్టి ప్రయత్నాలు ప్రారంభించేసింది అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కృతిశెట్టి మేకర్స్ కి బంపరాఫర్ ఇస్తోంది అంటున్నారు. తాను రూ.2 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేదంట. ఇప్పుడు రూ.కోటిన్నరకు కూడా ఓకే చెప్పేందుకు సిద్ధంగా ఉంది అని టాక్ నడుస్తోంది. ఇకనైనా టాలీవుడ్ నుంచి మంచి ఆఫర్స్ వస్తాయని ఆశాభావంతో ఉందంట. మరి.. కృతిశెట్టి రెమ్యూనరేషన్ తగ్గించింది అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments