Gautam Gambhir: ఇష్టం లేకున్నా.. చేయకూడని పనులు చేశా! గంభీర్ షాకింగ్ కామెంట్స్..

Gautam Gambhir: ఇష్టం లేకున్నా.. చేయకూడని పనులు చేశా! గంభీర్ షాకింగ్ కామెంట్స్..

నాకు ఇష్టం లేకున్నా గానీ కెరీర్ లో కొన్ని పనులు చేశానని ఆసక్తికర కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్. మరి ఆ పనులు ఎందుకు చేశాడు? పూర్తి వివరాల్లోకి వెళితే..

నాకు ఇష్టం లేకున్నా గానీ కెరీర్ లో కొన్ని పనులు చేశానని ఆసక్తికర కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్. మరి ఆ పనులు ఎందుకు చేశాడు? పూర్తి వివరాల్లోకి వెళితే..

కోల్ కత్తా మాజీ కెప్టెన్, ప్రస్తుత మెంటర్ గౌతమ్ గంభీర్ గ్రౌండ్ లో ఎంత అగ్రెసివ్ గా ఉంటాడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎవరైనా తనను కవ్విస్తే.. ఢీ అంటే ఢీ అంటూ రంగంలోకి దూకుతాడు. ప్రత్యర్థి ప్లేయర్లపైనే కాకుండా.. ఐపీఎల్ లో భారత ఆటగాళ్లపైకి దూసుకెళ్లిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్లేయర్ గానే కాకుండా.. మెంటర్ గా ఉన్నప్పుడు విరాట్ కోహ్లీతో గంభీర్ గొడవకు దిగడం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే ఎంతో అగ్రెసివ్ గా ఉండే గంభీర్.. తనకు ఇష్టం లేకున్నా.. కొన్ని చేయకూడని పనులు చేశానని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించాడు.

టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ గ్రౌండ్ లో దూకుడుగా ఉండటానికి కొన్ని కారణాలు ఉన్నాయట. తాజాగా ఈ విషయం గురించి ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..”మీ టీమ్ దూకుడుగా ఉండాలంటే, ముందు మీ కెప్టెన్ అగ్రెసివ్ గా ఉండాలి. అయితే ఇలా ఉండే క్రమంలో కొన్ని కొన్ని సార్లు ఇష్టం లేకున్నా.. చేయకూడని పనులు చేయాల్సి వస్తుంది. నేను కూడా నా కెరీర్ లో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. చేయకూడని పనులు ఎన్నో చేశాను. అయితే అవన్నీ టీమ్ కోసమే. కెప్టెన్ దూకుడుగా ఉండకపోతే.. జట్టు కూడా అలాగే ఉంటుంది. అందుకే నేను అలా ఉంటాను. గ్రౌండ్ లో మన భావాల్ని వ్యక్తపరిచే హక్కు ప్రతీ ఒక్క ఆటగాడికి ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చాడు గంభీర్.

కాగా.. మైదానంలో ఆటగాడి వ్యక్తిత్వాన్ని బట్టి అతడి క్యారెక్టర్ ను అంచనా వేయడం తప్పని గంభీర్ పేర్కొన్నాడు. ఎందుకంటే? జట్టు కోసం గ్రౌండ్ లో ఆటగాడు ఎంతకైనా తెగిస్తాడు, అదే బయటకి వస్తే.. అలా ఉండడు. బయట ఎలా ఉంటాడో.. దాన్ని బట్టే ఆ వ్యక్తి ఎలా ఉంటాడో ఓ అంచనాకు రావాలని ఈ సందర్భంగా గంభీర్ వివరించాడు. ఇక ప్రస్తుతం కేకేఆర్ మెంటర్ గా జట్టును విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. మరీ ముఖ్యంగా సునీల్ నరైన్ ను ఓపెనర్ గా పంపి విజయవంతం అయ్యాడు. యంగ్ ప్లేయర్లను సైతం సానపడుతున్నాడు. దాంతో వారు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. మరి టీమ్ ను దూకుడుగా నడిపించడానికే నేను అలా చేస్తానన్న గంభీర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments