Keedaa Cola Review & Rating, in Telugu: కీడా కోలా సినిమా రివ్యూ

Keedaa Cola Review: కీడా కోలా సినిమా రివ్యూ

Keedaa Cola Review & Rating in Telugu: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం తరుణ్ భాస్కర్ కీడా కోలా సినిమా పేరు బాగా వైరల్ అవుతోంది. అంచనాలను భారీగా పెంచేసిన ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

Keedaa Cola Review & Rating in Telugu: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం తరుణ్ భాస్కర్ కీడా కోలా సినిమా పేరు బాగా వైరల్ అవుతోంది. అంచనాలను భారీగా పెంచేసిన ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

కీడా కోలా

20231103, U/A
క్రైమ్ కామెడీ
  • నటినటులు:బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, చైతన్యరావ్, జీవన్ కుమార్, తదితరులు
  • దర్శకత్వం:తరుణ్ భాస్కర్
  • నిర్మాత:వివేక్ సుధాన్సు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ
  • సంగీతం:వివేక్ సాగర్
  • సినిమాటోగ్రఫీ:ఏజే ఆరోన్

2.75

తరుణ్ భాస్కర్ నుంచి సినిమా వస్తోంది అనగానే తెలుగు ప్రేక్షకుల్లో ఒక రకమైన ఉత్సాహం వచ్చేస్తుంది. ఎందుకంటే తరుణ్ భాస్కర్ అంటే మినమం గ్యారెంటీ సినిమా అన్నట్టు. పైగా ఈ కీడా కోలా సినిమాకి తరుణ్ భాస్కర్ రైటర్, డైరెక్టర్ మాత్రమే కాదు.. ఈ మూవీలో లీడ్ రోల్ కూడా ప్లే చేశాడు. పైగా బ్రహ్మానందం కూడా ఈ మూవీలో ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేశారు. ప్రమోషన్స్ తో బజ్ కూడా గట్టిగానే క్రియేట్ చేశారు. అంతటి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలియాలి అంటే ఈ రివ్యూ పూర్తిగా చదివేయండి.

కథ:

ఈ సినిమా చిన్న లైన్ మీద నడుస్తుంది. వాస్తు(చైతన్యరావ్), లంచం(రాగ్ మయూర్), జీవన్(జీవన్ కుమార్) ఈ ముగ్గురి జీవితం ఆధారంగా ఈ సినిమా కథ ముందుకు నడుస్తుంది. వాస్తు- లంచం పాత్రలకు జీవన్- నాయుడులతో సంబంధమే ఉండదు. కానీ, కథ వీళ్లను కలుపుతుంది. వీళ్లంతా కలిసి ముందుకు వెళ్లేలా చేస్తుంది. వీళ్లకు లైఫ్ లో కొన్ని గోల్స్ ఉంటాయి. ఆ గోల్స్ ని ఫుల్ ఫిల్ చేసుకోవడానికి ఒక దారి ఎంచుకుంటారు. ఆ దారిలో వీళ్లకు ఊహించని సమస్యలు ఎదురవుతాయి. వీళ్లందరికి నాయుడు(తరుణ్ భాస్కర్) పెద్దన్నలాగా. వీళ్లందరికి ఎదురైన సమస్యలను ఎలా అధిగమించారు? అనుకున్నది సాధించారా? వీళ్ల కోరికల వల్ల వీరి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే మీరు థియేటర్లలో కీడా కోలా సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

తరుణ్ భాస్కర్ సినిమా అంటే మినిమం అంచనాలు పెట్టుకోవచ్చు. ఈ సినిమా విషయంలో కూడా ఆ నమ్మకాన్ని తరుణ్ భాస్కర్ పోగొట్టుకోలేదు అని చెప్పచ్చు. లైఫ్ లో ఎవరికైనా ఆశలు, కోరికలు ఉంటాయి. అయితే వాటికి ఒక హద్దు, పరిధి ఉంటే మంచిది. కోరికలు గుర్రాలైతే.. జీవితాలు గందరగోళంగా మారతాయి అనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. నాయుడు పాత్రలో ఆ విషయాన్ని ప్రతి సీన్ లో చూపిస్తూనే ఉంటారు. ప్రస్తుతం మనిషి మైండ్ సెట్ ని ప్రశ్నించేలా చాలా మంచి పాయింట్ ని పట్టుకున్నారు. చాలా సింపుల్ కథని.. చాలా క్రిస్ప్ గా.. చాలా కొత్తగా.. తరుణ్ భాస్కర్ స్టైల్ లో చూపించారు.

ఈ సినిమాలో వినిపించే ప్రతి డైలాగ్ మీ మైండ్ లో తిరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా చాలా సీరియస్ సీన్ లో చాలా సీరియస్ గా కామెడీ చేస్తూ ఉంటారు. తరుణ్ భాస్కర్- సిఖందర్(విష్ణు ఓయ్) మధ్య జరిగే ఇంగ్లీష్ సంభాషణలు గిలిగింతలు పెడతాయి. లీడ్ క్యారెక్టర్స్ అన్నీ మిమ్మల్ని దాదాపుగా అన్ని సీన్లలో నవిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా జీవన్ రావ్- విష్ణు ఓయ్ మధ్యలో ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ ఉంటుంది. అక్కడ పొట్ట చక్కలయ్యేలా నవ్వుకుంటారు. కథ చెప్పిన విధానం అందరినీ మెప్పిస్తుంది. ఈ సినిమాలో చాలానే పాత్రలు కనిపిస్తాయి. కానీ, ఏ ఒక్కటి ఎక్స్ ట్రా అనే భావన కలగదు. ప్రథమార్థం మాత్రం కాస్త నెమ్మదిగా నడుస్తున్న భావన కలుగుతుంది. విరామం తర్వాత సినిమా మరో మెట్టుకు చేరుతుంది. కథ వేగం పుంజుకుంటుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను మెప్పిస్తాయి.

ఎవరెలా చేశారు:

ఈ సినిమాలో బ్రహ్మానందం యాక్టింగ్ గురించి, కామెడీ టైమింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఉండే ప్రతి సీన్ లో ప్రేక్షకులను నవ్విస్తూనే ఉంటారు. వీల్ చీర్ లో ఉంటూనే కామెడీ ఇరగదీశారు. చైతన్యరావ్ తనదైనశైలిలో ప్రేక్షకులను మెప్పిస్తాడు. ముఖ్యంగా ఈ సినిమాతో తరుణ్ భాస్కర్ యాక్టర్ గా మరో మెట్టు ఎక్కారనే చెప్పాలి. సహజమైన నటనతో ప్రతి సీన్ రక్తికట్టించాడు. రఘు రామ్, జీవన్ కుమార్, విష్ణు ఓయ్, రాగ్ మయూర్, రవీంద్ర విజయ్ అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ వర్క్:

ఈ సినిమాలో డైరెక్టర్, రైటర్, యాక్టర్ ఇలా అన్ని కేటగిరీల్లో తరుణ్ భాస్కర్ కి చాలా మంచి మార్కులే పడతాయి. చాలా గ్యాప్ తర్వాత ఇది డైరెక్టర్ గా మంచి కంబ్యాక్ మూవీ అనే చెప్పాలి. ఈ సినిమా టేకింగ్ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ముఖ్యంగా ఏజే ఆరోన్ సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. కొన్ని షాట్స్ ప్రేక్షకులను అబ్బుర పరుస్తాయి. వివేక్ సాగర్ మ్యూజిక్ కూడా అలరిస్తుంది. ఉపేంద్ర వర్మ ఎడిటింగ్ చాలా షార్ప్ గా ఉంటుంది. నిర్మాణ విలువలు కూడా మెప్పిస్తాయి.

ప్లస్ లు:

  • తరుణ్ భాస్కర్
  • కథనం
  •  డైలాగ్స్

మైనస్లు:

  • ఫస్టాఫ్ లో సాగదీత
  • రొటీన్ స్టోరీ

రేటింగ్: 2.75/5

చివరిగా.. కీడా కోలా కితకితలతో కిక్కిస్తుంది..

Show comments