ప్రాజెక్ట్ K.. ఓకే చేయడానికి అసలు కారణం చెప్పిన కమల్ హాసన్!

ప్రాజెక్ట్ K.. ఓకే చేయడానికి అసలు కారణం చెప్పిన కమల్ హాసన్!

  • Author ajaykrishna Published - 02:14 PM, Fri - 21 July 23
  • Author ajaykrishna Published - 02:14 PM, Fri - 21 July 23
ప్రాజెక్ట్ K.. ఓకే చేయడానికి అసలు కారణం చెప్పిన కమల్ హాసన్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. తాను చేస్తున్న సినిమాల నుండి క్రేజీ క్రేజీ అప్డేట్స్ తో అభిమానులను ఫుల్ హ్యాపీ చేస్తున్నాడు. ఇటీవల సలార్ మూవీ టీజర్ తో ఆకట్టుకున్న ప్రభాస్.. తాజాగా ప్రాజెక్ట్ కే నుండి టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేసి రచ్చలేపాడు. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం అందకుండా.. ఒకే ఒక్క గ్లింప్స్ తో అందరి మైండ్ బ్లాక్ చేశాడు. ప్రాజెక్ట్ కే.. అసలు పేరు ఏంటని ఇన్నాళ్లు ఆత్రంగా ఎదురుచూసిన ఫ్యాన్స్ కి.. ప్రాజెక్ట్ కే అంటే.. ‘కల్కి'(Kalki 2898 AD) అని ప్రకటించేసాడు. ఈ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ అయ్యేదాకా సోషల్ మీడియాలో కే అంటే కాలచక్ర అని, ఇంకా రకరకాల పేర్లు వైరల్ అయ్యాయి. కానీ, టైటిల్ ఊహించినప్పటికీ.. విజువల్స్ అలా ఉంటాయని ఎవరు ఎక్స్ పెక్ట్ చేసి ఉండరు.

నిజంగా ప్రాజెక్ట్ కే విజువల్స్ ఆ రేంజ్ లో ఉంటాయని ఎవరు ఊహించలేదు. కనీసం ఎలా ఉండబోతున్నాయని అంచనా కూడా వేయలేకపోయారు. గ్లింప్స్ విడుదల అయ్యాక అందరు చెప్తున్న ఒకే మాట విజువల్ వండర్. ఒక్కో విజువల్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉండటం విశేషం. అయితే.. ఈ సినిమాలో ప్రభాస్ కల్కి క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. ఇంకా బిగ్ బి అమితాబ్ అశ్వథామ క్యారెక్టర్ అని.. దీపికా ఒక దేవత రోల్ అని అంటున్నారు. కానీ.. గ్లింప్స్ లో మెయిన్ క్యారెక్టర్స్ అందరిని రివీల్ చేసినప్పటికి.. విశ్వనటుడు కమల్ హాసన్ క్యారెక్టర్ ని రివీల్ చేయలేదు. పైగా ఆయన క్యారెక్టర్ ఎలాంటిది అని ఇప్పుడు అందరు ఆరాలు తీయడం మొదలుపెట్టారు.

ఇదిలా ఉండగా.. కమల్ హాసన్ ప్రాజెక్ట్ కే లోకి రావడం చాలా సర్ప్రైజింగ్ గా అయిపోయింది. ఆయన వచ్చేదాకా విలన్ రోల్ ఎవరు చేస్తారో అని కన్ఫ్యూషన్ లో ఉన్నారు జనాలు. అయితే.. టైటిల్, గ్లింప్స్ లాంచ్ చేయడానికి అమెరికాకు మూవీ టీమ్ తో పాటు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమాను ఎందుకు ఓకే చేసాడో చెప్పేశారు కమల్. ఆయన మాట్లాడుతూ.. “నేను సినిమా సంబంధమైన వ్యక్తిని. నెగటివ్ లేకపోతే పాజిటివ్ ఉండదు. సో.. ఆ నెగిటివ్ రోల్ సినిమాకి చాలా ఇంపార్టెంట్’ అని చెప్పుకొచ్చారు. దీంతో కమల్ క్యారెక్టర్ పై ఫ్యాన్స్ కి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. మరి కల్కినే అలా ఉంటే.. కమల్ రోల్ ఎలా ఉంటుందో ఊహకు అందట్లేదు. మరి ప్రాజెక్ట్ కే మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Show comments