Devil Movie Television Premiere: కళ్యాణ్ రామ్ డెవిల్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్

కళ్యాణ్ రామ్ డెవిల్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్

Devil Television Premiere: కళ్యాణ్ రామ్ డెవిల్ చిత్రం ఓటీటీలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు టెలివిజన్ ప్రీమియర్ కి రెడీ అయిపోయింది.

Devil Television Premiere: కళ్యాణ్ రామ్ డెవిల్ చిత్రం ఓటీటీలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు టెలివిజన్ ప్రీమియర్ కి రెడీ అయిపోయింది.

నందమూరి కళ్యాణ్‌ రామ్ ప్రధాన పాత్రలో నటించగా అభిషేక్ నామా నిర్మించి, దర్శకత్వం వహించిన చిత్రం డెవిల్. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి డిసెంబర్ 29, 2024న థియేటర్‌లలో విడుదలయిన ఈ పీరియాడిక్ స్పై యాక్షన్ థ్రిల్లర్ జనవరిలో ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రైమ్ వీడియోలో విడుదల అయింది. ఇక ఈ సినిమా టీవీలో ప్రసారం అయ్యే రోజు కూడా దగ్గర్లోనే ఉంది. ఈటీవీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కోసం సిద్ధమవుతున్న డెవిల్ ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశమైంది. మామూలుగా అయితే తెలుగు సినిమాలు జెమిని, స్టార్ మా, జీ తెలుగు వంటి స్టార్ ఛానెళ్లలో ప్రసారం అవుతాయి. అయితే డెవిల్ ఈటీవీలో ప్రసారం కావడం కాస్త ఆశ్చర్యపరిచే విషయమే.

మార్చి 10, 2024న సాయంత్రం 6 గంటలకు డెవిల్ ఈటీవీలో ప్రసారం కానుంది, థియేటర్‌లలో సినిమాను ఆస్వాదించిన ప్రేక్షకులు ఆ ఉత్సాహాన్ని మళ్ళీ పొందే అవకాశం ఉంటుంది. సంయుక్త కథానాయికగా, మాళవిక నాయర్, అజయ్, సత్య, షఫీ, వశిష్ట సింహ, అజయ్, సీత ఎడ్వర్డ్ సోనెన్‌బ్లిక్, ఇతరులు కీలక పాత్రల్లో నటించిన ఈ పీరియాడిక్ స్పై యాక్షన్ థ్రిల్లర్ కు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందించారు. కాగా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ ఈ సినిమాని నిర్మించింది. బాక్సాఫీసు వద్ద పరవాలేదు అనిపించుకున్న ఈ సినిమా ఓటీటీలో కూడా మంచి స్పందనను రాబట్టింది. మరి డెవిల్ టెలివిజన్ ప్రీమియర్ ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూద్దాం.

డెవిల్ సినిమా కథ:

1945లో బ్రిటీష్ ఇండియా మద్రాస్ ప్రెసిడెన్సీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ (కళ్యాణ్ రామ్) ఒక హత్య కేసును ఛేదించే లక్ష్యంతో ఉంటాడు. విచారణ మొత్తంలో, డెవిల్ అనేక మలుపులతో పాటు సవాళ్ళను ఎదుర్కొంటాడు. తన మార్గంలో ఊహించని సంఘటనలను కూడా ఎదుర్కొంటాడు. నైషాద (సంయుక్త)తో అతని ప్రేమ, అతన్ని మణిమేకల (మాళవిక నాయర్), ఆమె స్వాతంత్ర్య సమరయోధుల బృందం వద్దకు నడిపిస్తుంది. డెవిల్ తన పరిశోధనను విజయవంతంగా ముగించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కథ మరింత ఆసక్తికరంగా తయారవుతుంది.

Show comments