Pilot: Flight గాల్లో ఉండగానే పురిటి నొప్పులు.. గర్భిణీకి ప్రసవం చేసిన పైలట్.. చివరికి..

Flight గాల్లో ఉండగానే పురిటి నొప్పులు.. గర్భిణీకి ప్రసవం చేసిన పైలట్..

ప్రయాణ సమయాల్లో హెల్త్ ఎమర్జెన్సీ వస్తుందని ఎవరూ అనుకోరు కదా. మరీ ముఖ్యంగా విమానాల్లో ఈ పరిస్థితి తలెత్తితే ఆందోళన కరంగా ఉంటుంది. కాగా విమానం గాల్లో ఉండగానే ఓ గర్భిణీకి పురిటి నొప్పులు రాగా పైలట్ విజయవంతంగా ప్రసవం చేశాడు.

ప్రయాణ సమయాల్లో హెల్త్ ఎమర్జెన్సీ వస్తుందని ఎవరూ అనుకోరు కదా. మరీ ముఖ్యంగా విమానాల్లో ఈ పరిస్థితి తలెత్తితే ఆందోళన కరంగా ఉంటుంది. కాగా విమానం గాల్లో ఉండగానే ఓ గర్భిణీకి పురిటి నొప్పులు రాగా పైలట్ విజయవంతంగా ప్రసవం చేశాడు.

ఫ్లైట్ జర్నీ చేసే సమయాల్లో టెక్నికల్ సమస్యలు, పైలట్ తప్పిదాల కారణంగా ప్రమాదాలు చోటుచేసుకోవడం చూస్తుంటాం. అటువంటి సమయాల్లో కొందరు పైలట్ లు చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని ప్రమాద భారి నుంచి తప్పిస్తారు. ఇక హెల్త్ ఎమర్జెన్సీ సమయాల్లో ఆ విమానంలో ఉన్న ప్రయాణికుల్లో వైద్యులు ఉన్నట్లైతే ఫ్లైట్ ఆకాశంలో విహరిస్తుండగానే చికిత్సను అందించి ప్రాణాలు నిలబెడుతుంటారు. ఇది వరకు ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. కాగా తాజాగా ఓ పైలట్ వైద్యుడిగా మారాడు. విమానం నడుపుతున్న పైలట్ గాల్లో ఉండగానే దాన్ని వదిలేసి ఓ మహిళకు ప్రసవం చేశాడు. దీనికి సంబంధించి ఆ పైలట్ చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తైవాన్ నుంచి బ్యాంకాక్‌కు బయల్దేరిన వీట్‌జెట్‌కు చెందిన విమానంలో నిండు గర్భిణీ ప్రయాణిస్తోంది. ఫ్లైట్ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే ఆ గర్భిణీకి పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఈ సమయంలో ఆ ఫ్లైట్ లో డాక్టర్లు కూడా ఎవరూ లేకపోవడంతో గర్భిణీతో పాటు ప్రయాణికులు కూడా ఆందోళనకు గురయ్యారు. ఇక చేసేదేం లేక విమానం నడుపుతున్న పైలట్ జాకరిన్ కు సమాచారం అందించారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేద్దామంటే అంత సమయం లేదు.. ల్యాండింగ్ చేసే పరిస్థితులు కనిపించలేదు. ఇక ఇప్పుడే పైలట్ సమయస్ఫూర్తిని చాటాడు. జాకరిన్ తన కో-పైలట్ కు బాధ్యతలను అప్పగించి తెలిసిన డాక్టర్లకు ఫోన్ చేసి గర్భిణీ పరిస్థితిని వివరించాడు.

వైద్యులు చేసిన సూచనలు, సలహాలతో ప్రసవం చేయడం ప్రారంభించాడు. చివరాఖరికి ప్రసవాన్ని విజయవంతంగా పూర్తి చేశాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానం బ్యాంకాక్ కు చేరుకోగానే తల్లీబిడ్డలిద్దర్ని హాస్పిటల్ కు తరలించారు. వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండడంతో పెద్ద ఆపద తప్పిందని.. ఇందుకు కారణమై పైలట్ పై సర్వత్ర ప్రశంసలు కురిపించారు. ఇక విమానం గాల్లో ఎగురుతుండగానే జన్మించిన శిశువుకు స్కై బేబీ అని నామకరణం చేశారు. దీనిపై జాకరిన్ స్పందిస్తూ 18 ఏళ్లుగా పైలట్ గా విధులు నిర్వహిస్తున్నానని ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి తలెత్తలేదని వెల్లడించాడు.

Show comments