Jai Bhim Real Sengeni Parthy Struggle: జై భీమ్ సూపర్ హిట్. కానీ.. ఇప్పటికీ కష్టాల్లోనే రియల్ బాధితురాలు!

జై భీమ్ సూపర్ హిట్. కానీ.. ఇప్పటికీ కష్టాల్లోనే రియల్ బాధితురాలు!

గత ఏడాది జాతీయ అవార్డులు ప్రకటించగానే.. అరే ఆ సినిమాకు ఒక్క అవార్డు కూడా రాలేదా అని నుదురు చిట్లించుకున్నారు. ఈ రియల్ స్టోరీకి రాకపోవడమేమిటనీ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విమర్శించారు. మరీ రియల్ లైఫ్ కధలేమైనా మారిపోయాయా అంటే..?

గత ఏడాది జాతీయ అవార్డులు ప్రకటించగానే.. అరే ఆ సినిమాకు ఒక్క అవార్డు కూడా రాలేదా అని నుదురు చిట్లించుకున్నారు. ఈ రియల్ స్టోరీకి రాకపోవడమేమిటనీ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విమర్శించారు. మరీ రియల్ లైఫ్ కధలేమైనా మారిపోయాయా అంటే..?

 2021 ఏడాదికి గానూ 69వ జాతీయ అవార్డులను గత ఏడాది ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఉత్తమ చిత్రంగా రాకెట్రీ నిలిచింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ నిలిచాడు. అయితే దేశంలో కొన్ని చిత్రాలకు అవార్డులు రాకపోవడంపై విమర్శలు వచ్చాయి. ఆ మూవీల్లో ఒకటి జై భీమ్. అవార్డు పొందేందుకు అన్నీ అర్హతలు ఉన్నా.. ఒక్కటంటే ఒక్క అవార్డు రాకపోవడంతో చాలా మంది నిరాశ చెందారు. ఎందుకంటే.. కరోనా సెకండ్ వేవ్‌లో నేరుగా ఓటీటీలోకి రిలీజైన ఈ మూవీ ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. వాస్తవిక కథను తెరపైకి ఎక్కించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు టీజే జ్ఞానవేల్ . విమర్శకులు సైతం ఈ సినిమాకు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. జై భీమ్ నచ్చలేదు అన్న వాళ్లు చాలా అరుదు.

తమిళ కేటగిరీలో ఈ సినిమాకు అవార్డు వస్తుందని భావించారు కానీ రాలేదు. ఇందులో సూర్య, లిజోమోల్ జోస్, మణికందన్ (ట్రూలవర్) కీలక పాత్రలు పోషించారు. 2D ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై జ్యోతిక, సూర్య నిర్మించారు. గిరిజనులపై జరుగుతున్న అన్యాయాలను ఎదురించిన ఓ లాయర్.. వారి జీవితాల్లో ఎలా వెలుగునింపాడో చూపించిన చిత్రం ఇది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ ప్రశంసలు పొందారు. సినిమాకు మంచి వ్యూస్ దక్కి.. నిర్మాతలు గట్టిగానే సంపాదించారు. ఇందులో బాధితులుగా రాజ కన్నుగా మణికందన్, సెంగనీ రాజకన్నుగా లిజిమోల్ జోస్ పాత్రలకు మరింత ఆదరణ దక్కింది. మరీ నిజ జీవితంలో ఈ రియల్ పాత్ర ధారి ఎలా ఉందో తెలుసా.. ఈ సినిమా వచ్చి రెండేళ్లు గడిచిపోయింది. మరీ ఆమె జీవితం ఎలా మారిందో తెలుసా..?

 సెంగనీ రియల్ లైఫ్ పేరు పార్వతి.. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మా జీవితంలో పెద్ద మార్పులు ఏమీ చోటుచేసుకోలేదని కన్నీరు మున్నీరైంది. భర్తను ఓ కేసులో అక్రమంగా ఇరికించిన పోలీసులు.. జైల్లో ఉంచి కొట్టి చంపిన సంగతి విదితమే. తన భర్త ఏ పాపం ఎరుగడని ఆమె పెద్ద పోరాటమే చేసింది. చివరకు న్యాయం జరిగింది.. కానీ ఇప్పటికీ పరిష్కారం అందలేదు. ఇదే ఆమె చెబుతూ.. కోర్టులో ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. తమకు పరిహారం ఇవ్వలేదని, మమ్మల్నే కాదు.. మా బంధువులందర్నీ తమిళనాడు పోలీసులు కొట్టి హింసించారని తెలిపింది. ఇప్పటి వరకు తమిళనాడు ప్రభుత్వం నుండి రూ. 4 లక్షలు మాత్రమే శాంక్షన్ అయ్యాయి. కానీ నాకు లక్షా పదివేలు మాత్రమే అందాయి. అంటే.. నా జీవితానికి లక్షా పదివేల రూపాయల విలువ మాత్రమే ఉందా అంటూ బాధపడింది పార్వతి.

‘ఈ కేసు నడుస్తున్నప్పుడు.. మమ్మల్ని ఉపసంహరించుకోవాలని కోరారు. చాలా సమస్యలు తెచ్చారు.. కానీ ఆ సమయలో కమ్యూనిస్టు పార్టీ మద్దుతుగా నిలిచింది. నాకు ముగ్గురు పిల్లలు. ఎవరు చదువుకోలేదు. అందరూ కూలీ పనులు చేస్తున్నారు. నా కొడుకులకు ఎనిమిది మంది పిల్లలు. కూతురికి ఇద్దరు పిల్లలు. మొత్తం 10 మంది మనవళ్లు, మనవరాళ్లు. జై భీమ్ తర్వాత చాలా మందికి నా జీవితం గురించి తెలిసింది. సూర్య సార్ నాకు రూ. 10 లక్షలు ఇచ్చారు. ఇది డిపాజిట్ ఫండ్ కాబట్టి నెలకు రూ. 4 నుండి రూ.5 వేలు వస్తుంది. అది మనవళ్లకు ఇస్తున్నా. లారెన్స్ నాకు లక్ష ఇచ్చి.. ఆర్థిక సాయం చేశాడు. కానీ ఇప్పటికీ సొంత ఇల్లు లేదు. చింత చెట్టు కింద జీవిస్తున్నాం. నా పిల్లలకు కూడా నివాసం లేదు. అందుకే మాకు న్యాయం జరిగేందుకు కొడుకులు కోర్టులో దావా వేస్తున్నారు. తగిన నష్ట పరిహారం, న్యాయం చేయాల్సిన బాధ్యత తమిళనాడు ప్రభుత్వానికి ఉంది’ అంటూ పేర్కొంది పార్వతి.

Show comments