Bhuvneshwar Kumar: రాజస్థాన్ పై థ్రిల్లింగ్ విక్టరీ.. భువనేశ్వర్ రేర్ ఫీట్! 7 ఏళ్ల తర్వాత తొలిసారి

Bhuvneshwar Kumar: రాజస్థాన్ పై థ్రిల్లింగ్ విక్టరీ.. భువనేశ్వర్ రేర్ ఫీట్! 7 ఏళ్ల తర్వాత తొలిసారి

రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ రేర్ ఫీట్ సాధించాడు. 7 సంవత్సరాల తర్వాత భువీ ఇది సాధించడం ఇదే తొలిసారి. మరి ఆ వివరాల్లోకి వెళితే..

రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ రేర్ ఫీట్ సాధించాడు. 7 సంవత్సరాల తర్వాత భువీ ఇది సాధించడం ఇదే తొలిసారి. మరి ఆ వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ 2024లో అసలైన మ్యాచ్ అంటే ఎలా ఉంటుందో రాజస్థాన్ వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచ్ చూస్తే తెలుస్తుంది. ఎన్నో మలుపులు, నరాలు తెగే ఉత్కంఠ. చివరి బంతి వరకు ఎంతో రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ బౌలర్లు ఓ అద్భుతమే చేశారు. దాంతో వరుసగా నాలుగు విజయాలతో జైత్రయాత్ర సాగిస్తున్న రాజస్తాన్ కు ఒక్క పరుగు తేడాతో గెలిచి ఊహించని షాకిచ్చింది హైదరాబాద్ టీమ్. ఇక ఈ మ్యాచ్ ద్వారా భువనేశ్వర్ ఓ రేర్ ఫీట్ ను సాధించాడు. 7 సంవత్సరాల తర్వాత భువీ ఈ క్రేజీ ఫీట్ ను సాధించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

వరుస పరాజయాలతో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో దుమ్ములేపింది. వరుసగా నాలుగు విజయాలతో ఈ ఐపీఎల్ సీజన్ దూసుకెళ్తున్న రాజస్తాన్ కు భారీ షాకిచ్చింది SRH. గురువారం ఉప్పల్ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఒక్క పరుగు తేడాతో హైదరాబాద్ టీమ్ థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన SRH నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 రన్స్ చేసింది. ట్రావిస్ హెడ్(58), నితీశ్ కుమార్ రెడ్డి(76*), క్లాసెన్(42*) రన్స్ తో రాణించారు.

అనంతరం 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి, ఒక్క రన్ తో ఓడిపోయింది. యశస్వీ జైస్వాల్(67), రియాన్ పరాగ్(77) పరుగులతో పోరాటం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. రాజస్తాన్ కు చివరి ఓవర్లో 13 రన్స్ అవసరం అయ్యాయి. ఈ క్రమంలో భువనేశ్వర్ అద్భుతమైన బౌలింగ్ లో ఆకట్టుకున్నాడు. చివరి బంతికి ఆర్ఆర్ విజయానికి 2 పరుగులు అవసరం కాగా.. భువీ యార్కర్ ను ఆడలేకపోయిన పావెల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో సన్ రైజర్స్ సంచలన విజయాన్ని నమోదు చేసింది.

ఇక ఈ మ్యాచ్ లో భువనేశ్వర్ 41 పరుగులు ఇచ్చి 3 వికెట్లు కూల్చాడు. దీంతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ ను దక్కించుకున్నాడు భువీ. అయితే 7 ఏళ్ల తర్వాత అతడు అందుకున్న తొలి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ ఇదే కావడం విశేషం. ఈ అవార్డు కు ముందు 7 సంవత్సరాలుగా ఒక్క ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అందుకోకపోవడం గమనార్హం. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత భువీ ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డ్ అందుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments