క్రికెట్ లో తీవ్ర విషాదం.. ముందు రోజే 3 వికెట్లు తీశాడు.. అంతలోనే 20 ఏళ్ల క్రికెటర్ మరణం!

క్రికెట్ లో తీవ్ర విషాదం.. ముందు రోజే 3 వికెట్లు తీశాడు.. అంతలోనే 20 ఏళ్ల క్రికెటర్ మరణం!

ముందురోజు జరిగిన మ్యాచ్ లో 3 వికెట్లు తీసిన 20 ఏళ్ల క్రికెటర్.. ఆ తర్వాతి రోజే మరణించిన వార్త క్రీడా ప్రేమికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ముందురోజు జరిగిన మ్యాచ్ లో 3 వికెట్లు తీసిన 20 ఏళ్ల క్రికెటర్.. ఆ తర్వాతి రోజే మరణించిన వార్త క్రీడా ప్రేమికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

నిన్న అరుదైన గుండె జబ్బుతో 23 ఏళ్లకే తన క్రికెట్ కెరీర్ కు ముగింపు పలికి అందరికి షాకిచ్చాడు ఇంగ్లండ్ కు చెందిన యువ ఆటగాడు. దాంతో పాపం అంటూ క్రీడాభిమానుంలదరూ తమ బాధను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేశారు. ఆ విషాద వార్తను మరిచిపోకముందే క్రికెట్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ముందురోజు మ్యాచ్ లో 3 వికెట్లు పడగొట్టిన ఓ ప్లేయర్ ఆ మరుసటి రోజే మరణించాడు. 20 ఏళ్లకే తన తనువు చాలించాడు. ఈ విషాదకర వార్త గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

ఇంగ్లండ్ క్రికెట్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ దేశ కౌంటీ క్రికెటర్ అయిన యంగ్ స్పిన్నర్ జోష్ బేకర్ హఠాన్మరణం చెందాడు. ఈ వార్తలో ఇంగ్లండ్ క్రికెట్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బేకర్ వోర్సెస్టర్ షైర్ క్రికెట్ క్లబ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే అతడి మరణానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. కానీ బేకర్ రోడ్డు ప్రమాదంలో మరణించాడని కొన్ని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

కాగా.. కౌంటీ క్రికెట్ లో భాగంగా సోమర్ సెట్ తో జరుగుతున్న మ్యాచ్ లో 3 వికెట్లు పడగొట్టాడు. కానీ ఇంతలోనే అతడి మరణ వార్త వినడం అందరిని షాక్ కు గురిచేసింది. ఇక 2021లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన బేకర్.. ఇప్పటి వరకు 47 మ్యాచ్ లు ఆడి 525 పరుగులతో పాటుగా 70 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉండగా.. అండర్ 19 ప్రపంచ కప్ 2022 కోసం ఎంపికైన టీమ్ లో ఇంగ్లండ్ రిజర్వ్ ఆటగాళ్ల లిస్ట్ లో బేకర్ ఉన్నాడు. బేకర్ హఠాన్మరణం పట్ల ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ సంతాపం వ్యక్తం చేసింది. బేకర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Show comments