Rohit Sharma: SRHపై గెలిచినా.. బాధలో రోహిత్ శర్మ! వీడియో వైరల్..

Rohit Sharma: SRHపై గెలిచినా.. బాధలో రోహిత్ శర్మ! వీడియో వైరల్..

సన్ రైజర్స్ పై అద్భుతమైన విజయం సాధించినప్పటికీ.. ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ బాధలో కనిపించాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి రోహిత్ బాధకు కారణం ఏంటి?

సన్ రైజర్స్ పై అద్భుతమైన విజయం సాధించినప్పటికీ.. ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ బాధలో కనిపించాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి రోహిత్ బాధకు కారణం ఏంటి?

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఐపీఎల్ లో పేలవ ఫామ్ ను కొనసాగిస్తూ వస్తున్నాడు. తొలి మ్యాచ్ ల్లో కాస్త రాణించినప్పటికీ.. రానురాను దారుణ ఫామ్ తో విమర్శలపాలవుతున్నాడు. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసి.. కమ్మిన్స్ బౌలింగ్ లో చెత్త షాట్ కొట్టి క్లాసెన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ విజయం సాధించడంతో రోహిత్ వైఫల్యం గురించి ఎవ్వరూ పెద్దగా చర్చించుకోవడం లేదు. కానీ మ్యాచ్ గెలిచినా.. రోహిత్ బాధలో ఉన్నాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

టీ20 వరల్డ్ కప్ ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పూర్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ఇది టీమిండియాకు టెన్షన్ గా మారింది. ఈ సీజన్ ఫస్టాప్ లో పర్వాలేదనిపించిన హిట్ మ్యాన్.. సెకండాఫ్ లో దారుణంగా విఫలం అవుతున్నాడు. తొలి ఏడు మ్యాచ్ ల్లో 297 రన్స్ చేసిన అతడు.. ఆ తర్వాత 5 ఇన్నింగ్స్ ల్లో కేవలం 34 రన్స్ మాత్రమే చేశాడంటేనే అర్ధం చేసుకోవచ్చు, హిట్ మ్యాన్ పూర్ ఫామ్ ను. ఇదిలా ఉండగా.. తాజాగా సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా 4 పరుగులే చేసి నిరాశపరిచాడు రోహిత్. దాంతో డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లి.. బాధపడిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. రోహిత్ బాధంతా అతడి ఫేస్ లో స్పష్టంగా కనిపిస్తోంది.

మ్యాచ్ గెలిచినా.. కూడా సంతోషంగా లేడు రోహిత్. దానికి కారణం తన పూర్ ఫామే అని అర్ధమవుతోంది. ఓవైపు కెప్టెన్సీ పోయిన బాధ, మరోవైపు బ్యాటింగ్ లో రాణించలేకపోతున్నాను అన్న నిరాశే అతడి బాధకు కారణంగా తెలుస్తోంది. డ్రెస్సింగ్ రూమ్ లో రోహిత్ బాధపడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అనంతరం 174 రన్స్ టార్గెట్ ను 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది ముంబై. సూర్యకుమార్ యాదవ్(102*) విధ్వంసకర సెంచరీతో ముంబైకి ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. మరి మ్యాచ్ గెలిచినా.. రోహిత్ బాధపడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments