MI vs LSG Ayush Badoni Run Out: లక్నో బ్యాటర్ రనౌట్.. నమ్మశక్యం కాని సీన్ ఇది!

MI vs LSG: లక్నో బ్యాటర్ రనౌట్.. నమ్మశక్యం కాని సీన్ ఇది!

ముంబై ఇండియన్స్-లక్నో సూపర్ జియాంట్స్ మ్యాచ్​లో ఓ బ్యాటర్ రనౌట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అతడు ఔటా? నాటౌటా? అనే దానిపై సోషల్ మీడియాలోనూ బాగా డిస్కషన్స్ నడుస్తున్నాయి.

ముంబై ఇండియన్స్-లక్నో సూపర్ జియాంట్స్ మ్యాచ్​లో ఓ బ్యాటర్ రనౌట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అతడు ఔటా? నాటౌటా? అనే దానిపై సోషల్ మీడియాలోనూ బాగా డిస్కషన్స్ నడుస్తున్నాయి.

ఐపీఎల్-2024లో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది లక్నో సూపర్ కింగ్స్. ముంబై ఇండియన్స్​తో వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్​లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది రాహుల్ సేన. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన ఎంఐ.. ఓవర్లన్నీ ఆడి 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఈజీ టార్గెట్​ను మరో 4 బంతులు ఉండగానే ఛేజ్ చేసింది ఎల్​ఎస్​జీ. ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్​లో మూడో స్థానానికి ఎగబాకింది లక్నో. అయితే ఈ మ్యాచ్​లో ఓ రనౌట్ గురించి ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. అసలు అది ఔటా? నాటౌటా? అనేది చాలా మంది తేల్చుకోలేకపోతున్నారు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

నిన్నటి మ్యాచ్​లో లక్నో ఇన్నింగ్స్​లో ఓ నమ్మశక్యం కాని సీన్ చోటుచేసుకుంది. ఎల్​ఎస్​జీ బ్యాటర్ ఆయుష్ బదోని (6) రనౌట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్​లో షార్ట్ బాల్​ను బదోని డీప్ పాయింట్ వైపు లాగి కొట్టాడు. ఆ బాల్​కు రెండు పరుగులు తీయాలని బదోని ఫిక్స్ అయ్యాడు. అయితే సబ్​స్టిట్యూట్ ఫీల్డర్ నమన్ ధీర్ కరెక్ట్ టైమ్​కు బాల్ పిక్ చేసుకొని త్రో విసరడంతో డబుల్ కష్టమైంది. ఎలాగైనా పరుగు పూర్తి చేయాలనే ఉద్దేశంతో బదోని డైవ్ చేసి మరీ క్రీజులోకి చేరుకున్నాడు. లైవ్​లో చూస్తున్నప్పుడు అతడు క్రీజులోకి ఈజీగా చేరుకున్నట్లే కనిపించాడు. దీంతో అందరూ అతడు నాటౌట్ అని అనుకున్నారు. కానీ బదోనీని ఔట్​గా ప్రకటించారు అంపైర్లు.

డైవ్ చేసినా బదోని రనౌట్ అయ్యాడు. దీనికి కారణం అతడు బ్యాట్​ను క్రీజులో సరిగ్గా పెట్టకపోవడమే. నమన్ ధీర్ త్రోకు భయపడి డైవ్ చేశాడు బదోని. బాల్ అందుకున్న ముంబై కీపర్ ఇషాన్ కిషన్ వెంటనే వికెట్లను గిరాటేశాడు. అప్పటికే బదోని బ్యాట్ క్రీజులోకి వచ్చింది. కానీ అతడి బ్యాట్ మొత్తం గాల్లోనే ఉండటంతో అంపైర్లు ఔట్​గా ప్రకటించారు. దాదాపుగా బ్యాట్ మొత్తం క్రీజు లోపలే ఉన్నా ఇషాన్ స్టంప్స్ పడేసిన టైమ్​లో మాత్రం బ్యాట్ గ్రౌండ్​కు టచ్ కాలేదు. దీంతో నిరాశతో పెవిలియన్​కు చేరాడు బదోని. అతడు ఔట్ కాదని కొందరు వాదిస్తున్నారు. కానీ రూల్స్ ప్రకారం బ్యాట్ నేలను తాకాలి. బదోని విషయంలో అలా జరగకపోవడంతో అంపైర్లు ఔట్ ఇచ్చారు. మరి.. బదోని రనౌట్ విషయంలో మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Show comments