Hardik Pandya: తిలక్ వర్మపై హార్దిక్ ఘాటు వ్యాఖ్యలు.. అతడి వల్లే ఓటమి అంటూ...!

Hardik Pandya: తిలక్ వర్మపై హార్దిక్ ఘాటు వ్యాఖ్యలు.. అతడి వల్లే ఓటమి అంటూ…!

తిలక్ వర్మ వల్లే ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయామని అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేశాడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా. మరి పాండ్యా ఈ కామెంట్స్ చేయడానికి కారణం ఏంటంటే?

తిలక్ వర్మ వల్లే ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయామని అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేశాడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా. మరి పాండ్యా ఈ కామెంట్స్ చేయడానికి కారణం ఏంటంటే?

నిన్న(శనివారం) ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 10 పరుగుల తేడాతో ఓడిపోయింది ముంబై ఇండియన్స్. భారీ స్కోర్లు నమోదు అయిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 4 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. అనంతరం 258 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై 247 రన్స్ చేసి.. 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక ఈ మ్యాచ్ లో ముంబైని గెలిపించడానికి చివరి వరకు విశ్వప్రయత్నం చేశాడు తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ. కానీ జట్టుకు విజయన్ని అందించడంలో విఫలం అయ్యాడు. అయితే ఈ మ్యాచ్ తిలక్ వర్మ వల్లే ఓడిపోయామని అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేశాడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా.

ఐపీఎల్ 2024లో భాగంగా తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 10 పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో ముంబైకి విజయాన్ని అందించడానికి చివరి వరకు ప్రతయత్నించాడు తెలుగు ప్లేయర్, ముంబై స్టార్ ఆటగాడు తిలక్ వర్మ. ఈ మ్యాచ్ లో 32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 63 పరుగులు చేసి చివరి ఓవర్లో రనౌట్ గా వెనుదిరిగాడు. అయితే సూపర్ ఇన్నింగ్స్ ఆడినా గానీ ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా అతడిపై విమర్శలు చేశాడు. తిలక్ వర్మ వల్లే ఈ మ్యాచ్ లో ఓడిపోయామని అర్ధం పర్థం లేని వ్యాఖ్యలు చేశాడు.

మ్యాచ్ అనంతరం పాండ్యా మాట్లాడుతూ..”ముంబై ఓటమికి ప్రధాన కారణం తిలక్ వర్మ అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే? ఇన్నింగ్స్ 8వ ఓవర్లో అక్షర్ పటేల్ బౌలింగ్ వచ్చాడు. లెఫ్ట్ హ్యాండర్ అయిన తిలక్ వర్మ ఈ ఓవర్లో దూకుడుగా ఆడాల్సింది. కానీ తొలి నాలుగు బంతులకు సింగిల్స్ మాత్రమే తీశారు. అక్కడే మ్యాచ్ టర్న్ అయ్యింది.. మా చేతుల్లోంచి జారిపోయింది” అని ఓటమికి తిలక్ కారణమని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. నీ కెప్టెన్సీలో దమ్ములేక ఓడిపోతూ.. అద్భుతంగా రాణిస్తున్నా తిలక్ వర్మను బద్నాం చేస్తున్నవ్ ఎందుకు? అని విమర్శిస్తున్నారు. మరి పాండ్యా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments