GT vs PBKS: గుజరాత్ vs పంజాబ్.. గెలుపెవరిదంటే? ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!

GT vs PBKS: గుజరాత్ vs పంజాబ్.. గెలుపెవరిదంటే? ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!

వరుస ఓటములతో డీలాపడ్డ పంజాబ్​కు, సక్సెస్ ట్రాక్​పై ఉన్న గుజరాత్​కు మధ్య ఇంట్రెస్టింగ్​ మ్యాచ్​ జరగనుంది. ఈ రెండు టీమ్స్ బలాబలాలు ఎలా ఉన్నాయి, ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

వరుస ఓటములతో డీలాపడ్డ పంజాబ్​కు, సక్సెస్ ట్రాక్​పై ఉన్న గుజరాత్​కు మధ్య ఇంట్రెస్టింగ్​ మ్యాచ్​ జరగనుంది. ఈ రెండు టీమ్స్ బలాబలాలు ఎలా ఉన్నాయి, ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

గతేడాది రన్నరప్ గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్​లోనూ జోరు మీద ఉంది. ఆడిన 3 మ్యాచుల్లో రెండింట్లో గెలిచి మంచి ఊపులో కనిపిస్తోంది. ఈ టీమ్ తమ నాలుగో మ్యాచ్​లో పంజాబ్ కింగ్స్​ను ఢీకొనేందుకు సిద్ధమవుతోంది. ఫస్ట్ మ్యాచ్​లో విక్టరీతో సీజన్​ను పాజిటివ్​గా స్టార్ట్ చేసిన ధావన్ సేన.. తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి డీలాపడింది. విజయాల జోరును కొనసాగించాలని అనుకుంటున్న గుజరాత్​కు, మళ్లీ సక్సెస్ ట్రాక్ మీదకు రావాలని చూస్తున్న పంజాబ్​కు ఈ మ్యాచ్ ఎంతో కీలకం కానుంది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ వేదికగా గురువారం జరగబోయే ఈ పోరులో ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

గుజరాత్ టైటాన్స్

చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి నుంచి త్వరగా బయటపడిన గుజరాత్ టైటాన్స్.. మూడో మ్యాచ్​లో సన్​రైజర్స్ హైదరాబాద్​ను ఓడించింది. ఈ టీమ్ అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. బ్యాటింగ్​లో ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, శుబ్​మన్ గిల్ మంచి టచ్​లో ఉన్నారు. సాయి సుదర్శన్ బ్యాక్ టు బ్యాక్ సూపర్బ్ నాక్స్​తో టీమ్​కు అతి పెద్ద బలంగా మారాడు. డేవిడ్ మిల్లర్ కూడా ఫామ్​ను అందుకున్నాడు. బౌలింగ్​లో మోహిత్ శర్మ జట్టుకు ఆయువుపట్టులా మారాడు. మిడిల్ ఓవర్స్​లో రన్స్ కట్టడి చేస్తూనే వికెట్లు కూడా పడగొడుతున్నాడు మోహిత్. అతడికి తోడుగా ఉమేశ్ యాదవ్, అజ్మతుల్లా ఒమర్జాయి రాణిస్తుండటం జీటీకి కలిసొచ్చే అంశం. కెప్టెన్సీలో గిల్ మ్యాచ్​ మ్యాచ్​కు ఇంప్రూవ్ అవుతున్నాడు.

పంజాబ్ కింగ్స్

పంజాబ్ జట్టులో నెగెటివ్ పాయింట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. బ్యాటింగ్ ఫెయిల్యూర్​ ఆ టీమ్​ను తీవ్రంగా వేధిస్తోంది. బ్యాటింగ్​లో కెప్టెన్ శిఖర్ ధావన్ ఒక్కడే కన్​సిస్టెంట్​గా రన్స్ చేస్తున్నాడు. బెయిర్​స్టో గత మ్యాచ్​తో ఫామ్​లోకి రావడం కలిసొచ్చే అంశం. మిగిలిన బ్యాటింగ్ యూనిట్ మొత్తం పేలవంగా పెర్ఫార్మ్ చేయడం టీమ్​కు బిగ్ మైనస్​గా మారింది. బౌలింగ్ యూనిట్ కూడా సమష్టిగా రాణించడం లేదు. సామ్ కర్రన్ మంచి ఫామ్​లో ఉన్నాడు. కానీ అర్ష్​దీప్, రబాడ, రాహుల్ చాహర్ భారీగా పరుగులు ఇచ్చుకుంటున్నారు. హర్షల్ పటేల్ అయితే వికెట్లు తీయకపోగా ధారాళంగా రన్స్ సమర్పించుకుంటూ టీమ్​కు బిగ్ మైనస్​గా మారాడు. గెలుపోటముల సంగతి పక్కనబెడితే పంజాబ్ ఒక టీమ్​గా ఇంతవరకు సెట్ కాకపోవడం గమనార్హం.

ప్రిడిక్షన్

ఇరు జట్ల బలాబలాలను బట్టి రేపటి మ్యాచ్​లో గుజరాత్ నెగ్గడం ఖాయం. ఈ రెండు టీమ్స్ మధ్య ఇప్పటివరకు 3 మ్యాచ్​లు జరిగాయి. ఇందులో ఒకసారి పంజాబ్​ నెగ్గగా.. మిగిలిన రెండు మ్యాచుల్లో జీటీ గెలిచింది. రేపటి మ్యాచ్​లో గుజరాత్​ను ఓడించడం కంటే కూడా ఓవరాల్ టీమ్ ఎఫర్ట్​ పెట్టడంపై పంజాబ్ ఫోకస్ చేయాలి. ఆ టీమ్​ జీటీని మట్టికరిపించాలంటే తమ బెస్ట్​ గేమ్​ను బయటపెట్టాలి.

ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా)

గుజరాత్: వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుబ్​మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, అజ్మతుల్లా ఒమర్జాయి, విజయ్‌ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేశ్ యాదవ్, మోహిత్ శర్మ.

పంజాబ్: శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్​స్టో, సామ్ కర్రన్, లియామ్ లివింగ్​స్టన్, జితేష్​ శర్మ (వికెట్ కీపర్), శషాంక్ సింగ్, హర్​ప్రీత్ బ్రార్, కగిసో రబాడ, హర్షల్ పటేల్, అర్ష్​దీప్ సింగ్, రాహుల్ చాహర్.

Show comments