GT Breaks SRH Record In CSK Match: SRH రికార్డు బద్దలు కొట్టిన గుజరాత్ టైటాన్స్.. ఇది మామూలు ఘనత కాదు!

SRH రికార్డు బద్దలు కొట్టిన గుజరాత్ టైటాన్స్.. ఇది మామూలు ఘనత కాదు!

సన్​రైజర్స్ హైదరాబాద్ రికార్డును గుజరాత్ టైటాన్స్ బద్దలు కొట్టింది. సీఎస్​కేతో మ్యాచ్​లో జీటీ అరుదైన ఘనతను అందుకుంది.

సన్​రైజర్స్ హైదరాబాద్ రికార్డును గుజరాత్ టైటాన్స్ బద్దలు కొట్టింది. సీఎస్​కేతో మ్యాచ్​లో జీటీ అరుదైన ఘనతను అందుకుంది.

ప్లేఆఫ్స్ రేసు నుంచి టెక్నికల్​గా తప్పుకున్న గుజరాత్ టైటాన్స్​.. ఇప్పుడు పోయిన పరువును నిలబెట్టుకునే పనిలో ఉంది. అందులో భాగంగానే చెన్నై సూపర్ కింగ్స్​తో మ్యాచ్​లో నెక్స్ట్ లెవల్ హిట్టింగ్​తో అదరగొడుతోంది. ఈ మ్యాచ్​తో సన్​రైజర్స్ హైదరాబాద్ రికార్డును కూడా జీటీ బ్రేక్ చేసింది. సీఎస్​కేతో మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన గుజరాత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఆ జట్టు ఓపెనర్లు సాయి సుదర్శన్ (46 బంతుల్లో 94 నాటౌట్), శుబ్​మన్ గిల్ (44 బంతుల్లో 93 నాటౌట్) బాదుడే పనిగా ఆడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ అరుదైన ఘనతను అందుకున్నారు.

సాయి సుదర్శన్-శుబ్​మన్ గిల్ కలసి ఫస్ట్ వికెట్​కు 15 ఓవర్లలోనే 190 పరుగులు జోడించారు. తద్వారా ఈ సీజన్​లో తొలి వికెట్​కు ఎస్​ఆర్​హెచ్ (ట్రావిస్ హెడ్-అభిషేక్ శర్మ) 167 పరుగుల భాగస్వామ్యం రికార్డును బద్దలు కొట్టారు. ఈ లిస్ట్​లో ఆర్సీబీ (విరాట్ కోహ్లీ-విల్ జాక్స్) 166 పరుగులు మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్​తో ఐపీఎల్ హిస్టరీలో అత్యంత వేగంగా 1,000 పరుగుల్ని పూర్తి చేసుకున్న భారతీయ ఆటగాడిగా సాయి సుదర్శన్ నిలిచాడు. అతడు 25 ఇన్నింగ్స్​ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. సచిన్ టెండూల్కర్ (31 ఇన్నింగ్స్​లు) రికార్డును అతడు బ్రేక్ చేశాడు.

Show comments