CSK vs PBKS MS Dhoni Denying Run Irfan Pathan: ధోని చేసింది ముమ్మాటికీ తప్పు.. ఎన్ని సిక్సులు కొట్టినా వేస్ట్: ఇర్ఫాన్ పఠాన్

MS Dhoni: ధోని చేసింది ముమ్మాటికీ తప్పు.. ఎన్ని సిక్సులు కొట్టినా వేస్ట్: ఇర్ఫాన్ పఠాన్

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మీద మాజీ ఆల్​రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సీరియస్ అయ్యాడు. మాహీ చేసింది ముమ్మాటికీ తప్పని అన్నాడు. ఇంతకీ ధోనీపై పఠాన్ ఎందుకు ఫైర్ అయ్యాడో ఇప్పుడు తెలుసుకుందాం..

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మీద మాజీ ఆల్​రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సీరియస్ అయ్యాడు. మాహీ చేసింది ముమ్మాటికీ తప్పని అన్నాడు. ఇంతకీ ధోనీపై పఠాన్ ఎందుకు ఫైర్ అయ్యాడో ఇప్పుడు తెలుసుకుందాం..

డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మరో ఓటమిని మూటగట్టుకుంది. సొంతగడ్డ మీద పంజాబ్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది సీఎస్​కే. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన రుతురాజ్ సేన ఓవర్లన్నీ ఆడి 7 వికెట్లకు 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. కష్టసాధ్యం కాని లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ మరో 13 బంతులు ఉండగానే విజయతీరాలకు చేరుకుంది. సీఎస్​కేను తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో కీలకపాత్ర పోషించిన పంజాబ్ స్పిన్నర్ హర్​ప్రీత్ బ్రార్ (2/17) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్​లో సీఎస్​కే ఇన్నింగ్స్ సమయంలో ధోని వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. ఈ విషయంపై భారత మాజీ ఆల్​రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు.

పంజాబ్​తో మ్యాచ్​లో ధోని చేసిన ఓ పని ఇప్పుడు కాంట్రవర్సీగా మారింది. చెన్నై ఇన్నింగ్స్ టైమ్​లో ఆఖరి ఓవర్ వేసేందుకు వచ్చాడు అర్ష్​దీప్ సింగ్. క్రీజులో మాహీతో పాటు డారిల్ మిచెల్ ఉన్నాడు. ఫస్ట్ బాల్ వైడ్ కాగా.. రెండో బంతిని బౌండరీగా మలిచాడు ధోని. ఆ తర్వాత మరో వైడ్ వేశాడు అర్ష్​దీప్. జోరు మీదున్న ధోని మూడో బాల్​ను బలంగా బాదాడు. కానీ సరిగ్గా కనెక్ట్ అవకపోవడంతో బాల్ గాల్లోకి లేచింది. నాన్​స్ట్రయికింగ్ ఎండ్​లో ఉన్న మిచెల్ పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే మాహీ అతడ్ని వెనక్కి వెళ్లమన్నాడు. అప్పటికే పరుగు అందుకున్న మిచెల్ ధోని వైపు క్రీజులోకి వెళ్లి.. మళ్లీ నాన్​స్ట్రయికింగ్ ఎండ్​ వైపు తిరిగి వచ్చేశాడు. ఫీల్డర్ త్రో విసిరినా బాల్ వికెట్లకు తగలకపోవడంతో మిచెల్ రనౌట్ ప్రమాదం నుంచి ఎస్కేప్ అయ్యాడు. దీంతో డారిల్​కు ధోని స్ట్రయికింగ్ ఇవ్వకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అతడు సెల్ఫిష్ అంటూ నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు.

మిచెల్ కూడా స్టార్ బ్యాటర్ అనేది తెలిసిందే. అదును చూసి బంతిని అవలీలగా బౌండరీలు, సిక్సులకు తరలించే విద్య అతడికీ తెలుసు. అయినా ధోని అతడ్ని నమ్మలేదు. దీంతో ఈ విషయంపై పఠాన్ రియాక్ట్ అయ్యాడు. మాహీ చేసింది ముమ్మాటికీ తప్పంటూ సీరియస్ అయ్యాడు. ‘మిచెల్ సింగిల్ తీద్దామంటే ధోని వద్దన్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఇది టీమ్ గేమ్. జట్టుగా ఆటగాళ్లందరూ కలసికట్టుగా ఆడే క్రీడలో ఇలాంటివి చేయకూడదు. నాన్​స్ట్రయికింగ్ ఎండ్​లో ఉన్నది కూడా ఇంటర్నేషనల్ ప్లేయరే. తర్వాతి మూడు బంతుల్లో ధోని మూడు సిక్సులు కొట్టినా వేస్ట్. ఒకవేళ అవతలి క్రీజులో బౌలర్ ఉంటే ఏదో అనుకోవచ్చు. కానీ స్పెషలిస్ట్ బ్యాటర్ ఉన్నప్పుడు రన్​ వద్దనడం సరికాదు. ఇలాంటి వాటిని ధోని నివారించాలి. అతడు ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదు’ అని పఠాన్ చెప్పుకొచ్చాడు. మరి.. ధోని రన్ తీసేందుకు వద్దనడం మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments