వాట్సాప్‌లో మెసేజ్‌ షెడ్యూల్ ఫీచర్.. ఇలా సెట్ చేసుకోండి..

వాట్సాప్‌లో మెసేజ్‌ షెడ్యూల్ ఫీచర్.. ఇలా సెట్ చేసుకోండి..

  • Published - 03:15 PM, Sat - 12 November 22
వాట్సాప్‌లో మెసేజ్‌ షెడ్యూల్ ఫీచర్.. ఇలా సెట్ చేసుకోండి..

మెసేజ్ షెడ్యూలింగ్ ఫీచర్ సాయంతో యూజర్లు తాము భవిష్యత్తులో సెండ్ చేయాలనుకునే మెసేజ్‌లను ఇప్పుడే టైప్ చేసి పెట్టుకోవచ్చు. అయితే ఇది వాట్సాప్‌లో లేదు కానీ, కొన్ని థర్డ్ పార్టీ యాప్స్‌తో ఈ సేవలను యాక్సెస్ చేసుకోవచ్చు.

పాపులర్ మెసేజింగ్ యాప్‌లలో ఒకటైన వాట్సాప్, ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో లేని ఎన్నో కొత్త ఫీచర్లను అందిస్తోంది. అయితే యూజర్లు కోరుకునే కొన్ని స్పెషల్ ఫీచర్లు మాత్రం వాట్సాప్‌లో ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. ఇలాంటి వాటిలో మెసేజ్ షెడ్యూలింగ్ ఒకటి. దీని సాయంతో యూజర్లు తాము భవిష్యత్తులో సెండ్ చేయాలనుకునే మెసేజ్‌లను ఇప్పుడే టైప్ చేసి పెట్టుకోవచ్చు. అయితే ఇది వాట్సాప్‌లో లేదు కానీ, కొన్ని థర్డ్ పార్టీ యాప్స్‌తో ఈ సేవలను యాక్సెస్ చేసుకోవచ్చు. తద్వారా బర్త్‌డే విషెస్, యానివర్సరీ శుభాకాంక్షలు చెప్పాలనుకునే వారు, ఆ తేదీకి మెసేజ్‌ను షెడ్యూల్ చేసి పెట్టుకోవచ్చు. యూజర్లు తక్షణమే మెసేజ్ పంపాల్సిన అవసరం లేకుండా, ఎంచుకున్న నిర్దిష్ట సమయంలో మెసేజ్‌ సెండ్ అయ్యేలా సెట్ చేయవచ్చు. మీ డివైజ్‌లో ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

ఐఫోన్‌లో ఇలా..
ఐఫోన్ యూజర్లు యాపిల్ యాప్ స్టోర్ నుంచి SKEDit అనే థర్డ్ పార్టీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలి. యాప్‌ ఓపెన్ చేసి ఆటోమేషన్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు + ఐకాన్‌పై క్లిక్ చేసి, ‘క్రియేట్ పర్సనల్ ఆటోమేషన్‌’ను క్లిక్ చేయాలి. పర్సనల్ ఆటోమేషన్‌ క్రియేట్ చేసిన తర్వాత, ‘time of day’ ఆప్షన్‌ను సెలక్ట్ చేసి ఆటోమేషన్‌ని షెడ్యూల్ చేయవచ్చు.

ఇక్కడ వాట్సాప్ మెసేజ్‌లను సెండ్ చేయాలనుకునే డేట్, టైమ్ ఎంటర్ చేసి, ‘నెక్ట్స్’ బటన్ ట్యాప్ చేయండి. తర్వాత ‘Add Action’ సెలక్ట్ చేసి, సెర్చ్ బార్‌లో Text అని టైప్ చేయండి. డ్రాప్ డౌన్ మెనులో మీకు టెక్ట్స్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మెసేజ్ డీటేల్స్ నింపాలి.

ఇప్పుడు టెక్స్ట్ ఫీల్డ్ కింద ఉన్న + ఐకాన్‌ను సెలక్ట్ చేయండి. పాప్-అప్ విండోలోని సెర్చ్ బార్‌లో ‘WhatsApp’ అని టైప్ చేయండి. డ్రాప్‌డౌన్‌లో ‘Send Message through WhatsApp’ని ఎంచుకోండి. తర్వాత రిసీపియంట్‌ను సెలక్ట్ చేసి, నెక్ట్స్ > డన్ ఆప్షన్స్ టోగుల్ చేయండి.

ఇలా మెసేజ్ షెడ్యూల్ అయినప్పుడు మీకు యాప్ ద్వారా నోటిఫికేషన్‌ వస్తుంది. దీనిపై క్లిక్ చేసిన తర్వాత, మీరు షెడ్యూల్ చేసిన క్యాంపెయిన్ మెసేజ్ విండో కనిపిస్తుంది. ఇక్కడ ‘సెండ్’ ఆప్షన్‌పై క్లిక్ చేయవచ్చు.

ఆండ్రాయిడ్‌లో ఎలా షెడ్యూల్ చేయాలి..?

ఆండ్రాయిడ్‌ యూజర్లు కూడా మెసేజ్ షెడ్యూల్ ఫీచర్‌ను SKEDit అనే థర్డ్ పార్టీ యాప్ ద్వారా పొందవచ్చు. ఇందుకు ముందు గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలి. అవసరమైన వివరాలను ఎంటర్ చేసి సైన్ అప్ చేయాలి. ఆ తర్వాత ఫోన్ సెట్టింగ్స్‌లో ‘ఎనేబుల్ యాక్సెసబిలిటీ’పై క్లిక్ చేసి SKEDit ను సెలక్ట్ చేయండి. తర్వాత సర్వీస్ టోగుల్ ఆన్ చేసి, సర్వీస్ ఎలో చేయండి.

ఇప్పుడు SKEDit యాప్‌లో వాట్సాప్‌ను సెలక్ట్ చేసి, మీరు మెసేజ్ సెండ్ చేయాల్సిన రిసీపియంట్ పేరును, మెసేజ్ వివరాలను ఎంటర్ చేయండి. ఇక్కడ డేట్, టైమ్‌ను షెడ్యూల్ చేయండి. మీరు మెసేజ్ ఫ్రీక్వెన్సీని డైలీ, వీక్లీ, మంత్లీ ఆప్షన్లకు కూడా సెట్ చేయవచ్చు.

షెడ్యూల్ మెసేజ్ బటన్‌ను ప్రెస్ చేసే ముందు అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోండి. లేదంటే మీరు ‘ఆస్క్ మి బిఫోర్ సెండింగ్’ ఆప్షన్‌ కూడా సెలక్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఆన్ చేస్తే.. మెసేజ్ సెండ్ అయ్యే ముందు మీకు నోటిఫికేషన్‌ వస్తుంది.

Show comments