మండిపోతున్న ఎండలు.. తెలుగు రాష్ట్రాలకు IMD అలర్ట్.. ఆ 130 మండలాల్లో

Heat Waves: మండిపోతున్న ఎండలు.. తెలుగు రాష్ట్రాలకు IMD అలర్ట్.. ఆ 130 మండలాల్లో

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ భగ మంటున్నాడు. వేసవి కాలం మొదలయ్యి పోయింది. సహజంగా మే నెలలో ఎక్కువగా ఉండే ఎండలు.. ఇప్పటినుంచే భగ్గుమంటున్నాయి. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ భగ మంటున్నాడు. వేసవి కాలం మొదలయ్యి పోయింది. సహజంగా మే నెలలో ఎక్కువగా ఉండే ఎండలు.. ఇప్పటినుంచే భగ్గుమంటున్నాయి. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.

రోజు రోజుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో.. ప్రజలంతా అల్లాడి పోతున్నారు. ఇప్పటినుంచే పగటి ఉష్ణోగ్రతలు 42 నుంచి 43 డిగ్రీలు వరకు నమోదు అవుతున్నాయి. భగ్గుమంటున్న భానుడి వేడి , వడగాల్పుల కారణంగా.. ముసలి వారు, చంటి బిడ్డలు తట్టుకోలేకపోతున్నారు. రానున్న రోజుల్లో ఈ ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ క్రమంలో అధికారులంతా ప్రజలను అపప్రమత్తం చేస్తున్నారు. వేసవి మొదట్లోనే భానుడి ప్రతాపం ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో ఇంకా.. సాధారణ ప్రజలు పెరిగే ఎండలకు తట్టుకోవడం కష్టమని చెప్పి తీరాలి. ఈ క్రమంలో ఏప్రిల్ 4 న ఏపీలో మొత్తంగా 130 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశాలు ఉన్నాయని.. ప్రజలంతా అపప్రమత్తంగా ఉండాలని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

కాగా, ఏప్రిల్ 3న ఏ ఏ జిల్లాలలో ఎంత ఉష్ణోగ్రతలు నమోదయ్యాయనే విషయానికొస్తే.. వైయస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా. అనంతపురం జిల్లా తెరన్నపల్లి, ప్రకాశం జిల్లా దరిమడుగు, నంద్యాల జిల్లా బ్రాహ్మణకొట్కూరులో 43.3 డిగ్రీలు, కర్నూలు జిల్లా లద్దగిరిలో 43.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదయ్యింది. అలాగే, కడప జిల్లా వీరాపునాయుని మండలంలో తీవ్రవడగాల్పులు వీచాయని.. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య ప్రాంతంలో .. అత్యవసరమైతే తప్పా ప్రజలెవ్వరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇక తెలంగాణలోను భానుడి ప్రతాపం.. ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పటికే తెలంగాణలో.. పలు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

ఈ క్రమంలో ఇప్పటివరకు.. తెలంగాణాలో నిర్మల్ జిల్లా నర్సాపూర్‌లో అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా. కరీంనగర్, వరంగల్, ములుగు జిల్లాలో 42, 43 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇక హైదరాబాద్ మహా నగరంలో 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. చందానగర్‌, ఖైరతాబాద్‌, మూసాపేట ప్రాంతాల్లో 41, 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. వీటితో పాటు వడగాల్పుల ప్రభావం కూడా ఎక్కువగా ఉండడంతో.. ప్రజలంతా ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 4న దాదాపు 130 మండలాలలో వడగాల్పులు వీచే అవకాశాలు ఉన్నట్లు.. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వాటికి సంబంధించిన జాబితా ఇలా ఉంది.

శ్రీకాకుళం జిల్లాలోని 4 మండలాలు, విజయనగరం జిల్లాలోని 19 మండలాలు, పార్వతీపురంమన్యం జిల్లాలో 12 మండలాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 4 మండలాలు, అనకాపల్లి జిల్లాలోని 13మండలాలు, కాకినాడ జిల్లాలో 9మండలాలు, తూర్పు గోదావరి జిల్లాలో 3 మండలాలు, కృష్ణా జిల్లాలో ఒక్క మండలం, ఎన్టీఆర్ జిల్లాలో 14 మండలాలు, గుంటూరు జిల్లాలో 5మండలాలు, పల్నాడు జిల్లాలో 6మండలాలు, నంద్యాల జిల్లాలో 19 మండలాలు, వైఎస్సార్ జిల్లాలో 20 మండలాలు, అనంతపురం జిల్లాలో ఒక్క మండలంలో గురువారం నాడు వడగాల్పులు వీచే అవకాశం ఉందని.. కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలు అపప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలియజేశారు.

Show comments