Reduced Fuel Prices: అదిరే శుభవార్త.. భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. కానీ!

అదిరే శుభవార్త.. భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. కానీ!

Reduced Fuel Prices: కొంత కాలంగా అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న పరిణామాలు పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇంధన ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.

Reduced Fuel Prices: కొంత కాలంగా అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న పరిణామాలు పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇంధన ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.

నేటి సమాజంలో ప్రయాణ సౌకర్యాలు బాగా పెరిగిపోయాయి. సుదూర ప్రాంతాలకు తక్కువ సమయంలో చేరుకునేందుకు వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల కాలంలో వాహనాలకు వినియోగించే పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్ఠ స్థాయిలో పెరిగిపోతూ వచ్చాయి. ఇంధన ధరల పెరుగుదలతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి. ఇలాంటి సమయంలో వాహనదారులకు ఊరట కలిగించే న్యూస్. ఇంధన ధరలు తగ్గుముఖం పట్టాయి. పెట్రోల్ పై రూ.5, డిజిల్ పై రూ.9 చొప్పున ధరలు తగ్గాయి. అంతర్జాతీయ దిగుమతి ప్రీమియం, ధరల తగ్గుదల కారణంగా ఇంధన ధరలు తగ్గినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో వాహనదారులు సంతోషంలో మునిగిపోయారు. ఈ ధరలు ఎక్కడ తగ్గాయి.. అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇలాంటి సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ ధరలు, దిగుమతి ప్రీమియం తగ్గుదల ప్రభావం ఇంధన ధరలపై చూపించింది. పెట్రోల్ పై రూ.5, హై స్పీడ్ డీజిల్ పై రూ.9 చొప్పన ధరలు తగ్గాయి. కాకపోతే ఈ ధరలు తగ్గింది మన భారత దేశంలో కాదు.. పాకిస్థాన్ లో అంటున్నారు. గత రెండు వారాల్లో అంతర్జాతీయ మార్కెట్ లో ఇంధన ధరలు వరుసగా బ్యారెల్ కు దాదాపు $3, $5 వరకు తగ్గినట్లు సమాచారం. ఇన్ ల్యాండ్ ఫ్రైట్ ఈక్వలైజేషన్ మార్టిన్ ఆధారంగా డీజిల్ ధరలు లీటర్ కు రూ. 8.50, పెట్రోల్ ధర లీటర్ కు రూ.4.50 నుంచి 5.20 వరకు తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే పెట్రోల్ దిగుమతి ప్రీమియం బ్యారెల్ కు 10.7 డాలర్ల నుంచి సుమారుగా 10 శాతం తగ్గి 9.60 డాలర్లకు చేరింది. డీజిల్ ధరలు సైతం బ్యారెల్ కు దాదాపు $5 వరకు తగ్గుముఖం పట్టింది. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్ లో పెట్రోల ధర 98.5 డాలర్ల నుంచి 96.6 డాలర్లకు, హెచ్ ఎస్ డీ ధర బ్యారెల్ కు 102.9 డార్ల నుంచి 97.5 డాలర్ల వరకు పడిపోయిందని అధికారులు తెలిపారు. వాస్తవానికి రెండు వారల క్రితం పాకిస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా లీటర్ కు రూ.4.53, రూ.8.14 పెంచింది. ఏప్రిల్ 30 వ తేదీ వరకు ఈ ధరలు కొనసాగాయి. మే1 నుంచి మాత్రం కొత్త ధరలు అందుబాటులోకి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత కొంత కాలంగా పాకిస్థాన్ లో తీవ్ర సంక్షోభంలో ఉందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఇంధన ధరలు తగ్గముఖం పట్టడం వాహనదారులకు ఊరటనిస్తుందని అంటున్నారు.

Show comments