Actress Sri Lakshmi: ఆమె నన్ను బాగా తిట్టింది.. అత్యాశకు పోయి ఆస్తులు పొగొట్టుకున్నా: నటి శ్రీలక్ష్మి

ఆమె నన్ను బాగా తిట్టింది.. అత్యాశకు పోయి ఆస్తులు పొగొట్టుకున్నా: నటి శ్రీలక్ష్మి

Actress Sri Lakshmi: తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది హాస్యనటులు తమదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అలాంటి వారిలో ప్రముఖ హాస్య నటి శ్రీలక్ష్మి ఒకరు.

Actress Sri Lakshmi: తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది హాస్యనటులు తమదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అలాంటి వారిలో ప్రముఖ హాస్య నటి శ్రీలక్ష్మి ఒకరు.

ధ‌నం మూలం ఇధం జ‌గ‌త్ అన్నారు పెద్దలు. ఈ కాలంలో డబ్బుంటే అన్నీ మన చుట్టు తిరుగుతాయని అంటారు.అందుకే ప్రతి ఒక్కరూ కోటీశ్వరులు కావాలనే కోరికతో ఉంటారు. అందు కోసం కొంతమంది అక్రమ మార్గంలో వెళ్తుంటే.. మరికొంతమంది అదృష్టాన్ని నమ్ముకుంటున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు తమ సంపద పెంచుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారి బలహీనత వరంగా మార్చుకుంటూ కేటుగాళ్లు నిండా ముంచుతున్నారు. తన జీవితంలో చేసిన తప్పుల వల్ల ఆస్తులు పోగొట్టుకున్నానని.. అత్యాశ తన కొంప ముంచిందని ప్రముఖ హాస్యనటి శ్రీలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..

తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ కమెడియన్లకు కొదవే లేదు. ఒకప్పుడు తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు ప్రముఖ హాస్య నటి శ్రీలక్ష్మి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఇండస్ట్రీకి ఎన్నో ఆశలతో వచ్చాను.. స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాను. ఇక్కడ నమ్మకంగా నటిస్తు వెన్నుపోటు పొడిచేవారు ఎంతోమంది ఉన్నారు. కొంతమంది నిమ్మ పెట్టుబడులు పెట్టి పెద్ద ఎత్తున నష్టపోయాను. మనిషికి అత్యాశ ఉండకూడదు అన్నది నా జీవితమే ఉదాహారణ. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మిగిలేది కొంతే. ఉన్నదాంట్లో తృప్తి చెందకుండా ఇంకా ఇంకా సంపాదించాలన్న ఆశ ఎప్పటికైనా కొంప ముంచుతుంది. టీ నగర్ లో ఫ్లాట్ తీసుకున్నా.. వలసరవాక్కంలో ఒక ఫ్లాట్ కొన్నాను. ఆ రెండు ఇండ్లు దేవుడు నాకు ఇచ్చాడు. టీ నగర్ లో ఒక ఇళ్లు కోటిన్నర విలువు చేస్తుంది. మరో ఇంటిపై రూ.40 వేల వరకు అద్దె వస్తుంది. వాటితో తృప్తి పడాల్సింది.. కానీ ఆశతో ‘ఈసీఆర్’ అనే రిసార్ట్ బిజినెస్ లో అడుగు పెట్టాను. అదే నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు.

చెన్నై బీచ్ సమీపంలో రీసార్ట్ లో హాఫ్ గ్రౌండ్ డూప్లెక్స్ ఇల్లు కట్టించాను. ఇందుకోసం టీ నగర్ లో ఇల్లు,వలసరవాకలోని ఇంటిని ప్లజ్ చేసి నెలకు రూ.30 వేల లోన్ కట్టాను. రిసార్ట్ లో లాభాలు వచ్చి తర్వాత ఆ రెండు ఇండ్లను విడిపించుకోవాలని ప్లాన్ వేశాను. కానీ కథ మొత్తం అడ్డం తిరిగింది. రీసార్ట్ కి డిమాండ్ లేక అక్కడ ఇల్లు ఎవరూ కొనకపోవడం.. ఇటు లోన్ భారం పెరిగిపోవడంతో ఏం చేయాలో తెలియక టీ-నగర్ లో ఇల్లు తక్కువ రేట్ కి రూ.45 లక్షలకు అమ్మి లోన్ క్లీయర్ చేసుకున్నా. ఆ తర్వాత రిసార్ట్ లోని డూప్లెక్స్ బంగ్లాను రూ.25 లక్షలకే అమ్మేశా.. ఈ రెండు ఇండ్లు పోయి నాకు వలసరవాక్కంలోని ఇల్లు ఒక్కటే మిగిలింది. అప్పట్లో రీసార్ట్ లో డూప్లెక్ బంగ్లా నిర్మిస్తున్న సమయంలో అన్నపూర్ణమ్మ నన్ను తిట్టారు..ఇలాంటి వ్యవహారాల్లో ఎందుకు అడుగు పెట్టావు అంటూ చివాట్లు పెట్టారు. అంతా నా కర్మ ఇలా అత్యాశకు పోయి ఉన్నది పోగొట్టుకోవడం విధిరాత అని సరిపెట్టుకున్నా’ అంటు శ్రీ లక్ష్మి చెప్పుకొచ్చారు.

Show comments