అనుకున్నదానికంటే ముందే OTT లోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే !

Family Star OTT: అనుకున్నదానికంటే ముందే OTT లోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే !

విజయ్ దేవరకొండ.. మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన "ఫామిలీ స్టార్" సినిమా.. థియేటర్ లో అయితే రిలీజ్ అయిపొయింది. అలాగే అదే సమయంలో ఈ సినిమా ఓటీటీ బజ్ కూడా బాగానే నడిచింది. అయితే ఈ సినిమా అనుకున్నదానికంటే ముందే ఓటీటీ లోకి వస్తుందని ఇన్సైడ్ టాక్.

విజయ్ దేవరకొండ.. మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన "ఫామిలీ స్టార్" సినిమా.. థియేటర్ లో అయితే రిలీజ్ అయిపొయింది. అలాగే అదే సమయంలో ఈ సినిమా ఓటీటీ బజ్ కూడా బాగానే నడిచింది. అయితే ఈ సినిమా అనుకున్నదానికంటే ముందే ఓటీటీ లోకి వస్తుందని ఇన్సైడ్ టాక్.

ప‌ర‌శురామ్ దర్శకత్వం వహించగా.. దిల్ రాజు నిర్మాతగా.. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్స్ గా ప్రేక్షకులను అలరించిన సినిమా “ఫ్యామిలీ స్టార్”. ఈ సినిమా ఏప్రిల్ 5 న భారీ అంచనాల మధ్యన థియేటర్స్ లో రిలీజ్ అయింది. మొదట ఈ సినిమా గురించి మిక్స్డ్ టాక్ వినిపించినా.. ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ ఏ సంపాదించుకుంది. అయితే, ఇక థియేటర్ లో రిలీజ్ అయిన టైమ్ లోనే .. ఆయా సినిమాల ఓటీటీ డీలింగ్స్ ముగుస్తున్నాయి. ఈ క్రమంలో ఫామిలీ స్టార్ డిజిటల్ రైట్స్ కూడా భారీ ధరలకే అమ్ముడుపోయాయని వార్తలు వినిపించాయి. అయితే, ఓటీటీ రూల్స్ ప్రకారం థియేటర్ లో విడుదలైన ఏ సినిమా అయినా.. నాలుగు నుంచి ఆరు వారాల తర్వాత ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వాలి. ఈ ప్రకారం మే మూడవ వారంలో ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ ఉండొచ్చు అని అంతా అనుకున్నారు. కానీ, ఇప్పుడు అనుకున్నదాని కంటే ముందే ఫ్యామిలి స్టార్ సినిమా ఓటీటీ లోకి రావొచ్చని ఇన్సైడ్ ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి.

అర్జున్ రెడ్డితో రగ్గడ్ లుక్ తో కనిపించినా.. గీతా గోవిందం సినిమాతో స్మార్ట్ గా కూడా కనిపించి.. తనకంటూ స్పెషల్ బ్రాండ్ నే క్రియేట్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇక సీతారామం సినిమాతో అందరి మదిని దోచేసిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. దీనితో వీరిద్దరూ ఫ్యామిలీ స్టార్ మూవీ కోసం జత కట్టడంతో.. ఈ సినిమాపై అందరు భారీ ఎక్స్పెక్టషన్స్ పెట్టుకున్నారు. దానికి తగినట్టే ప్రమోషన్స్ కూడా జరిగాయి. పైగా ఫామిలీ స్టార్ సినిమా పేరుకు తగినట్లే.. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచైతే పాజిటివ్ టాక్ సంపాదించుకోగలిగింది. కానీ, మిగిలిన ప్రేక్షకులకు మాత్రం నిరాశ మిగిల్చిందని అంటున్నారు సినీ ప్రియులు. ఇక థియేటర్స్ లో కూడా ఊహించినంత రేంజ్ లో రెవెన్యూ రాబట్టలేకపోయింది. కాబట్టి థియేట్రికల్ రన్ దాదాపు ఇంకా క్లోజింగ్ స్టేజ్ కు వచేసినట్లే. దీనితో అనుకున్న దానికంటే ముందే ఫ్యామిలీ స్టార్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

కాగా.. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్.. అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. సహజంగా థియేట్రికల్ రన్ పూర్తైన ఆరు వారాల తర్వాత అంటే.. మే రెండో వారం లేదా మూడో వారంలో ఈ సినిమా ఓటీటీలోకి రావాలి. కానీ, ఇపుడు అన్ని కుదిరితే ఏప్రిల్ 26 నుంచే ఫ్యామిలీ స్టార్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. ఒకవేళ ఆ డేట్ కనుక కుదరక పోతే.. మే 3 న మూవీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందట. అయితే అనుకున్న దాని ప్రకారం ఏప్రిల్ 19 న హిందీ రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేసిన మేకర్స్.. థియేటర్ లో వచ్చిన టాక్ చూసి.. హిందీ రిలీజ్ డ్రాప్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. గత వారం లాంగ్ వీకెండ్ రావడంతో ఒక మోస్తరుగా కలెక్షన్స్ రాబట్టినా కానీ.. ఆ తర్వాత మళ్ళీ తగ్గిపోవడంతో.. ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నారనే వార్తలైతే బాగానే వినిపిస్తున్నాయి. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments