మహేంద్రసింగ్ ధోనికి సర్జరీ? భవిష్యత్ పై ఫ్యాన్స్ ఆందోళన!

మహేంద్రసింగ్ ధోనికి సర్జరీ? భవిష్యత్ పై ఫ్యాన్స్ ఆందోళన!

ధోని ట్రీట్ మెంట్ కు సంబంధించిన ఓ న్యూస్ ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది. త్వరలోనే ధోనికి ఆపరేషన్ కానున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ధోని ట్రీట్ మెంట్ కు సంబంధించిన ఓ న్యూస్ ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది. త్వరలోనే ధోనికి ఆపరేషన్ కానున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ 2024 టోర్నీలో ప్లే ఆఫ్స్ కు చేరకుండానే నిష్క్రమించింది చెన్నై సూపర్ కింగ్స్. ఇక ఇదే ధోని చివరి ఐపీఎల్ అని, ఎలాగైనా చెన్నైకి కప్ తీసుకొచ్చి.. ఘనంగా క్రికెట్ కు వీడ్కోలు పలుకుతాడని ఫ్యాన్స్ అంతా భావించారు. కానీ వారి ఆశలు నిరాశగానే మిగిలాయి. అయితే ధోని ఈ సీజన్ ప్రారంభానికంటే ముందు నుంచే కండరాల గాయంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ధోని ట్రీట్ మెంట్ కు సంబంధించిన ఓ న్యూస్ ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది. త్వరలోనే ధోనికి ఆపరేషన్ కానున్నట్లు తెలుస్తోంది.

గత కొంత కాలంగా తొడ కండరాల గాయంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాడు ధోని. ఆ నొప్పిని భరిస్తూనే టీమ్, ఫ్యాన్స్ కోసం ఈ ఐపీఎల్ సీజన్ మెుత్తాన్ని ముగించాడు. బ్యాటింగ్ ఆర్డర్లో వెనక్కి రావడానికి కారణం కూడా ఇదే. ప్రస్తుతం ధోనికి సమయం చిక్కడంతో లండన్ వెళ్లి తొడ కండరాలకు సర్జరీ చేయించుకుంటాడని సీఎస్కే వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఈ ఆపరేషన్ నుంచి కోలుకోవడానికి కనీసం 5 నుంచి 6 నెలల వరకు పడుతుందని చెన్నై మేనేజ్ మెంట్ తెలిపింది. ధోని గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నాకే తన భవిష్యత్ పై నిర్ణయం తీసుకుంటాడని చెప్పుకొచ్చింది. కాగా.. సీఎస్కే మరో కీపర్ డెవాన్ కాన్వే సైతం గాయపడటంతో.. గాయం బాధిస్తున్నా ధోనినే కీపర్ గా బాధ్యతలు నిర్వర్తించాల్సి వచ్చింది. ఇక ఫ్యాన్స్ ధోని ఈ గాయం నుంచి త్వరగా కోలుకుని తమను అలరించడానికి రావాలని ప్రార్థిస్తున్నారు.

Show comments