Elections 2024 TSRTC Run Additional Buses: ఓటేసేందుకు వెళ్తున్నారా.. అయితే మీకోసం TSRTC గుడ్‌ న్యూస్‌

Elections 2024: ఓటేసేందుకు వెళ్తున్నారా.. అయితే మీకోసం TSRTC గుడ్‌ న్యూస్‌

రెండు తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఓటేయడానికి వెళ్తున్న వారికి టీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..

రెండు తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఓటేయడానికి వెళ్తున్న వారికి టీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమరం కొనసాగుతోంది. పోలింగ్‌కు మరో ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది. మే 13, సోమవారం నాడు పోలింగ్‌ జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలకు సోమవారం నాడు పోలింగ్‌ జరగనుండగా.. తెలంగాణలో లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. జూన్‌ 4న కౌంటింగ్‌ జరిపి.. ఫలితాలను వెల్లడిస్తారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఓటేసేందుకు సొంత ఊర్లకు వెళ్లడానికి రెడీ అవుతున్నారు. పోలింగ్‌కు ముందు ఆదివారం రావడంతో.. చాలా మంది ఓటేయడానికి ఊరికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓటేసేందుకు వెళ్తున్న వారికి టీఎస్‌ఆర్టీసీ సంస్థ శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..

తెలంగాణలో మే 13, సోమవారం నాడు లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ జరగనుంది. ఇక దానికి ముందు రెండో శనివారం, ఆదివారం సెలవులు వస్తుండటంతో.. చాలా మంది ఓటేయడానికి సొంత ఊరికి వెళ్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేల మంది ఉపాధి కోసం నగరానికి వచ్చి ఉన్నారు. ఓటు వేయడం కోసం వారంతా స్వగ్రామానికి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఇప్పటికే రైళ్లు ఫుల్లు అయ్యాయి. టికెట్లు దొరకడం లేదు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఇదే సందుగా అడ్డగోలుగా వసూలు చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. దీని వల్ల ఓటేయడానికి వెళ్లే వారికి ఊరట లభించనుంది.

నగరం నుంచి ఓటేసేందుకు వెళ్తేన్న ఏపీ వాసులకు టీఆఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. రద్దీని దృష్టిలో పెట్టుకుని.. అదనపు బస్సులను నడిపేందుకు రెడీ అయ్యింది. ఓటింగ్‌ నేపథ్యంలో ఈ నెల 9 నుంచే అనగా గురువారం నుంచే ఏపీకి రద్దీ ఉంటుందని.. శని, ఆదివారాల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని టీఎస్ఆ‌ర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ రెండు రోజుల సెలవు దినాలు కావడంతో సిటీ బస్సులను దూర ప్రాంతాలకు వెళ్లేలా సర్దుబాటు చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు. అలానే తెలంగాణలో పల్లెల్లో ఓట్లున్న వారు ఎన్నికల రోజు గ్రామాలకు వెళ్లి.. తిరిగి వచ్చేందుకు గాను తెల్లవారుజాము నుంచి.. అర్థరాత్రి వరకు బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఈ నిర్ణయంపై జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

టీఎస్‌ఆర్టీసీతోపాటు ఈనెల 9 నుంచి 12 వరకు రోజూ నడిచే 352 బస్సులకు అదనంగా 500 బస్సులను నడుపుతున్నామని ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. అదనపు బస్సుల్లోనూ రిజర్వేషన్‌ సౌకర్యం ఉంటుందని తెలిపారు. టీఎస్‌ఆర్టీసీ రోజూ నడిచే 3,450 బస్సులకు అదనంగా వెయ్యికిపైగా బస్సులను సిద్ధంగా ఉంచుతోంది. 200 బస్సుల్లో రిజర్వేషన్‌ సౌకర్యం కల్పిస్తున్నామని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.

Show comments