ఏడాది ముందు నుంచే OTTలో మంజుముల్ బాయ్స్ లాంటి సినిమా! ఎలా మిస్ అయ్యాము?

OTT Movie Suggestion: ఏడాది ముందు నుంచే OTTలో మంజుముల్ బాయ్స్ లాంటి సినిమా! ఎలా మిస్ అయ్యాము?

డిఫ్ఫరెంట్ కాన్సెప్ట్స్ తో వచ్చే సినిమాలన్నీ కూడా ఈ మధ్య కాలంలో బాగా హిట్ అవుతున్నాయి. అందులోను ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాలను చూసిన ప్రేక్షకులు అలాంటి సినిమాలు ఇంకా ఏమైనా ఉన్నాయా అని సెర్చ్ చేస్తూ ఉన్నారు.

డిఫ్ఫరెంట్ కాన్సెప్ట్స్ తో వచ్చే సినిమాలన్నీ కూడా ఈ మధ్య కాలంలో బాగా హిట్ అవుతున్నాయి. అందులోను ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాలను చూసిన ప్రేక్షకులు అలాంటి సినిమాలు ఇంకా ఏమైనా ఉన్నాయా అని సెర్చ్ చేస్తూ ఉన్నారు.

మొదటి నుంచి సినిమాలాంటి అందరికి ఆసక్తి ఉన్నా కానీ.. ఈ మధ్య కాలంలో మాత్రం ఒక పెర్టిక్యులర్ జోనర్ కు సంబందించిన సినిమాలను చూసేందుకు ఎక్కువ ఇష్టపడుతున్నారు ప్రేక్షకులు. ఇక ప్రేక్షకుల ఆదరణను దృష్టిలో ఉంచుకుని.. ఆయా జోనర్ సినిమాలను మరింత ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించేందుకు.. మేకర్స్ కూడా కష్టపడుతున్నారు. అయితే, రీసెంట్ గా మంజుమ్మేల్ బాయ్స్ చేసిన సందడితో ఆలాంటి సినిమాలు ఇంకా ఏమైనా ఉన్నాయేమో అని సెర్చింగ్ చేస్తున్నారు.. అలాంటి వారి కోసం ఓటీటీ లో ఓ అద్భుతమైన సర్వైవల్ థ్రిల్లర్ ఉంది. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సినిమా పేరు “థర్టీన్ లైవ్స్ “. నిజ జీవిత సంఘటనల నుంచి ఆధారంగా తీసుకుని వచ్చిన సినిమాలు ఏవైనా కానీ.. మంచి రెస్పాన్స్ నే తెచ్చుకుంటాయి. ఇప్పటివరకు అలాంటి సినిమాలన్నిటిని కూడా ప్రేక్షకులు ఆదరించారు. ముఖ్యంగా మంజుమ్మేల్ బాయ్స్ లాంటి సర్వైవల్ థ్రిల్లర్స్ కు మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ థర్టీన్ లైవ్స్ మూవీ కూడా ఇలాంటి ఓ సర్వైవల్ థ్రిల్లర్ ఏ. 2018 లో థాయిలాండ్ లో జరిగిన ఓ యదార్ధ సంఘటన ఈ సినిమా.. ఓ కోచ్ తో పాటు 12 మంది పిల్లలు గుహలో చిక్కుకుపోయిన సంఘటన ఆ సమయంలో యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. పైగా తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి.

ఇక థర్టీన్ లైవ్స్ సినిమా కథ విషయానికొస్తే.. థాయిలాండ్ లోని.. చియాంగ్ రాయ్ రాష్ట్రంలో ఉండే లువాంగ్ గుహలు ఎంతో ప్రసిద్ధి చెందినవి. అయితే, ఓ రోజు 12 మంది ఫుట్ బాల్ టీమ్ పిల్లలు తమ కోచ్ తో కలిసి.. ఆ గుహను చూసేందుకు వెళ్తారు. అదే సమయంలో ఆ దగ్గరలోని ప్రాంతమంతా కూడా భారీ వర్షం కురుస్తుంది. ఆ గుహ లోకి కూడా మెల్లగా వర్షపు నీరు రావడంతో.. పిల్లలంతా కూడా గుహ లోపలికి వెళ్ళిపోతారు. వర్షం కారణంగా ఆ గుహ పూర్తిగా మూసుకుపోతుంది. వారికి బయటకు వెళ్లే అవకాశం లేక.. అదే గుహలో చిక్కుకుపోతారు. ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా వెళ్లడంతో.. వారి తల్లి దండ్రులు ఆందోళన చెందుతూ ఉంటారు. వారు ఆ గుహలోనుంచి బయటపడ్డారా లేదా! వారిని రక్షించేందుకు థాయ్ రెస్క్యూ టీమ్ ఎలాంటి చర్యలు చేపట్టింది ! చిన్నారులంతా బిక్కు బిక్కు మంటూ ఎలా తమ ప్రాణాలను నిలబెట్టుకోగలిగారు ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments