దెయ్యం సినిమాల్లో ఇంతకు మించిన భయపెట్టే సినిమా లేదు! వణికిపోతారు!

OTT Movie Suggestion: దెయ్యం సినిమాల్లో ఇంతకు మించిన భయపెట్టే సినిమా లేదు! వణికిపోతారు!

తెలుగు హర్రర్ సినిమాలు నచ్చే వారికి ఈ హర్రర్ సినిమా కూడా ఖచ్చితంగా నచ్చేస్తుంది . ఓ యూనిక్ కాన్సెప్ట్ తో హర్రర్ సినిమా చూడాలనుకుంటే మాత్రం ఈ సినిమా బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాలి. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

తెలుగు హర్రర్ సినిమాలు నచ్చే వారికి ఈ హర్రర్ సినిమా కూడా ఖచ్చితంగా నచ్చేస్తుంది . ఓ యూనిక్ కాన్సెప్ట్ తో హర్రర్ సినిమా చూడాలనుకుంటే మాత్రం ఈ సినిమా బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాలి. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

హర్రర్ సినిమాలో ఎన్నో వస్తాయి కానీ తెలుగులో వచ్చిన అన్ని హర్రర్ సినిమాలలో కొన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఉంటూ ఉంటాయి, మరి హర్రర్ సినిమాలంటే ఇష్టపడే వారు ఈ సినిమాను మిస్ చేసి ఉంటె మాత్త్రం వెంటనే చూసేయండి. ఖచ్చితంగా ఇది ఒక వర్త్ వాచింగ్ హర్రర్ ఫిల్మ్ అవుతుంది. ఎంత భయపడుతున్నా సరే.. హర్రర్ సినిమాలను చూడడం మాత్రం ఎవరు మిస్ అవ్వడం లేదు. కానీ కొన్ని సార్లు ఆయా సినిమాలకు బజ్ లేకపోవడం వలనో.. లేదా స్టార్ క్యాస్టింగ్ లేకపోవడం వలనో కొన్ని సినిమాలను మిస్ అవుతూ ఉంటారు మూవీ లవర్స్. మరి మీరు మిస్ చేసిన సినిమాలలో కనుక ఈ సినిమా కూడా అదేమో ఓ లుక్ వేసేయండి. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా పేరు “గృహం”. ఈ సినిమాన ది హౌస్ నెక్ట్ డోర్ అనే సినిమాకు డబ్బింగ్ గా రూపొందించారు. ఈ సినిమాలో సిద్ధార్థ్, ఆండియ్రా జెర్మియా, అనీషా ఏంజెలీనా విక్టర్, అతుల్ కులకర్ణి, సురేష్ ప్రధాన పాత్రలలో నటించారు. కాగా ఈ సినిమాకు మిలింద్ రావ్ దర్శకత్వం వహించారు. 2018 లో ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయింది. ఆ సమయంలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. పైగా ఈ సినిమాను థియేటర్ లో చూసిన వారికి రెండు రోజుల వరకు కూడా.. ఆ సీన్స్ మైండ్ లోనే తిరుగుతూ ఉన్నాయట. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు ఈ సినిమా హర్రర్ కంటెంట్ తో.. ప్రేక్షకులను ఎంత ఎంగేజింగ్ గా ఉంచుతుందో. కాబట్టి ఈ సినిమాను అప్పుడు ఎవరైనా మిస్ అయితే మాత్రం ఇప్పుడు..ఎం జియో సినిమా ఓటీటీ లో అందుబాటులో ఉంది. చూసేయండి.

ఈ సినిమా కథేంటి ఎందుకు ఈ సినిమా చూడాలి అనే విషయానికొస్తే.. సిద్దార్ధ్ మంచి పేరొందిన బ్రెయిన్ సర్జన్.. హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో తన భార్యతో కలిసి హాయిగా తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అంత సవ్యంగా సాగుతుంది అనుకునే క్రమంలో.. సరిగ్గా అదే సమయంలో వారి పక్కన ఉన్న ఇంట్లోకి ఈ ఫ్యామిలీ దిగుతుంది. ఆ ఇంట్లో ఓ అమ్మాయి విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అసలు వారి ఇంట్లో ఏమి జరుగుతుంది ! సరిగ్గా ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాతే ఆమెకు ఎందుకు అలా అవుతుంది ! వారి ఇంట్లో చోటు చేసుకున్న భయంకరమైన పరిస్థితులు ఏంటి ! ఆ ఇంటికి సిద్దార్ధ్ కు ఉన్న సంబంధం ఏంటి ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments