ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో రాబోయే సినిమాలు, సిరీస్ లు ఇవే! ఆ 2 మాత్రం మిస్ కాకండి!

Netflix Releases: ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో రాబోయే సినిమాలు, సిరీస్ లు ఇవే! ఆ 2 మాత్రం మిస్ కాకండి!

ఈ వారం ఎన్నో అద్భుతమైన సినిమాలు, సిరీస్ లు ఓటీటీ లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి వాటిలో ఈ సిరీస్ లను, సినిమాలను అస్సలు మిస్ కాకండి . మరి ఇంతకీ ఆ సినిమాలేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలను చూసేద్దాం.

ఈ వారం ఎన్నో అద్భుతమైన సినిమాలు, సిరీస్ లు ఓటీటీ లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి వాటిలో ఈ సిరీస్ లను, సినిమాలను అస్సలు మిస్ కాకండి . మరి ఇంతకీ ఆ సినిమాలేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలను చూసేద్దాం.

వీకెండ్ వచ్చిందంటే రెండు రోజులు ముందు నుంచే ఏ సినిమా ఏ ఓటీటీ లోకి వచ్చింది, ఏ ఏ సినిమాలకు ఎంత రేటింగ్ వచ్చింది అనే విషయాలను చెక్ చేస్తూ ఉంటారు మూవీ లవర్స్. దానికి సంబంధించిన అప్ డేట్స్ కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ లో అందుబాటులో ఉంటున్నాయి. ఇప్పటికే ఈ వారం ఏ ఏ సినిమాలు, సిరీస్ లు ఏ ఏ ప్లాట్ ఫార్మ్స్ లో అందుబాటులో ఉంటున్నాయి అనే లిస్ట్ వచ్చేసింది. మూవీ లవర్స్ కూడా దానికి తగినట్టు ప్లాన్ చేసుకునే ఉంటారు. మరి వాటిలో ఈ వారం మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలేంటో.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో.. ఆ సినిమాల కథేంటో చూసేద్దాం.

ఈ వారం నెట్ ఫ్లిక్స్ మంచి ఇంట్రెస్టింగ్ సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవ్వబోతున్నాయి. వాటిలో మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ కూడా ఉండడంతో .. దానిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోయే సినిమాలు/ సిరీస్ ల జాబితా ఇలా ఉంది.

1. హిరామండి : ది డైమండ్ బజార్ ( వెబ్ సిరీస్ ) – మే 01
ఈ సిరీస్ ను బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేయడంతో.. దీనిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులంతా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. పైగా ఈ సిరీస్ తెలుగులో కూడా రిలీజ్ కానుంది. పైగా ఈ సిరీస్ కు భారీ బడ్జెట్ ను కేటాయించారు మేకర్స్, అందులోను ఇది ఓ రియల్ స్టోరీని బేస్ చేసుకుని రూపొందించడంతో.. అందరికి మరింత ఎక్కువ ఆసక్తి నెలకొంది.

2. టీ పీ బన్ (జపనీస్ సిరీస్) – మే 02
ఇది ఒక జాపనీస్ యానిమేటెడ్ సిరీస్. ఇప్పుడున్న జెనెరేషన్ అంతా కూడా ఇలాంటి సిరీస్ లను చూసేందుకు ఇష్టపడుతున్నారు, బాన్ అనే ఓ నార్మల్ స్కూల్ స్టూడెంట్.. ప్రపంచంలో ఉన్న అన్ని ప్రదేశాలలో జరిగే కొన్ని సంఘటనల సమయంలో ప్రజల ప్రాణాలను రక్షించే పనిలో ఉన్న టైం ట్రావెలింగ్ టీమ్ తో భాగం అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే కథ. ఇంట్రెస్టింగ్ కథనాలతో ఈ సిరీస్ ను తెరకెక్కించారు.

3.సైతాన్ (హిందీ సినిమా) – మే 03
అజయ్ దేవగన్, ఆర్ మాధవన్, జ్యోతిక ముగ్గురు కలిసి నటించిన.. హర్రర్ సినిమా “సైతాన్”. థియేటర్ లో బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లో కూడా తన సత్తా చూపించేందుకు రెడీ అయిపొయింది. దీనితో ప్రేక్షకులంతా ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ కోసం ఎంతో ఎదురుచూస్తున్నారు. కాబట్టి ఈ సినిమాను అస్సలు మిస్ కాకండి. ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో ఈ సినిమా 7.2 రేటింగ్ దక్కించుకుంది.

4. ద అటిపికల్ ఫ్యామిలీ (కొరియన్ సిరీస్) – మే 04
ఈ మధ్య కాలంలో కొరియన్ సినిమాలను ఇష్టపడని వాళ్ళు ఉండడం లేదు. దీనితో కొరియన్ సినిమాలు, తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతూ మూవీ లవర్స్ ను మెప్పించేస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ సిరీస్ కూడా కొరియన్ లవర్స్ ను ఖచ్చితంగా మెప్పించేస్తుంది. ఓ కుటుంబానికి అతీంద్రియ శక్తీ సామర్ధ్యాలు ఉంటాయి. గతంలో జరిగిన క్షణాలను కూడా తిరిగి చూడగలుగుతారు, అయితే డిప్రెషన్ వలన అతను ఆ శక్తిని కోల్పోతాడు. అతని కుటుంబం కూడా అలానే మెల్లగా శక్తులను కోల్పోతుంది. తిరిగి వారంతా వారి శక్తులను ఎలా సంపాదించుకున్నారు. ఈ క్రమంలో వారికి ఎవరు హెల్ప్ చేశారు అనేది ఈ సిరీస్ కథ.

మరి నెట్ ఫ్లిక్స్ లో ఈ వారం రిలీజ్ కాబోయే సినిమాలు, సిరీస్ లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments