Devineni Uma: మాజీ మంత్రి ఉమాకు హ్యాండ్ ఇచ్చిన చంద్రబాబు!

Devineni Uma: మాజీ మంత్రి ఉమాకు హ్యాండ్ ఇచ్చిన చంద్రబాబు!

శుక్రవారం టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. ఇందులో 11 అసెంబ్లీ స్థానాలతో పాటు 13 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను టీడీపీ అధిష్టానం ప్రకటించింది. అయితే ఈ లిస్టు లో కూడా పలువురు సీనియర్లకు షాక్ తగిలింది.

శుక్రవారం టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. ఇందులో 11 అసెంబ్లీ స్థానాలతో పాటు 13 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను టీడీపీ అధిష్టానం ప్రకటించింది. అయితే ఈ లిస్టు లో కూడా పలువురు సీనియర్లకు షాక్ తగిలింది.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడీ రోజూ రోజుకీ రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అధికార, విపక్షలు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. అధికార వైఎస్సార్ సీపీ  175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి.. ఎన్నికల ప్రచారంలో దూకుడు మీద ఉంది. 175  స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ ఎన్నికల రణరంగంలోకి దిగింది. ఇది ఇలా ఉంటే…తాజాగా శుక్రవారం టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల విడుదలైంది. 11 అసెంబ్లీ స్థానాలతో పాటు 13 ఎంపీ స్థానాలకు కూడా టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఈ జాబితాలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాకు బాబు షాక్ ఇచ్చారు.

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నమ్మించి మోసం చేయడంలో దిట్టని చాలా మంది అభిప్రాయా పడుతుంటారు. వంచన, మోసం, వెన్నుపోటులతోనే ఆయన రాజకీయం చేస్తారనే ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు. ఆ మాటలను నిజం చేస్తూనే  చంద్రబాబు చాలామందిని టికెట్ ఇస్తానంటూ చివర్లో హ్యాండ్ ఇచ్చారు. ఇక చంద్రబాబు రాజకీయ ధోరణి తెలిసిన వారు అనేక అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక నియోజవర్గంలో ఇద్దరు, ముగ్గురికి నీకంటే నీకే టికెట్ అని నమ్మించి…బీ ఫామ్ ఇచ్చే సమయంలో ఊహించని  షాకులిస్తుంటారని పలువురు చెబుతుంటారు. ఇంక తన రాజకీయ భవిష్యత్ కోసం నమ్మిన వారిని, తన వెంట నడిచిన వారిని కూడా  నిండ ముంచేస్తారనే టాక్ ఉంది.

అంతేకాక నమ్మించి వెన్నుపోటు పొడుస్తాడనే, సాక్ష్యాత్తు మాజీ సీఎం ఎన్టీఆర్ కే వెన్నుపోటు పొడిచిన ఘనడు చంద్రబాబు అని వైసీపీ నేతలు చెబుతుంటారు. ఇక పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా ప్రక్క పార్టీ నుంచి చివరి నిమిషంలో వచ్చిన వారికి చంద్రబాబు పెద్ద పీట వేస్తుంటారు. ఇదే విషయంలో ఇటీవల విడుదల చేసిన తొలి రెండు జాబితాల్లో స్పష్టంగా కనిపించింది. ఎప్పటి నుంచి పార్టీ కోసం పని చేసి సీనియర్ నేతలను కాదని, బాగా డబ్బు ఖర్చు పెట్టే ఎన్నారైలకు, అధికార పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్ కేటాయించారు. మాజీ మంత్రి పీతల సుజాతే స్వయంగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఇక తాజాగా విడుదల టీడీపీ అభ్యర్థుల మూడో జాబితాలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు పేరు లేదు. అలానే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు శివరాం కి కూడా చంద్రాబాబు హ్యాండ్ ఇచ్చారు.

టీడీపీ ముఖ్యనేతల్లో  దేవినేని ఉమ ఒకరు. తాజాగా జాబితాలో మైలవరం నియోజవర్గానికి వైసీపీ నుంచి వచ్చిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కి టీడీపీ టికెట్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ  దేవినేని ఉమా ఇన్ ఛార్జీగా ఉన్నారు. చంద్రబాబు తరువాత  పార్టీలోని ముఖ్యనేతల్లో ఆయన  ఒకరు. ఆయనకు టికెట్ రాదు అని ఎవ్వరూ ఊహించరు. అయితే చంద్రబాబు రాజకీయలకు ఎలాంటి వారైన బలి కావాల్సిందేనని తాజాగా ఘటన సాక్ష్యమని పలువురు అభిప్రాయా పడుతున్నారు. మొత్తంగా చంద్రబాబు మాజీ మంత్రి దేవినేని ఉమాకు వెన్నుపోటు పొడిచారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు.

Show comments