David Warner Opens On SRH Blocking Him: SRH చేసిన ఆ పనికి వార్నర్ ఎమోషనల్. . మనసులో ఇంత బాధ దాచుకున్నాడా?

SRH చేసిన ఆ పనికి వార్నర్ ఎమోషనల్. . మనసులో ఇంత బాధ దాచుకున్నాడా?

David Warner- SRH: డేవిడ్ వార్నర్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మధ్య చాలానే జరిగాయి. వాటిపై తొలిసారి వార్నర్ ఓపెన్ కామెంట్స్ చేశాడు.

David Warner- SRH: డేవిడ్ వార్నర్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మధ్య చాలానే జరిగాయి. వాటిపై తొలిసారి వార్నర్ ఓపెన్ కామెంట్స్ చేశాడు.

డేవిడ్ వార్నర్.. ఈ పేరు తెలియని ఇండియన్ క్రికెట్ ఫాన్స్ ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు. ఆస్ట్రేలియా కంటే వార్నర్ కు ఇండియా లోనే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. ఐపీల్లో వార్నర్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి వచ్చిన తర్వాత డేవిడ్ వార్నర్ ను తెలుగు ఫాన్స్ సొంత మనిషిలా చూసుకున్నారు. వార్నర్ కి కూడా తెలుగు ఫ్యాన్స్ అంటే ఎనలేని అభిమానం. ఐతే హైదరాబాద్ టీం వార్నర్ విషయం లో కొన్ని పొరపాట్లు చేసిన విషయం తెలిసిందే. వాటిపై వార్నర్ చాలా తక్కువ సార్లు స్పందించాడు. మొదటిసారి తన మనసులో ఉన్న విషయాన్నీ బయట పెట్టాడు.

స్టార్ స్పిన్నర్ అశ్విన్ హోస్ట్ గా ఇంటర్వ్యూ కూడా చేస్తూ ఉంటాడు. తాజాగా డేవిడ్ వార్నర్ ను అశ్విన్ ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూలో వార్నర్ చాలానే విషయాలు పంచుకున్నాడు. హైదరాబాద్ విషయంలో కాస్త ఎమోషనల్ కూడా అయ్యాడు . “ఇండియా అన్నా.. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అన్నా నాకు ఏంటో ఇష్టం. ఇక్కడి కల్చర్ అంటే నాకు అభిమానం. నాకు ఇండియాలో సొంతిల్లు లేదు. కానీ క్రికెట్ నుంచి పూర్తిగా దూరమైన తర్వాత ఇండియాకి వచ్చేందుకు ఇష్ట పడతాను. ఆస్ట్రేలియాలో ఎక్కడ చుసిన నెగిటివ్ వైబ్స్ ఉంటాయి. కానీ ఇండియాలో అలా కాదు. అంత పాజిటివ్ గా ఉంటుంది. నేను సెక్యూరిటీ లేకుండానే బయటకు వెళ్తూ ఉంటాను. కాకపోతే చిన్న గ్రామాలు, న కుటుంబంతో బయటకి వెళ్ళినపుడు సెక్యూరిటీ పెట్టుకుంటాను. ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఫ్యాన్స్ కూడా అర్థం చేసుకోవాలి” అంటూ డేవిడ్ వార్నర్ చెప్పుకొచ్చాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో డేవిడ్ వార్నర్ కు జరిగిన అవమానాలను అభిమానులు ఇప్పటికి మర్చిపోలేరు. అతడిని కెప్టెన్ గా తప్పించారు. బెంచ్ కె పరిమితం చేశారు. డ్రింక్స్ మొయియించారు. ఆఖరికి సోషల్ మీడియాలో వార్నర్ కి హైదరాబాద్ జట్టు బ్లాక్క్ కూడా చేసింది. ఆ విషయాలపై వార్నర్ పెద్దగా మాట్లాడలేదు. కానీ మొదటిసారి తానూ బాధపడిన విషయాన్ని బయటపెట్టాడు. “ఇంకా హైదరాబాద్ టీం గురించి చెప్పాలంటే.. వాలు నన్ను ఎందుకు బ్లాక్ చేశారో నాకు ఇప్పటికి అర్థం కాలేదు. వాళ్ళు బ్లాక్ చేసిన విషయం తెలిశాక చాలా బాధగా అనిపించింది. ఇప్పటికి ఆ బాధ ఉంది. హైదరాబాద్ ఫ్యాన్స్ కూడా నా పేజ్ లోకి వచ్చి చాలా విషయాలు డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇండియన్ ఫ్యాన్స్ చూసినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది” అంటూ డేవిడ్ వార్నర్ తన మనసులో ఉన్న విషయాన్ని పంచుకున్నాడు.

Show comments