Uttar Pradesh News: విడాకులు తీసుకున్న కూతురిని భాజా భజంత్రీలతో తీసుకువచ్చిన తండ్రి!

విడాకులు తీసుకున్న కూతురిని భాజా భజంత్రీలతో తీసుకువచ్చిన తండ్రి!

Uttar Pradesh News: పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు.. ఈ మధ్య పైళ్లైన కొంత కాలానికే భార్యాభర్తల మద్య చిన్న చిన్న గొడవలు చిలికి చిలికి గాలివానగా మారి విడాకుల వరకు వెళ్తున్నాయి.

Uttar Pradesh News: పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు.. ఈ మధ్య పైళ్లైన కొంత కాలానికే భార్యాభర్తల మద్య చిన్న చిన్న గొడవలు చిలికి చిలికి గాలివానగా మారి విడాకుల వరకు వెళ్తున్నాయి.

హిందూ సంప్రదాయంలో వివాహ వ్యవస్థకు ఎంతో గౌరవం ఉందన్న విషయం తెలిసిందే. వివాహం అంటే అంత ఆశామాశీ వ్యవహారం కాదు. ఇరు కుటుంబాలు అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసుకొని తమ అంతస్థుకు తగిన విధంగా అన్ని వ్యవహారాల్లో ఆచీ తూచీ నిర్ణయాలు తీసుకుంటారు. వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంటను నిండు నూరేళ్లు కలిసి ఉండాలని పెద్దలు దీవిస్తారు. ఈ మధ్య కాలంలో చాలా జంటలు పెళ్లైన కొంత కాలానికే వివిధ కారణాల వల్ల విడాకులు తీసుకుంటున్నారు. తాజాగా  ఉత్తర్ ప్రదేశ్ లో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది.  విడాకులు తీసుకున్న తన కూతురిని బ్యాండ్ భాజాలతో తమ ఇంటికి తీసుకువచ్చాడు ఓ తండ్రి. విరాల్లోకి వెళితే..

ఈ మధ్య కాలంలో పెళ్లైన కొంత కాలానికే భార్యాభర్తల మద్య ఏర్పడ్డ వివాదాలు చిలికి చిలికి గాలివానగా మారి విడాకుల వరకు వెళ్తున్నాయి. అత్తగారింటికి వెళ్లిన తర్వాత తమ భర్తతో సంతోషంగా ఉండాలని ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు కోరుకుంటారు. ఏవైనా చిన్న చిన్న సమయస్యలు వచ్చినా కూతురుకి సర్ధి చెప్పి అత్తవారింటి వద్ద ఉండాలని చెబుతారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. భర్త, అత్త మామల వేధింపులు తట్టుకోలేక ఆ మహిళ భర్తతో సంబంధాలు తెంచుకుంది. తమ కూతురు పడుతున్న కష్టాల గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు భాజా భజంత్రీలతో అత్తారింటికి వెళ్లాడు. అక్కడ నుంచి నవ్వుతూ.. సంతోషంగా పాటలు పాడుతూ తమ కూతురుని బ్యాండ్ భాజాలతో తమ ఇంటికి తీసుకొని వచ్చారు.

ఆ మహిళ పేరు ఊర్వి.. వయసు 36 సంవత్సరాలు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఉర్వీ ఢిల్లీలోని పాలం విమానాశ్రమంలో జాబ్ చేస్తుంది. ఏనిమదేళ్ల క్రితం ఉర్వికి విమాన్ నగర్ కి చెందిన ఆశిష్ రంజన్ తో వివాహం జరిగింది. ఆశిష్ కంప్యూటర్ ఇంజనీర్.. భార్యాభర్తలు ఢిల్లీలో ఉంటున్నారు. పెళ్లైన కొత్తలో దంపతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ జంటకు ఒక కూతురు.ఇటీవల కాలంలో భర్త, అత్తమామలు ఉర్వీని దారుణంగా హింసించడం మొదలు పెట్టారు. దీంతో విసిగిపోయిన ఉర్వీ తన భర్తకు విడాకులు ఇచ్చింది. ఈ విషయం తెలిసిన తల్లిండ్రులు పెళ్లి సమయంలో ఎలాగైతే అత్త వారింటికి భాజా భజంత్రీలతో పంపించారో.. విడాకులు తీసుకున్న తర్వాత కూడా అలాగే తమ ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకొని ఈ పని చేశామని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Show comments